జాతీయ స్థాయి సదస్సుకు కేఎంసీ విద్యార్థి
జాతీయ స్థాయి సదస్సుకు కేఎంసీ విద్యార్థి
Published Tue, Aug 2 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజ్(కేఎంసీ) విద్యార్థి పృథ్వీరాజ్ జాతీయ స్థాయి సదస్సుకు ఎంపికయ్యాడు. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్..విద్యార్థిని అభినందించారు. ఎస్. పృథ్వీరాజ్.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జనరల్ సర్జీర్ యూనిట్–2లో పీజీ జనరల్ సర్జరీ ఫైనలియర్ చదువుతున్నారు. గత నెల 30, 31వతేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన వైద్యవిజ్ఞాన సదస్సుకు హాజరై సర్జరీలకు సంబంధించి పేపర్ ప్రెజెంటేషన్ చేశారు. ఏపీ, తెలంగాణ , చత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి 300 మంది పీజీ విద్యార్థులు పాల్గొనగా పథ్వీరాజ్ ప్రతిభ కబరిచారు. దీంతో ఆయనను వచ్చే డిసెంబర్‌లో మైసూర్‌లో జరిగే అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా(అపికాన్) జాతీయ స్థాయి సదస్సుకు ఎంపిక చేశారు. విద్యార్థి పథ్వీరాజ్‌ను జనరల్ సర్జరీ విభాగం యూనిట్–2 చీఫ్ డాక్టర్ మోహన్‌లాల్‌నాయక్, వైద్యులు మాధవీశ్యామల, జయరామ్, మల్లీశ్వరి తదితరులు అభినందించారు.
Advertisement