సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో గురువారం నిర్వహించిన ఎన్‌క్యూపీ (న్యూ క్వాలి టీ పాలసీ) సెమినార్‌ను ప్రభుత్వ సాంఘిక సంక్షే మ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బహిష్కరించారు.
ఎన్‌క్యూపీ సెమినార్ బహిష్కరణ
Published Fri, Sep 2 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో గురువారం నిర్వహించిన ఎన్‌క్యూపీ (న్యూ క్వాలి టీ పాలసీ) సెమినార్‌ను ప్రభుత్వ సాంఘిక సంక్షే మ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బహిష్కరించారు.
సెమినార్‌కు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 22 మంది ఉపాధ్యాయులను ఎంపిక చే శారు. కేవలం ఇద్దరే హాజరుకాగా.. మిగిలినవారు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల జేఏసీ నాయకులు కె. వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేసే విధంగా సీసీ కెమెరాల నిఘాలో ఎన్‌క్యూపీ సెమినార్ నిర్వహించడం సమంజసం కాదన్నారు. దీనిని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరేందర్‌రెడ్డి, యాదయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement