‘ఉపాధి’పై విశాఖలో అంతర్రాష్ట్ర సదస్సు | employment seminar in visakhapatnam | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’పై విశాఖలో అంతర్రాష్ట్ర సదస్సు

Jul 26 2016 12:06 AM | Updated on May 3 2018 3:20 PM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై విశాఖలో ఆగస్టు 4,5,6 తేదీల్లో అంతరరాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు డ్వామా పీడీ కల్యాణ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు.

 
పాడేరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై విశాఖలో ఆగస్టు 4,5,6 తేదీల్లో అంతరరాష్ట్ర సదస్సు  నిర్వహిస్తున్నట్టు  డ్వామా పీడీ కల్యాణ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్రామాలవారీ విజయగాథలతో కూడిన వార్షిక నివేదికలను రూపొందిస్తున్నామన్నారు.  ఉపాధి హామీ  పనులకు సంబంధించి ఉత్తమ కథనాలు రాసిన జిల్లాలోని జర్నలిస్టులకు పురస్కారాలు అందజేస్తామనిపోటీలో పాల్గొనే జర్నలిస్టులు వీడియో, ఫొటోగ్రఫీతో కూడిన విజయగాథల క్లిప్పింగులను ఆగస్టు 2వ తేదీలోగా తమ కార్యాలయానికి అందజేయాలన్నారు. ఉత్తమమైన వాటికి 3 కేటగిరీల్లో నగదు పురస్కారాలు అందజేస్తామన్నారు. ప్రథమ బహుమతికి రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, తతీయ బహుమతిగా రూ.5 వేలు ఇస్తామన్నారు. 2015–16లో రూ.కోట్లతో జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టామన్నారు.ఈ పథకంపై ఉత్తమమైన విజయగాథల వీడియో క్లిప్పింగులను అంతరరాష్ట్ర సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు చూపిస్తామన్నారు. ఈ పోటీలకు సంబంధించి సమాచారాన్ని విశాఖ ఎంవీపీ కాలనీలోని తమ కార్యాల యంలో నేరుగా, లేదా 0891 2712310/ 2530099 నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించాలన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement