న్యాయ సమస్యలు పరిష్కరించండి
న్యాయ సమస్యలు పరిష్కరించండి
Published Sat, Mar 4 2017 10:19 PM | Last Updated on Wed, May 29 2019 3:25 PM
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి
కర్నూలు(లీగల్) : ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయ సమస్యలను పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి జిల్లాలోని ప్యానల్ అడ్వకేట్స్ లీగల్ అడ్వకేట్స్‌ను కోరారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల న్యాయ సేవా సంస్థ కార్యాలయాల్లో న్యాయవాదులు ఉంటూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శిక్షకులు టి.సుబ్బారావు, ఆర్.శ్రీనివాసరావులు న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు టి.రఘురాం, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కె.సుధాకర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, సీనియర్ సివిల్ జడ్జీలు శివకుమార్, గాయత్రి దేవి, జూనియర్ సివిల్ జడ్జీలు గంగాభవాని, జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌లు ఎం.బాబు, కె.స్వప్నారాణి, పి.రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Advertisement