‘అంబేద్కరిజం–ఉద్యోగుల పాత్ర’పై 10న సదస్సు
Published Mon, Aug 8 2016 12:20 AM | Last Updated on Fri, Aug 17 2018 8:12 PM
హన్మకొండ : భారత రాజ్యాంగ నిర్మా త బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ది యునైటెడ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు సాదు మహేందర్ తెలిపారు. ఈ మేరకు సదస్సు కరపత్రాలను హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడారు.10వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ ఇంజనీర్స్ గెస్ట్‌హౌస్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు.‘అంబేద్కరిజం–ఉద్యోగుల పాత్ర’ అంశంపై జరగనున్న ఈ సదస్సులో సౌత్ ఇండియా సమాతా సైనిక్‌దల్ ప్రధాన కార్యదర్శి దిగంబర్ కాంబ్లే, ది యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు జి.ఎస్.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి బి.భద్రూనాయక్, రాష్ట్ర అ ధ్యక్షుడు మామిడి నారాయణ ప్రసం గిస్తారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉ ద్యోగులు పాల్గొని విజయవంతం చే యాలని కోరారు. ఫోరం నాయకులు వై.కొండల్‌రావు, కవిరాజారావు, రమేష్‌కుమార్, విష్ణుమూర్తి, కె.ఎల్లయ్య, రాజ్‌కుమార్, జితేందర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement