ప్రపంచ తెలుగుసాహిత్య సదస్సుకు నన్నయ వీసీ
Published Fri, Nov 4 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) :
సింగపూర్‌లో జరిగే ఐదవ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సులో పాల్గొనేందుకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పయనమయ్యారు. వంగూరి ఫౌండేషన్, సింగపూర్ తెలుగు సమితి, లోక్‌నాయక్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగే సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మంది వరకు తెలుగు సాహిత్య ప్రముఖులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ‘తెలుగు భాష మాధుర్యం – ఆవశ్యకత’ అనే అంశంపై తాను ఉపన్యసిస్తానన్నారు.
Advertisement
Advertisement