'మగువలు మగవారికంటే అధికులు' | seminar on the safety of girls at hyderabad | Sakshi
Sakshi News home page

'మగువలు మగవారికంటే అధికులు'

Published Wed, Dec 2 2015 7:39 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

'మగువలు మగవారికంటే అధికులు' - Sakshi

'మగువలు మగవారికంటే అధికులు'

సుల్తాన్‌బజార్: మహిళలు మగ వారితో సమానం కాదని, మగవారికన్న అధికులని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి అన్నారు. అన్ని రకాలుగా పనిచేయగల సత్తా మహిళల్లో ఉంటుందని తెలిపారు. బుధవారం కోఠి ఉమెన్స్‌కళాశాల పీజీ సెమినార్ హాల్‌లో విద్యార్థినుల భద్రతపై అవగాహన సదస్సు జరిగింది.

ఈ సదస్సుకు జంటనగరాల్లోని 15 మహిళా కళాశాలల విద్యార్ధినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రమారాజేశ్వరి మాట్లాడుతూ... షీ టీమ్ ఏర్పాటు చేసిన సంవత్సరంలోపే స్త్రీలపై వేధింపులు తగ్గాయన్నారు. వ్యక్తిగత జీవితంలో తాను ఈవ్ టీజింగ్‌ను అనుభవించానని వివరించారు. రంగారెడ్డి జిల్లాల్లో 600ల హట్‌స్పాట్‌లను గుర్తించి మహిళలకు రక్షణ కల్పించామన్నారు. షీ టీమ్‌ను ఎలా సంప్రదించాలో విద్యార్థులకు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement