ఎన్క్యూపీ విధానంతో విజ్ఞానం
∙సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్
స్టేషన్ ఘన్ పూర్ : ఎన్క్యూపీ విధానంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల్లో విజ్ఞా నం, శాస్త్రీయ దృక్ఫథం పెంపొందుతుందని సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్థానిక సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఏర్పాటుచేసిన ఎన్క్యూపీ సెమినార్ ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ప్రవీణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్క్యూపీ విధానాన్ని ఒక్క శాతం మంది ఉపాధ్యాయులే వ్యతిరేకించారని, ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. కాగా, ఎన్క్యూపీ విధానం ఉపాధ్యాయులు, విద్యార్థులకు లాభదాయకమని, ఈ విధానాన్ని తొలిసారి స్టేషన్ ఘన్ పూర్ లో ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉ పాధ్యాయులు హాజరైన ఈ సెమినార్లో లక్ష్మ య్య, గీతాలక్ష్మి, హైమావతి, డీసీఓ రూపాదేవి, ప్రిన్సిపాల్ కాళహస్తి పాల్గొన్నారు.