అవగాహన పెంచుకుంటేనే పురోగతి | womens empowerment | Sakshi
Sakshi News home page

అవగాహన పెంచుకుంటేనే పురోగతి

Sep 7 2016 11:53 PM | Updated on Sep 4 2017 12:33 PM

అవగాహన పెంచుకుంటేనే పురోగతి

అవగాహన పెంచుకుంటేనే పురోగతి

విద్యార్థులు తమ హక్కులు, అవకాశాలపై అవగాహన పెంచుకుని ముందుకు సాగాలని, అప్పుడే పురోగతి సాధించగలరని ఆంధ్రా విశ్వవిద్యాలయం దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ ఆచార్య బి.రత్నకుమారి అన్నారు.

విజయవాడ (వన్‌టౌన్‌) : విద్యార్థులు తమ హక్కులు, అవకాశాలపై అవగాహన పెంచుకుని ముందుకు సాగాలని, అప్పుడే పురోగతి సాధించగలరని ఆంధ్రా విశ్వవిద్యాలయం దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ ఆచార్య బి.రత్నకుమారి అన్నారు. కేబీఎన్‌ కళాశాలలో మహిళా సాధికారత వేదిక ఆధ్వర్యాన ‘మహిళలపై వివక్షత తొలిగినప్పుడే భారతీయ మహిళా వికాసం సాధ్యం’ అనే అంశంపై  బుధవారం సదస్సు నిర్వహించారు. ఆచార్య రత్నకుమారి మాట్లాడుతూ రాజ్యాంగం పలు హక్కులు కల్పించినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తు న్నా ఇప్పటికీ మహిళల వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉందన్నారు. పారి శ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. విద్యార్థినులు చదువుతోపాటు తమ సాధికారతకు అవసరమయ్యే అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ ఎస్‌.రజిత్‌కుమార్, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు, మహిళా అధ్యాపకులు డాక్టర్‌ వి.సుభాషిణి, డాక్టర్‌ కృష్ణప్రియ, దుర్గ, డాక్టర్‌ అనూరాధ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement