Kbn college
-
నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు
-
‘ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది’
సాక్షి, కృష్ణా: విజయవాడలోని కేబీఎన్ (కాకరపర్తి భావనారాయణ) కళాశాల 50వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలకు రావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. కేబీఎన్ కళాశాల ఎంతో మంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. ‘ఉన్నతమైన మౌలిక సదుపాయాల ద్వారా మంచి విద్యను అందిస్తోంది. రానున్న రోజుల్లో మన దేశం విద్యకు కేంద్ర బిందువుగా మారనుంది. ఇండియా ఇతర దేశాలకు మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను అందిస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధంచేయడం అవసరం’ అని అన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య విజయవాడ వాస్తవ్యులు కావడం గర్వకారణమన్నారు. జాతిపిత గాంధీజీ ఐదుసార్లు విజయవాడను సందర్శించారని తెలిపారు. అదేవిధంగా మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాలుష్యం కారణంగా.. ఎంతో మంది దేశ రాజధాని ఢిల్లీని వదిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
కృష్ణా హ్యాండ్‌బాల్ మహిళల జట్టు ఎంపిక
విజయవాడ (వన్‌టౌన్) : కృష్ణా విశ్వవిద్యాలయం హ్యాండ్‌బాల్ (మహిళలు) జట్టును ఎంపిక చేసినట్లు కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం తమ కళాశాలలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల (మహిళల) హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ముగిసిన తరువాత ఎంపిక కమిటీ విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర లయోల కళాశాలకు చెందిన జె.సుశ్రీ, టి.నవ్య, ఎన్.మనీషా, కేబీఎన్ కళాశాలకు చెందిన టి.సాయివినీత, జి.సాయిలక్ష్మి, ఎస్.గౌరీపార్వతి, సిద్ధార్థ మహిళా కళాశాలకు చెందిన డి.తారాబాయి, ఎస్.దివ్యవల్లి, మారీస్ స్టెల్లా కళాశాలకు చెందిన కె.వంశీప్రియ, నూజివీడు ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్‌కు చెందిన ఈ.కల్యాణి, విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఎం.కోటేశ్వరి, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలకు చెందిన పి.అశ్విని తదితులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. స్టాండ్‌బైస్‌గా పి.శివనాగలక్ష్మి (కేబీఎన్), కె.సుష్మాస్వరాజ్, జె.రాణి (ఆంధ్ర లయోల), ఎస్.శాంతి (మారీస్ స్టెల్లా), వీఎల్ భవ్య (సిద్ధార్థ మహిళా)ఎంపికైనట్లు వివరించారు. వీరు తమళనాడు సేలంలోని పెరియార్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి నిర్వహించే అంతర్ విశ్వవిద్యాలయ హ్యాండ్‌బాల్ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. -
కృష్ణా మహిళల హ్యాండ్‌బాల్ ట్రోఫీ లయోలా కైవసం
విజయవాడ(వన్‌టౌన్) : కృష్ణా విశ్వవిద్యాలయం (మహిళల) హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ట్రోఫీని ఆంధ్రా లయోలా కైవసం చేసుకుంది. కేబీఎన్ కళాశాల క్రీడా విభాగం ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల (మహిళల) హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ సోమవారం ఆ కళాశాల ప్రాంగణంలో సందడిగా జరిగింది. జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన మహిళా హ్యాండ్‌బాల్ జట్లు ఈ పోటీలో తలపడ్డాయి. అందులో ఫైనల్స్‌లో పోటాపోటీగా ఆడిన కేబీఎన్ కళాశాలపై, ఆంధ్రా లయోలా కళాశాల మహిళా హ్యాండ్‌బాల్ జట్టు విజయం సాధించింది. ఆంధ్రా లయోలా, కేబీఎన్, సిద్ధార్థ మహిళా కళాశాలలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఉదయం నుంచి జరిగిన మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. ఆయా కళాశాలలకు చెందిన విద్యార్ధులు హజరై క్రీడాకారులను తమ హర్షధ్వనాలతో ఉత్సాహపరిచారు. క్రీడలతో వ్యక్తిత్వ వికాసం క్రీడలతో విద్యార్ధుల వ్యక్తిత్వ సాధ్యమవుతుందని పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అధ్యక్షుడు చలవాది మల్లికార్జునరావు అన్నారు. కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కృష్ణా విశ్వవిద్యాలయం మహిళల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ముగింపు సభ సోమవారం సాయంత్రం జరిగింది మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పల సాంబశివరావు, ఎస్.రజిత్‌కుమార్, కృష్ణా విశ్వవిద్యాలయం స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు మాట్లాడారు. ఉదయం జరిగిన ప్రారంభోత్సవ సభకు ఏలూరు రేంజ్ స్పెషల్‌బ్రాంచ్ ఎస్ఐ, పూర్వ విద్యార్ధి ఎం.సుధాకర్, జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.సిజర్రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ.నారాయణరావు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సాంబశివరావు, పూర్వ ఫిజికల్ డైరెక్టర్ నరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పోటీకి దీటుగా రాణించాలి
విజయవాడ(వన్‌టౌన్): పోటీ ప్రపంచానికి దీటుగా రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలని పారిశ్రామికవేత్త ఎంవీకే హరగోపాల్ అన్నారు. కేబీఎన్ కళాశాల ఎంసీఏ అండ్ ఎంఎస్సీ(కంప్యూటర్స్) విభాగం ఆధ్వర్యంలో ‘ఇమేజ్ ప్రొసెసింగ్ యూజింగ్ ఆర్ ప్రోగ్రామింగ్’ అంశంపై జాతీయ స్థాయి వర్క్‌షాప్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ రంగంలో చోటుచేసుకుంటున్న ప్రగతితో యావత్ ప్రపంచం పరుగులు తీస్తుందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యార్థులు నూతన అంశాలపై శ్రద్ధ చూపాలన్నారు. కళాశాల పీజీ కో–కన్వీనర్ కే.వీ.రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అభ్యున్నతికి కళాశాల యజమాన్యం నిర్వహిస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిసోర్స్‌పర్సన్, యోగివేమన విశ్వవిద్యాలయం సీఎస్ఈ విభాగ ఆచార్యులు డాక్టర్ సి.నాగరాజు మాట్లాడుతూ ‘ఇమేజ్ ప్రాసెసింగ్ యూజింగ్ ఆర్ ప్రోగ్రామింగ్’ అంశం ప్రస్తుతం చాలా కీలకంగా మారిందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్.రజిత్‌కుమార్ మాట్లాడారు. సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ.నారాయణరావు, పీజీ డైరెక్టర్ డాక్టర్ డీ.వీ.రమణమూర్తి, పీజీ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ వై.నరసింహారావు, విభాగాధిపతి పీఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ ఈత పోటీలకు అరుణ్‌రెడ్డి
వన్‌టౌన్ : కేబీఎన్ కళాశాల విద్యార్థి పి.అరుణ్‌రెడ్డి గుజరాత్లో జరిగే అండర్–19 జాతీయ స్కూల్ గేమ్స్ ఈత పోటీలకు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు తెలిపారు. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అరుణ్‌రెడ్డి అండర్–19 కేటగిరీ 50 మీటర్ల బటర్ ఫ్లై, వంద మీటర్ల మిడ్ రిలే విభాగాల్లో బంగారు పతకాలు, 50 మీటర్లు, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో రజత పతకాలు పొందాడని చెప్పారు. ఈ సందర్భంగా కాలేజీలో మంగళవారం అరుణ్‌రెడ్డిని పలువురు అభినందించారు. -
అవగాహన పెంచుకుంటేనే పురోగతి
విజయవాడ (వన్‌టౌన్) : విద్యార్థులు తమ హక్కులు, అవకాశాలపై అవగాహన పెంచుకుని ముందుకు సాగాలని, అప్పుడే పురోగతి సాధించగలరని ఆంధ్రా విశ్వవిద్యాలయం దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య బి.రత్నకుమారి అన్నారు. కేబీఎన్ కళాశాలలో మహిళా సాధికారత వేదిక ఆధ్వర్యాన ‘మహిళలపై వివక్షత తొలిగినప్పుడే భారతీయ మహిళా వికాసం సాధ్యం’ అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. ఆచార్య రత్నకుమారి మాట్లాడుతూ రాజ్యాంగం పలు హక్కులు కల్పించినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తు న్నా ఇప్పటికీ మహిళల వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉందన్నారు. పారి శ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. విద్యార్థినులు చదువుతోపాటు తమ సాధికారతకు అవసరమయ్యే అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్.రజిత్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, మహిళా అధ్యాపకులు డాక్టర్ వి.సుభాషిణి, డాక్టర్ కృష్ణప్రియ, దుర్గ, డాక్టర్ అనూరాధ పాల్గొన్నారు. -
విజయవాడ సూపర్బ్
CHITCHAT ‘సాక్షి’తో యువహీరో వరుణ్ సందేశ్ ‘హ్యాపీడేస్’ సినిమాతో తన హ్యాపీడేస్‌ను మొదలుపెట్టి.. ‘కొత్తబంగారులోకం’తో తన సినీ జీవితాన్ని బంగారుమయం చేసుకుని.. ‘కుర్రాడు’తో కుర్రాళ్లను ఆకట్టుకున్న హీరో వరుణ్ సందేశ్ తాజాగా ‘పడ్డానండి ప్రేమలో మరి..’ అంటూ ప్రేమికుల రోజున మన ముందుకు రాబోతున్నాడు. కేబీఎన్ కళాశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఆయన నగరానికి వచ్చారు. విజయవాడ సూపర్బ్.. అంటూ నగర వాతావరణాన్ని, నగరవాసులను మెచ్చుకున్న యువహీరో వరుణ్ సందేశ్‌తో ‘సాక్షి’ చిట్‌చాట్. - వన్‌టౌన్ సాక్షి : న్యూజెర్సీ నుంచి తెలుగ చిత్ర పరిశ్రమకు ఎలా వచ్చారు? వరుణ్ : మేము తెలుగువాళ్లమే అరుునా న్యూజెర్సీలో స్థిరపడ్డాం. మా తాతగారు జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి ప్రముఖ సాహితీవేత్త. మా బాబాయ్ జీడిగుంట శ్రీధర్ నటుడు. ఈ క్రమంలోనే నాకు నటనపై ఆసక్తి కలిగింది. ‘హ్యాపీడేస్’ చిత్రం కోసం శేఖర్‌కమ్ముల కొత్త నటీనటుల కోసం అన్వేషిస్తుండగా, నేనూ ప్రయత్నించి విజయం సాధించా. సాక్షి : మీకు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రాలు..? వరుణ్ : హ్యాపీడేస్, కొత్తబంగారులోకం నాకు మంచి బ్రేక్నిచ్చారుు. మరికొన్ని సినిమాలు నటుడిగా నిలదొక్కుకోవడానికి సహాయపడ్డాయి. ఏదిఏమైనా జీవితం హ్యాపీగానే నడుస్తోంది. సాక్షి : ఇటీవల ఒకటి రెండు చిత్రాలు మీకు నిరాశ మిగిల్చినట్లున్నారుు..? వరుణ్ : అవును. కారణాలు ఏమైనా ఒకటి రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కొంత నిరాశ కలిగిన మాట వాస్తవమే. సాక్షి : కారణాలు ఏమని భావిస్తున్నారు. వరుణ్ : కారణాలు చాలానే ఉన్నారుు. ఏ సినిమా అరుునా ప్రేక్షకులకు నచ్చాలనే కదా తీసేది. అరుుతే, అందులోని కొన్ని అంశాలే నిరాదరణకు గురవుతున్నారుు. ఇకపై అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతా. సాక్షి : మీ కొత్త సినిమాలేమిటి? వరుణ్ : రామచంద్రప్రసాద్ మహేష్ దర్శకత్వంలో నిర్మించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తేదీని కూడా విజయవాడలోనే నిర్ణయించుకున్నాం. మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాం. సాక్షి : ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్ర కథాంశం ఏమిటి? వరుణ్ : లవ్‌స్టోరీనే అరుునా యూక్షన్తో సాగుతుంది. కుటుంబమంతా కలిసి చక్కగా చూడొచ్చు. ప్రతి మనిషీ ‘మానవత్వం’ కలిగి ఉండాలనే సందేశాన్ని ఇందులో చెప్పాం. సాక్షి : మీ కొత్త ప్రాజెక్టులు.. వరుణ్ : ‘లవకుశ్’, ‘లైలా ఓ లైలా’ షూటింగ్ జరుగుతోంది. మరికొన్ని సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. సాక్షి : కథ ఓకే అరుుతే మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా? వరుణ్ : మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. నేను స్టార్ అని అనుకోవట్లేదు. నటుడిగానే భావిస్తున్నాను. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్‌బాబు, మనోజ్ సోదరులతో కలిసి చేశాను. అలాగే, ‘డి ఫర్ దోపిడీ’లో సందీప్‌కిషన్‌తో కలిసి నటించా. కథ కుదిరితే మల్టీస్టారర్‌లో తప్పక నటిస్తా. విజయవాడ ఎలా ఉంది? విజయవాడ సూపర్బ్. గతంలో నాలుగైదు సార్లు ఇక్కడకు వచ్చాను. బుధవారం రాత్రి కేబీఎన్ కళాశాల మేనేజ్మెంట్ మీట్లో పాల్గొన్నాను. విద్యార్థులంతా నన్ను చక్కగా ఆదరించారు. మొదటిసారిగా కనక దుర్గమ్మను దర్శించుకున్నాను. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా ప్రమోషన్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం.