meters
-
కేంద్ర మంత్రికి హరీష్‌రావు కౌంటర్
సాక్షి, సిద్ధిపేట: బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ సర్కార్‌పై చేసిన విమర్శలకు.. బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ సర్కార్‌ను ఒత్తిడి చేసిందని.. మీటర్లు పెట్టలేదనే తెలంగాణకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలా సీతారామన్ బయటపెట్టారని అన్నారాయన. బుధవారం ఉదయం సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ సర్కార్‌ను ఒత్తిడి చేసింది. కాదంటే రూ.25 వేల కోట్లు ఇవ్వబోమని బ్లాక్‌మెయిల్‌కు దిగింది. కానీ, కేసీఆర్ మాత్రం రైతుల పక్షానే నిలిచారు. దేశంలో రైతు పక్షపాతి కేసీఆర్ ఒక్కరే. ఢిల్లీనేమో మమ్మలి శెభాష్ అంటారు.. ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తారు’ అని నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి హరీశ్ అన్నారు. ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నిర్మలమ్మ ‘కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ రైతులకు అన్యాయం చేశాయి. కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు. ఈ రెండు పార్టీలు పాలిస్తున్న ఆయా రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టాయి. రాజస్థాన్‌లో మోటార్లకు మీటర్లు పెట్టారు. అదే విషయం ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తారా?. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒప్పుకున్నట్లే. ’.. అని తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి హరీష్ వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో 100 లక్షల కోట్ల అప్పు చేశారు. దేశంలోని 22 రాష్ట్రాల కంటే తక్కువ అప్పు తీసుకుంది తెలంగాణనే. మోదీ సర్కార్ కార్పొరేటర్లకు రుణ మాఫీ చేసింది కానీ పేదలను పట్టించుకోలేదు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి బీజేపీనే కారణం. చేనేతలపై.. పాలప్యాకెట్లపై జీఎస్టీ వేసిన ఘనత బీజేపీది అని హరీష్ విమర్శించారు. -
అక్కడ పూల దండలను మూర లెక్కన అమ్మితే ఇక అంతే!
పువ్వులు అలంకరణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని దండల రూపంలో ఐతే మూర లెక్కన విడి పువ్వులైతే గ్రాములు, కిలోల లెక్కన తీసుకుంటాం. ఇది సర్వసాధారణం. ఐతే ఇక నుంచి మూరలు లెక్కన పూల దండలను అమ్మడానకి వీల్లేదట. ఒకవేళ అలా అమ్మితే రెండు వేలు వరకు జరిమాన విధిస్తారట. అంతేగాదు పూల దండలను మీటర్లు లేదా సెంటీమీటర్ల చొప్పునే అమ్మాలనే నిబంధన కూడా విధించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ అంశం ఇప్పుడూ కేరళ అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..సాధారణంగా మల్లెలు, కనకాంభరాలు తదితర పూల దండలను మూరలెక్కనే అమ్మతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కేరళలో త్రిసూర్‌లో లీగల్ మెట్రోలజీ డిపార్ట్మెంట్ ఇక నుంచి అలా అమ్మకూడదంటూ పూల వ్యాపారులకు నోటీసులు పంపింది. ఇలా అమ్మితే పూల దండ దాదాపు 24 అంగుళాలు లేదా 60 సెంటీమీటర్లే ఉంటుందని చెబుతోంది. ఇక నుంచి పూల దండలను సెంటీమీట్లర్లు లేదా మీటర్లలోనే కొలవాలని రూల్ పాస్ చేసింది. ఒకవేళ మూర లెక్కన అమ్మినట్లు తెలిస్తే వారికి రూ. 2000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. కేరళలో ఈ అంశం ఒక హాట్‌టాపిక్‌గా మారిపోయింది. త్రిసూర్ షాపులలో తనిఖీలు నిర్వహించగా తమ దృష్టికి ఈ విషయం వచ్చిందని లీగల్ మెట్రాలజీ విభాగం అధికారి ఏషియానెట్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ చట్టంలోని సెక్షన్ 111ఈ, పీనల్ ప్రొవిజన్ 29 ప్రకారం పూల దండలను అత్యంత సాధరణ యూనిట్ ఎస్ఐ(ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్)లో కాకుండా మూర లేదా క్యూబిట్లో అమ్మడం నేరం అని, దీని కింద రూ. 2000/- జరిమాన విధిస్తామని కరాకండీగా తేల్చి చెప్పింది. ప్రజలు గనుక మూర లేదా క్యూబిన్ల కింద కోరినట్లయితే వ్యాపారులు 44.5 సెంటీమీటర్ల పూల దండను ఇవ్వాలని లీగల్ మెట్రాలజీ సూచించింది. ఐతే కొలతల్లో చాలా మార్పులు వస్తాయని వ్యాపారులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూల అమ్మకాలు చాల సంత్సరాలుగా జరగుతున్నాయి. నిజానికి సాధారణ ప్రజలకు పూలు మూర లేదా సెంటమీటర్లలో అమ్మడం అనేది అనవసరమైన విషయమని, ఇది పెద్ద సమస్య కాదంటూ ఆ నిబంధనను వ్యాపారులు కొట్టిపారేయడం గమనార్హం. (చదవండి: వామ్మో ఎంత పెద్ద క్యూ లైన్! అంతలా బారులుతీరి జనాలు ఎందుకున్నారంటే.. -
మోటార్లకు మీటర్లు పెడతామన్నది మీరే కదా?
కమలాపూర్: ‘బీజేపీని గెలిపిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మేం ఎక్కడ కూడా అలా చెప్పలేదు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందా? రాయలేదా?’స్పష్టంగా చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వ నూతన పాలసీని తాను చదివి వినిపిస్తే ఇప్పటిదాకా మౌనంగా ఉండి, మళ్లీ ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం మొదలుపెట్టారన్నారు. కేసీఆర్ హామీ లపై చర్చకు రమ్మని అనేక సార్లు సవాల్ విసిరితే స్పందించలేదని, వాళ్లు చేసిన సవాల్‌ను తాము స్వీకరించినా స్పందించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరిస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ సంస్థలో రాష్ట్రానిది 50 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలున్నాయని, తక్కువ శాతం వాటా ఉన్నోళ్లకు ప్రైవేటీకరణ చేయడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాదన్నారు. -
మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన లేదు: అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని.. సీఎం కేసీఆర్ కేవలం రైతులను రెచ్చగొట్టేందుకే ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన.. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో 17 మంది ఆదర్శ రైతులు, రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, కేసీఆర్ పాలన, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న సీఎం కేసీఆర్ ఆరోపణలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అమిత్‌షా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టేందుకే కేసీఆర్ అర్థంపర్థంలేని వాదనలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఆలోచన కేంద్రానికి లేదన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటికి వెళ్లిందని.. పంట నష్టపోతున్న రైతులు పరిహారం రాక అన్యాయానికి గురవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని, రైతు ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు.. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టిసారించాలని అమిత్‌షా సూచించారు. బీమా లేక నష్టపోతున్నాం.. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలుగాక నష్టపోతున్నామని కొందరు రైతులు అమిత్‌షా దృష్టికి తీసుకొచ్చారు. తెల్కపల్లి మండలానికి చెందిన లావణ్య అనే మహిళా రైతు మాట్లాడుతూ.. తనకు పదెకరాల భూమి ఉందని, గతంలో వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని చెప్పారు. కొంత భూమిని అమ్మేసి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టానని, దీనితో లాభాలు ఆర్జిస్తున్నానని తెలిపారు. దీనిపై అమిత్‌షా స్పందిస్తూ.. సేంద్రియ వ్యవసాయంతో ఎంతో మేలు జరుగుతుందని, తాను కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని పేర్కొన్నారు. తనవద్ద మేలుజాతి ఆవులు ఉన్నాయని.. అందులో ఒకటి 12వ జనరేషన్ గోమాత అని చెప్పారు. ఆ గోమాతకు మహాలక్ష్మిగా నామకరణం చేసి తన మనవడికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు. ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో ఇబ్బంది ఉందని కొందరు రైతులు షా దృష్టికి తీసుకురాగా.. త్వరలో అమూల్ ద్వారా సేంద్రియ ఉత్పత్తులను సేకరించేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని అన్నారు. చదవండి: కుటుంబ పాలనకు చరమగీతం -
బీజేపీకి ఓటేస్తే.. మోటార్లకు మీటర్లే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘రైతు బంధు, రైతు బీమా తదితర సంక్షేమ పథకాలు అంతగా ఎందుకు ఇస్తున్నారని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. గుజరాత్లో రూ.600 పెన్షన్ ఇస్తుంటే.. ఇక్కడ రూ.2 వేలు ఎందుకు ఇస్తున్నారని అడుగుతోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు పడిందంటే మోటార్లకు మీటర్లు పడ్డట్టే. ప్రజలు ఆగం కావొద్దు. మోసపోతే గోస పడతాం. మోటార్ల వద్ద కాదు.. అందరం ఒక్కటై బీజేపీకే మీటర్ పెట్టాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సంక్షేమ పథకాలన్నీ బంద్ అవుతాయని.. ఇవి పార్టీల ఎన్నికలు కావని.. రైతులు, కార్మికుల ప్రజల బతుకుదెరువు ఎన్నికలని పేర్కొన్నారు. శనివారం మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం కేసీఆర్ మాటల్లోనే.. అమిత్‌షా సమాధానం చెప్పాలి.. ‘‘రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయినా కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎందుకు తేల్చడం లేదు. అవసరమైన చోటికి నీళ్లు తెచ్చుకుందామనుకుంటే మా వాటా తేల్చడం లేదు. ఇందుకోసమే అమిత్‌షా మునుగోడుకు వస్తున్నారా.. ఇదే గడ్డపై సమాధానం చెప్పాలి. పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్‌రెడ్డి, ఇక్కడి నుంచి ఉన్న కేంద్రమంత్రి ఢిల్లీకి వెళ్లి కృష్ణా జాలాల వాటా సంగతేమిటని అడగలేరా. అలా కాకుండా డోలు బాజా తీసుకొని అమిత్‌షాను ఇక్కడికి తీసుకువస్తారా? çకృష్ణా జలాల్లో వాటా ఎందుకు తేల్చడం లేదో, మీ చేతగానితనం ఏంటో అమిత్‌షా చెప్పాలి. ఒక్క మంచి పని అయినా చేశారా? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయింది. ఒక్క మంచి పని అయినా చేశారా? దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు, రైతులు ఏ వర్గానికీ మేలు జరిగిందీ లేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు. ఎయిర్‌పోర్టులు, విమానాలు, రైళ్లు, బ్యాంకులు, గ్యాస్ కంపెనీలు, పోర్టులు అన్నీ పోయాయి. ఇప్పుడు రైతులు, భూములు, వ్యవసాయ పంటల మీద పడుతున్నారు. రైతులు, రైతు కూలీ నోట్లో మట్టి పోసే ప్రయత్నం జరుగుతోంది. బావుల వద్ద మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. నేనైతే ప్రాణం పోయినా మీటర్లు పెట్టబోనని అసెంబ్లీలోనే చెప్పిన. ఈ మీటర్ల వ్యవహారం వెనుక చాలా మోసం ఉంది. విద్యుత్ చార్జీలు, ఎరువుల ధరలు పెంచడం, పండిన పంటను కొనకపోవడం వంటివి చేసి.. రైతులు వ్యవసాయం చేయలేమనేలా చేస్తున్నారు. మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతున్నారు. మీ భూములు ఇచ్చేయండి, మేం వ్యవసాయం చేస్తం. మీరు కూలీ పనులు చేయండి అంటారు. వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసే కుట్ర జరుగుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మునుగోడు నియోజకవర్గంలో 1.01 లక్షల మందికి రైతు బంధు వస్తోంది. నేరుగా బ్యాంకు అకౌంట్లలో పడుతోంది. ఇప్పుడు దానిని బంద్ చేయాలని చూస్తున్నారు. రైతు బీమాను బంద్ చేయాలట.. ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మేం ఢిల్లీకి పొయి ధర్నా చేశాం. అంత పెద్ద ఎఫ్‌సీఐని చేతిలో పెట్టుకొని కూడా ధాన్యం తీసుకోబోమన్నారు. పైగా మీడియా వాళ్లు లేనిది చూసి.. మీరు అంతంత పెన్షన్లు ఎందుకిస్తున్నారు? రైతులకు డబ్బులు ఎందుకిస్తున్నారు అని అడిగారు. వికలాంగులకు, గీత కార్మికులకు, ముసలోళ్లకు పింఛన్ ఇవ్వొద్దట. ఈ నియోజకవర్గంలో 1,100 మందికి రైతు బీమా వచ్చింది. ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుండా 15 రోజుల్లో రూ.5 లక్షలు బ్యాంకులో జమ అవుతోంది. ఇలాంటిది దేశంలో ఎక్కడైనా ఉందా? ఇది కూడా ఇవ్వకూడదంట. దీన్ని బంద్ పెట్టాలంటారు మోదీ. మరి ఏం చేయాలి? దేశంలో ఏం జరుగుతోందో ఆలోచించండి. బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లే.. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు. మన జీవితాల ఎన్నిక. బీజేపీకి ఓటేస్తే నష్టపోతాం. నువ్వు మీటర్లు పెట్టుమంటే పెట్టలేదు. అయినా ప్రజలు మాకే ఓటేశారని, నువ్వు తప్పుకో మేమే మీటర్లు పెడతామని మోదీ అంటారు. మీటర్లు పెట్టే నరేంద్ర మోదీ, బీజేపీ కావాలా..? మీటర్లు వద్దనే టీఆర్ఎస్, కేసీఆర్ కావాలా.. తేల్చుకోండి. గ్రామాల్లో అందరితో చర్చించండి. నేను ప్రధాన మంత్రితో కొట్లాడుతున్నా.. నా బలం, ధైర్యం మీరే. అలాంటి మీరు బీజేపీకి ఓటు వేసి బలహీనపరచొద్దు. మునుగోడులో ఎన్నడూ బీజేపీకి డిపాజిట్ రాలేదు. ఇప్పుడు వస్తదా.. వచ్చిందంటే మీటర్ వస్తది. బీజేపీకి ఓటు పడ్డది అంటే మన బాయికాడ మీటర్ పడ్డట్టే. అప్రమత్తంగా ఉండండి. మోటార్ల వద్ద కాదు.. అందరం ఒక్కటై బీజేపీకే మీటర్ పెట్టాలి. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ అయి పోరాటం చేయాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే వృథానే.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వృధానే తప్ప ఉపయోగం ఉండదు. ఈ ఎన్నికతో తెలంగాణ ఏమంటోందన్న మెసేజీ దేశవ్యాప్తంగా Ðవెళ్లాలి. బొమ్మలు చూసో, గోల్మాల్, గ్యారడీ విద్యలు చూసో మోసపోతే గోసపడతాం. ఉన్న సౌకర్యాలు, ఉన్న పెన్షన్లు, ఉన్న వసతులు, ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా ఆలోచన చేయాలి. మునుగోడు రైతులు ఓటేసే ముందు పొలం కాడికి పోయి బోరుకు దండంపెట్టి ఓటేయండి. అక్క చెల్లెళ్లు ఓటేసేటప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఏడికిపోయిందో ఆలోచించి ఓటు వేయండి. బీజేపీని తరిమి కొట్టండి. మళ్లీ వస్తా. చండూరులో సమావేశం అవుదాం. దేశవ్యాప్తంగా క్రియాశీల పోరాటాలు దేశవ్యాప్తంగా ప్రగతిశీల, క్రియశీల శక్తులు ఏకం కావాలని, ఈ దుర్మర్గులను పంపేస్తేనే ప్రజలు, దేశం బాగుపడుతుందని సీపీఐ, సీపీఎం నాయకులతో చెప్పా. బీజేపీతో దేశ ప్రజల జీవితాలు దెబ్బతినే ప్రమాదం ఉందనే సీపీఐ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. సీపీఎం కూడా రేపోమాపో కలిసి వస్తుంది. ఈ పోరాటం ఒక్కరోజుతో ఆగేది కాదు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా ఐక్యత ఇలాగే కొనసాగాలి. పేదలు, రైతులు బాగుపడేదాకా పోరాటం కొనసాగిస్తాం. టీఆర్ఎస్తోనే నల్లగొండ అభివృద్ధి ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. నేను రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడే ఈ సమస్యను అందరి దృష్టికి తీసుకువెళ్లాం. ఢిల్లీలో ప్రధాని ముందుకు బాధితులను తీసుకెళ్లి గోస చూపించాం. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టకపోతే నల్లగొండ నో మ్యాన్ జోన్ అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. అయినా రాష్ట్ర పాలకులుగానీ, దేశ పాలకులు గానీ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ పథకంతో సురక్షిత తాగునీరు ఇచ్చి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం. కృష్ణా బేసిన్ నుంచి డిండి ద్వారా శివన్నగూడెం ప్రాజెక్టుకు నీరు తెచ్చుకోవాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాం. తెలివిగా ఆలోచించి టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకోవాలి. ఇది గోల్ మాల్ ఎన్నిక ఇది ఆషామాషీ ఎన్నిక కాదు.. ఆగం కావద్దు.. మన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పజెప్పుకోవద్దు. ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఆలోచించి ఓటేయాలి. ఇది గోల్మాల్ ఎన్నిక. ఇంకో ఏడాదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ ఉప ఎన్నిక ఎందుకొచ్చింది, దీని వెనక ఉన్న మాయ ఏమిటో గుర్తించాలి. లేకపోతే దెబ్బతింటాం. మనదాంట్లో కూడా కొందరు సన్నాసులు ఉంటారు. పక్క నాయకులు మందుపెట్టి, దూది పెట్టగానే వాళ్ల వెంట వెళ్లిపోతారు. దానికి ఆశపడొద్దు. నేను ఒకటే చెబుతున్నా. ఇది పార్టీల ఎన్నిక కాదు.. రైతులు, కార్మికుల బతుకుదెరువు ఎన్నిక. తెలంగాణ మన జీవితం. దీన్ని పోగొట్టుకోవద్దు. ఎవరు పెద్ద మెజారిటీతో గెలుస్తారో వాళ్ల మెసేజ్ దేశానికి పోతుంది. కాబట్టి ఆలోచించాలి. ఉన్నది మూడు తోకలు.. ఇంత అహంకారమా? తెలంగాణ అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలుంటే టీఆర్ఎస్కు 103 మంది. బీజేపీకి ఉన్నది 3 తోకలు. వాళ్లు మమ్మల్ని పడగొట్టి ఏక్నాథ్ షిండేలను తెస్తారట. ఇది అహంకారమా.. బలుపా.. ఎవరు పడితే వాళ్లు సీఎంను విమర్శిస్తారు. ఈడీ కేసు పెడతాం అంటారు. ఈడీ వస్తే ఏంటి? నాకే చాయ్ తాగించి పోవాలి. దొంగలైతే భయపడతారు. ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో.. ప్రజల కోసం నిలబడేవాళ్లు మీకు భయపడరని మోడీ గుర్తుంచుకోవాలి. నువ్వు నన్ను గోకినా గోకకున్నా.. నేను నిన్ను గోకుతా. నీ దుర్మార్గం, నీ మోసకారి విషయాలు ప్రజలకు తెలుసు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ప్రభుత్వాలను పడగొడతా అంటావ్. నిన్ను పడగొట్టే వారు లేరనుకుంటున్నావా? నిన్ను పడగొట్టడానికి వేరే శక్తులు అవసరం లేదు. అహంకారం, నీ గర్వమే నీ శత్రువులు.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానాలే మీకు శత్రువులు అవుతాయి. రోడ్డు మార్గంలో చేరుకుని.. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు రోడ్డు మార్గంలో బయలుదేరిన సీఎం కేసీఆర్.. 3.45 గంటలకు మునుగోడు సభావేదిక వద్దకు చేరుకున్నారు. మొదట అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అంజలి ఘటించారు. తర్వాత తెలంగాణ అమర వీరులకు నివాళి అర్పించి.. టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత సభా వేదికపై ప్రసంగించారు. సభలో సీఎం కన్నా ముందు సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగించారు. మునుగోడులో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదు: పల్లా వెంకటరెడ్డి ఉప ఎన్నికలో తాము టీఆర్ఎస్కు బేషరతుగా మద్దతిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌తో కలిసి వచ్చిన ఆయన సభలో మాట్లాడారు. ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడుతున్నారని.. దేశంలో మేధావులు, అభివృద్ధి కాముకులకు మొదటి శత్రువు మతోన్మాద బీజేపీనేనని పల్లా వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీ వచ్చినా మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపిన కేసీఆర్: మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడును పట్టి పీడించిన ఫ్లోరైడ్ రక్కసిని సీఎం కేసీఆర్ రూపుమాపారని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మునుగోడు సభలో పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందునాటి మునుగోడు, నల్లగొండ బాధలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఆవేదన కలుగుతోందన్నారు. అది దేవుడిచ్చిన శాపం కాదని.. పాలకులు చేసిన మోసమని మండిపడ్డారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఏ జిల్లాకు వెళ్లినా నల్లగొండ బాధలు చెప్పేవారరని.. ప్రజల బాధను రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలియజేశారని వివరించారు. తెలంగాణ వచ్చి, కేసీఆర్ సీఎం అయిన ఏడాదిలోనే మునుగోడుకు రక్షిత తాగునీటిని తీసుకు వచ్చారని చెప్పారు. మిషన్ భగీరథతో ఏ ఒక్కరూ ఫ్లోరోసిస్ వ్యాధికి గురికాకుండా కాపాడారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ మునుగోడులో దాదాపు 15 శాతం వికలాంగులు ఉన్నారని పేర్కొన్నారు. చదవండి: 24 గంటలు టైమ్ ఇస్తున్నా.. కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి ఠాకూర్ సవాల్ -
పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు
సనత్‌నగర్: విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తామంటూ లంచం తీసుకున్న ఏఈతో పాటు లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ భాస్కర్‌రెడ్డి మూసాపేటలోని ఓ భవనానికి 20 విద్యుత్ మీటర్ల కోసం గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. సనత్‌నగర్ ఎలక్ట్రికల్ ఏఈ అవినాష్, లైన్ ఇన్స్పెక్టర్ కృపానంద్ రెడ్డిలు రేపు మాపు అంటూ భాస్కర్‌రెడ్డిని తిప్పించుకుంటున్నారు. డబ్బులు ముట్టజెబితేనే పని అవుతుందని కరాఖండీగా చెప్పారు. ఏఈకి రూ.25,000, లైన్ ఇన్స్పెక్టర్కు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గత్యంతరం లేక ఈ నెల 18న ఏఈకి రూ.10,000, 19న లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు రూ.3,500ను భాస్కర్‌రెడ్డి ఇచ్చారు. దీంతో కేవలం ఐదు మీటర్లను మాత్రమే వారు మంజూరు చేసి మిగతా మీటర్లను పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన డబ్బులు కూడా ఇస్తేనే మీటర్లను మంజూరు చేస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక భాస్కర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం సనత్‌నగర్‌లోని విద్యుత్ ఏఈ కార్యాలయంలో అవినాష్‌కు రూ.10,000, కృషానంద్‌రెడ్డికి రూ.4,000ను ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇరువురు అధికారులను అరెస్టు చేసి ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్లకు చెందిన కూకట్పల్లి, బోరబండలలోని వారి ఇళ్లలో సోదాలు కొనసాగించారు. (చదవండి: ఫోనొచ్చింది ఆపండహో!) -
మీటర్లు పెట్టాలని ఆదేశించలేదు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని ఈఆర్సీ ఆదేశించిందని పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించిన లెక్కలను కచ్చితంగా తెలుసుకోవడానికి రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆదేశించామన్నారు. ఈఆర్సీ సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్యతో కలసి సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి రఘునందన్‌రావు ఆరోపణలను ఖండించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు బిగించాలని జారీ చేసిన ఆదేశాలను రఘునందన్‌రావుకు పంపానని, అయినా మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థ ఈఆర్సీకి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదన్నారు. మహారాష్ట్రలోని ఒక విద్యుత్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి కచ్చితమైన వినియోగంపై అధ్యయనం చేశారని, రూ.36 కోట్ల విద్యుత్ సబ్సిడీలను డిస్కంలు అదనంగా పొందాయని ఈ అధ్యయనంలో తేలిందన్నారు. తెలంగాణ సైతం ఇలాంటి ప్రయోగం చేయాలన్న ఆలోచన ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. త్వరలో జిల్లాలకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ వినియోగదారులకు హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కల్పించడంతోపాటు వారి సమస్యలను తెలుసుకోవడానికి విద్యుత్ రెగ్యులేటరీ కమి షన్ అన్ని జిల్లాల్లో పర్యటించనుందని శ్రీరంగారావు వెల్లడించారు. ఈ నెల 19న ఉదయం కామారెడ్డి జిల్లాలో, మధ్యాహ్నం మెదక్ జిల్లాలోని పలువురు వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనుందన్నారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను మొబైల్ యాప్ ద్వారా కన్జ్యూమర్ గ్రివెన్స్ రిడ్రస్సల్ ఫోరంకు పంపవచ్చని, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా ఈఆర్సీని ఆశ్రయించవచ్చని సూచించారు. -
సాగుకు మీటర్లు.. రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి!!
వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించక తప్పేటట్లు లేదు. ఎలాగైనా విద్యుత్ సంస్కరణలను అమల్లోకి తేవాలని పట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఈ మేరకు ఒత్తిడి తెస్తోంది. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులకు, డిస్కమ్‌లకు కేంద్ర విద్యుత్ కార్పొరేషన్ల నుంచి ప్రతినెలా అందుతున్న రుణాలను తాజాగా నిలిపివేసింది. యథావిధిగా ఈ రుణాలు పొందాలంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని, విద్యుత్ వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి తేల్చిచెప్పింది. ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటే... రైతు వినియోగించిన విద్యుత్తుకు (బిల్లుకు) సమానమైన నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసుకోవచ్చని కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు– 2020 చెబుతోంది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను బిగిం చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి పెంచింది. వ్యవ సాయంతో సహా అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్లకు తప్పనిసరిగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అంగీకారం తెలపాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఒత్తిడిని తీవ్రం చేసింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కంలను గట్టెక్కిం చేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో భారీ ఎత్తున సంస్కరణల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గతేడాది విద్యుత్ సవరణ బిల్లు–2020ను ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీలను అనుమతించడం, వినియోగదారులకు నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా విద్యుత్ రాయితీలు అందించడం, ప్రతి వినియోగదారుడికి విద్యుత్ మీటర్‌ను ఏర్పాటు చేయడం, పెరుగుతున్న విద్యుత్ సరఫరా వ్యయానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు విద్యుత్ బిల్లులను పెంచడం వంటి సంస్కరణలను ఈ బిల్లు ద్వారా కేంద్రం ప్రతిపాదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును రాష్ట్రంలో అమలు చేయబోమని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. బిల్లులోని పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ సైతం రాశారు. మీటర్లతో రుణాలకు మెలిక.. ఈ బిల్లుపై అభిప్రాయ సేకరణ జరిపిన కేంద్ర ప్రభుత్వం త్వరలో దీనిని చట్టసభల్లో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు ఈ బిల్లు అమలు కోసం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే పలు ప్రాజెక్టులకు, డిస్కమ్‌లకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)ల నుంచి ప్రతి నెలా తీసుకుంటున్న రుణాలు ఆపేసింది. రుణాల చెల్లింపులను పునరుద్ధరించడానికి విద్యుత్ వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సైతం మీటర్లు ఏర్పాటు చేయాలన్న షరతులను అంగీకరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కోరినట్టు రాష్ట్ర విద్యుత్ సంస్థల అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మీటర్ లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదని, ఈ మీటర్లు స్మార్ట్ ప్రీపెయిడ్ అయి ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గతంలోనే పేర్కొంది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు ఏవైనా మినహాయింపులు అవసరమైతే తప్పనిసరిగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సరైన కారణాలు తెలిపి అనుమతి పొందాలని ఈ నిబంధనల్లో పొందుపర్చింది. ప్రస్తుత పరిణామాలు చూస్తే భవిష్యత్తులో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించక తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయానికి మీటర్లు బిగించడానికి కానున్న వ్యయాన్ని తామే భరిస్తారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. నగదు బదిలీకి మీటర్ తప్పనిసరి.. ప్రస్తుతం రాష్ట్రంలో 25 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అవుతున్న ఖర్చును ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీల రూపంలో అందిస్తోంది. వ్యవసాయ విద్యుత్ రాయితీలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల విద్యుత్ బిల్లులు కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు రూ.10 వేల కోట్ల రాయితీలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2020 అమల్లోకి వస్తే నేరుగా ప్రభుత్వం డిస్కంలకు విద్యుత్ రాయితీలు ఇవ్వడానికి వీలు ఉండదు. భవిష్యత్తులో వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించి... వారి నుంచి ముందస్తుగా బిల్లులు వసూలు చేయాలని కేంద్రం కోరుతోంది. ఎంత మొత్తం డబ్బుకు రీచార్జి చేసుకుంటే అంతకు సరిపడా విద్యుత్ సరఫరా అవుతుందన్న మాట. వినియోగదారులు చెల్లించిన బిల్లుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న రాయితీలను నేరుగా వారికి నగదు బదిలీ రూపంలో చెల్లించాలని విద్యుత్ బిల్లులో కేంద్రం పేర్కొంది. బిల్లు రాకకు ముందే వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయవచ్చని కేంద్రం ఈ నిబంధనను సమర్థించుకుంటోంది. ఉచిత విద్యుత్ వినియోగించే రైతులు... ఎవరు ఎంత విద్యుత్ వినియోగించారో తెలుసుకుని బిల్లులు వేయాలంటే తప్పనిసరిగా ప్రతి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు మీటర్‌ను బిగించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అప్పుడే విద్యుత్ బిల్లులోని నిబంధనల ప్రకారం సంబంధిత రైతుల ఖాతాలకు ప్రభుత్వం రాయితీలు బదిలీ చేయడానికి అవకాశం కలగనుంది. వినియోగం లెక్కలు తేలాలని.. ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్‌లో 30 శాతం వాటా వ్యవసాయ విద్యుత్‌దేనని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి శాస్త్రీయత లేదు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో పాటు వ్యవసాయ ఫీడర్లకు సైతం మీటర్లు లేకపోవడంతో వాస్తవానికి వ్యవసాయానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతుందో చెప్పే పరిస్థితి లేదు. మరోవైపు ట్రాన్స్మిషన్ నష్టాలు, వాణిజ్యపర నష్టాల (ఏటీ అండ్సీ)ను తగ్గించి చూపడానికి డిస్కంలు వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్ గణాంకాలను అడ్డగోలుగా పెంచేసి చూపుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి ఏటా రూ.వందలు, వేల కోట్ల నష్టాలను వ్యవసాయ విద్యుత్ ఖాతాలో వేసేస్తున్నాయని విమర్శలున్నాయి. ఈ అడ్డగోలు లెక్కలకు అంతం పలకానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు మీటర్‌ను బిగించి... 100 శాతం నెట్ మీటరింగ్ సాధించాలని చాలా కాలంగా రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తోంది. తాజాగా గత కొన్నిరోజులుగా ఈ ఒత్తిడి మరింత తీవ్రమైందని అధికారులు పేర్కొంటున్నారు. -
‘ఉచితం’ శాశ్వతానికే
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీపై ఎలాంటి అనుమానాలకు తావులేదని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదని రాష్ట్ర ఇంధనశాఖ స్పష్టం చేసింది. రైతుల ప్రయోజనాలను కాపాడటం, ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. నగదు బదిలీపై వ్యక్తమవుతున్న సందేహాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి శుక్రవారం సమగ్రంగా నివృత్తి చేశారు. ఏడాదిగా రైతుకు ఎంతో మేలు.. ► ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందుతోంది. 2019 వరకు కేవలం 58 శాతం ఫీడర్లే 9 గంటల విద్యుత్ ఇవ్వగలిగే స్థాయిలో ఉండేవి. వీటి బలోపేతం కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లోనే 89 శాతం ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందుతోంది. రబీ నాటికి అన్ని ఫీడర్లు సిద్ధమవుతాయి. ► ఉచిత విద్యుత్‌కు మరో 30 ఏళ్లు ఢోకా లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు చేపడుతోంది. ► 31.3.2019 నాటికి ఉన్న బకాయిల్లో రూ. 8655 కోట్లు, 2019–20లో ప్రభుత్వం చెల్లించింది. 2014–19 మధ్య కాలంలో ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన బకాయిలు మొత్తం రూ.7,172 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ► వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు 7,523 మంది జూనియర్ లైన్మెన్లను ప్రభుత్వం నియమించింది. సాగు అవసరాలకు విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ ఫీడర్లలో అంతరాయాలు 2018–19తో పోలిస్తే 2019–20లో 38.4 శాతం మేర తగ్గాయి. నగదు బదిలీ ఎవరికి వర్తిస్తుంది? ► ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ ఇది వర్తిస్తుంది. ఏ ఒక్క రైతు తన జేబు నుంచి పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. మీటర్లు ఎందుకు? ► మీటర్లు అమరిస్తే ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుస్తుంది. ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందో అర్థమవుతుంది. రైతులే డిస్కమ్‌లకు చెల్లిస్తారు కాబట్టి నిలదీసి మెరుగైన సేవలు పొందవచ్చు. ► డిస్కమ్‌లు ఇప్పటివరకు వార్షిక నష్టాలన్నీ రైతుల ఖాతాలో వేస్తున్నాయి. మీటర్లు అమరిస్తే వినియోగం, వృధా తెలుస్తుంది. వీటికయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మరమ్మతుల ఖర్చు డిస్కమ్‌లే చూసుకుంటాయి. పరిమితులుంటాయా? ► ఉచిత విద్యుత్తు కనెక్షన్లు తగ్గిస్తారని, పరిమితులు విధిస్తారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఒక్క విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించరు. ► నగదు బదిలీ ఆలస్యమైతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారన్న ప్రచారంలోనూ నిజం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా ఆపవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ► అనధికార కనెక్షన్లన్నీ క్రమబద్ధీకరిస్తారు. అదనపు లోడ్ కనెక్షన్ల్ల క్రమబద్ధీకరణ కూడా చేస్తున్నాం. కౌలు రైతులు ఎలా సాగు చేస్తున్నారో అలాగే ఇకపై కూడా ఉచిత విద్యుత్ పొందుతూ సాగు చేసుకోవచ్చు. -
వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు
- ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించండి - ఏడాదిలోగా సమర్పించండి: డిస్కంలతో ఈఆర్సీ - లేదంటే 2015–16 లెక్కలతో టారిఫ్ నిర్ణయిస్తామని స్పష్టం సాక్షి, హైదరాబాద్:ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని తెలంగాణ విద్యుత్ సంస్థ (డిస్కం)లను విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ఆదేశించింది. కార్యాచరణ ప్రణాళిక సమర్పించకపోయినా, పథకంలో నిర్దేశించిన విధంగా 2017–18 నాటికి లక్ష్యాలు చేరుకోలేకపోయినా 2015–16 వ్యవ సాయ విద్యుత్ విక్రయాలను ప్రామాణికంగా తీసుకుని విద్యుత్ టారీఫ్ నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. వ్యవసాయ విద్యుత్ వినియోగం, సరఫరా నష్టాల మదింపు కోసం మీటర్లు ఏర్పాటు చేయాలని, దీనిపై ప్రణాళిక రూపొం దించి అనుమతి పొందాలని గతేడాది ఉత్తర్వు ల్లో సూచించినా డిస్కంలు శ్రద్ధ చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. గడువులోగా మీటర్లు బిగించే లక్ష్యాన్ని పునర్ నిర్దేశించడం తప్ప కమిషన్‌కు మరో గత్యం తరం లేదంటూ 2017–18కి సంబంధించి ఇటీవల జారీ చేసిన టారీఫ్ ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. వ్యవసా య విద్యుత్ సరఫరా సమయాన్ని రాత్రిపూట 7 గంటల నుంచి పగటి పూటే 9 గంటలకు పెంచిన డిస్కంలు.. వచ్చే ఫిబ్రవరి నుంచి 24 గంటలు సరఫరా చేసేందుకు సమాయత్త మవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిస్కంలకు ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీలను పెంచాలని ఈఆర్సీ సూచించింది. వ్యవసాయ విద్యుత్‌కు లెక్కల్లేవ్.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు లేకపోవడంతో ఉచిత విద్యుత్‌కు సంబంధించి కచ్చితమైన లెక్కలు డిస్కంల వద్ద లేవు. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్ లో 25 శాతం వ్యవసాయానికి ఇస్తున్నట్లు డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఈఆర్సీ ఆమోదించిన ఐఎస్ఐ విధానం ద్వారా ఈ అంచనాలు రూపొందిస్తున్న డిస్కంలు.. ఏటా ఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లో వీటినే సమర్పిస్తున్నాయి. డిస్కంలు సమర్పిస్తున్న అంచనాలను పరిగణలోకి తీసుకునే ఈఆర్సీ ఏటా విద్యుత్ టారీఫ్ నిర్ణయిస్తోంది. అయితే సరఫరా నష్టాలనూ వ్యవసాయ విద్యుత్ కింద లెక్కగట్టి నష్టాలు తగ్గించి చూపుతున్నాయని డిస్కంలపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యం లో వాస్తవ లెక్కల కోసం విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాజాగా ఈఆర్సీ ఆదేశించింది. తొలుత నాగర్‌కర్నూల్‌లో మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ డివిజన్ లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించడానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఈఆర్సీ అనుమతి కోరింది. అనుమతులు లభించిన తర్వాత మీటర్ల ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని తెలిపింది. 6.5 శాతం పెరిగిన వినియోగం రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం 6.5 శాతం పెరిగిందని ఈఆర్సీకి డిస్కంలు తెలిపాయి. రెండేళ్లలో కొత్తగా 1,47,284 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు జారీ చేయడంతో ఈ మేరకు వినియోగం పెరిగిందని అంచనాలు సమర్పించాయి. -
ఎగసిన దేశభక్తి తరంగం
- రాజమహేంద్రవరంలో 4 వేల మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన - పాల్గొన్న 10 వేల మంది - వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ శ్రీహరిని అభినందించిన ప్రముఖులు సాక్షి, రాజమహేద్రవరం : గోదావరి తీర నగరం రాజమహేంద్రవరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి తరంగాలు ఉవ్వెత్తున ఎగిశాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ నాలుగో డివిజన్ కార్పొరేటర్ బొంతా శ్రీహరి గురువారం 4 వేల మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద ఈ ప్రదర్శనను అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలవల్ల ప్రజల్లో దేశభక్తి, ఐక్యత పెరుగుతాయని వారన్నారు. అనంతరం ఈ ప్రదర్శన టీటీడీ కల్యాణ మండపం, నందం గనిరాజు జంక్షన్, కంబాలచెరువు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా పుష్కర ఘాట్ వరకూ సాగింది. జాతీయ పతాకాలు చేబూని స్కేటింగ్ చేస్తూ చిన్నారులు, బుల్లెట్లపై సాగుతూ యువకులు ఈ ప్రదర్శనలో పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాదాపు 10 వేల మంది విద్యార్థులు, నగర యువత, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నగర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, సుధారాణి, పిల్లి నిర్మల, బొండేసి మాధవి, మెర్సీప్రియ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఏఎస్పీ గంగాధర్, డీఎస్పీలు జి.శ్రీకాంత్, జె.కులశేఖర్, రామకృష్ణ, పలువురు సీఐలు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. జాతీయ భావం వెల్లివిరిసేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ బొంతా శ్రీహరిని నగర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. -
సిరిసిల్లలో డిజిటల్ మీటర్లు
విద్యుత్ చౌర్యం నివారణకు ‘సెస్’ శ్రీకారం సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో డిజిటల్ విద్యుత్ మీటర్లు అమరుస్తున్నారు. ‘సెస్’ పరిధిలోని తొమ్మిది మండలాల్లో పాత విద్యుత్ మీటర్లు తొలగిస్తూ, కొత్త వాటిని అమర్చేందుకు ‘సెస్’ పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలో ఇంటింటికీ డిజిటల్ స్కానింగ్ మీటర్లు బిగిస్తున్నారు. డిజిటల్ మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టనున్నారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు... సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో 1,32,546 ఇంటి మీటర్లు ఉండగా.. వాటిలో తొలి విడతగా పది వేల మీటర్లకు ప్రయోగాత్మకంగా డిజిటల్ మీటర్లు అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సిరిసిల్ల డివిజన్లోని వేములవాడ, సిరిసిల్ల, చందుర్తి, కోనరావుపేట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాల్లోని గృహావసరాలకు పాత మీటర్లు ఉన్నాయి. వీటితో కొందరు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ‘సెస్’ పరిధిలో ఇదివరకు 18 శాతం ఉండే లైన్ లాస్ ఇప్పుడు 35 శాతానికి చేరింది. లైన్లాస్కు విద్యుత్ చౌర్యమే కారణమని భావించిన ‘సెస్’ పాలకవర్గం పాత మీటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో డిజిటల్ మీటర్‌కు రూ.830 ఖర్చవుతుంది. ఆ ఖర్చును సంస్థే భరిస్తుంది. వీటిద్వారా మీటరు రీడింగ్‌ను కూడా స్కానింగ్ ద్వారా నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇంట్లో ఏ విధంగా విద్యుత్ వాడుకుంటున్నా రీడింగ్ నమోదవుతుంది. గతంలో చైనా మీటర్లు గతంలో చైనా మీటర్లను సిరిసిల్ల పట్టణంలో అమర్చారు. వీటిని మరమగ్గాలకు అమర్చడంతో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగించకపోయినా ఎక్కువ రీడింగ్ వస్తుందని పలువురు ఆరోపించారు. దీంతో వాటి బిగింపును నిలిపేశారు. ఇప్పుడు తాజాగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ మీటర్లను సంస్థ అమరుస్తోంది. ‘సెస్’ పరిధిలో బిల్లింగ్ నమోదు చేసే 40 సిబ్బంది సిరిసిల్లలో ఇంటింటికీ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది వినియోగదారులు అభ్యంతరాలు చెబుతున్నా.. రీడింగ్‌లో మార్పులు ఉండవని హామీ ఇస్తున్నారు. -
రైతు నెత్తిన మరో పిడుగు!
వ్యవసాయానికి విద్యుత్ దూరం చేసే కుట్ర బోర్లకు మీటర్లు బిగించే వ్యూహం అప్పు ఇచ్చిన బ్యాంకులకే వంతపాడుతున్న పాలకులు ముందు విద్యుత్ మీటర్లు బిగించి ఆ తర్వాత బిల్లులు వేసే ఆలోచన అదే జరిగితే రైతుపై నెలకు సుమారు రూ.3 వేల భారం వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని సర్కారు చేస్తున్న కుట్రలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 23 వేల ఉచిత విద్యుత్ సర్వీసులతో వ్యవసాయ బోర్లు\ వినియోగించుకుంటున్న రైతులు తమపై ఎక్కడ ఆర్థిక భారం పడుతుందో నని బెంబేలెత్తుతున్నారు. పెరిగిన సాగు ఖర్చులు, తగ్గిన దిగుబడులతో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నను రుణమాఫీ పేరుతో నిలువునా ముంచిన ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను దూరం చేయాలని చూస్తోంది. మోటార్లకు మీటర్లు బిగించాలనే నిబంధన విధించడానికి ఎప్పటి నుంచో కసరత్తు చేస్తూ తాజాగా మరోసారి తెరపైకి తెచ్చింది. ఇది కేవలం విద్యుత్ ఆడిట్ కోసమేనని పైకి చెబుతూనే మరో వంచనకు రంగం సిద్ధం చేస్తోందనే అనుమానం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. విశాఖపట్నం : వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)కు సుమారు రూ.1250 కోట్లు నష్టం వాటిల్లిందని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. ప్రకృతి విపత్తులను తట్టుకునేలా విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్లు వేయడంతో పాటు ఐదు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. కానీఉచిత విద్యుత్‌పై పునరాలోచించాలని షరతు విధించింది. దీంతో అంచెలంచెలుగా ఉచిత విద్యుత్‌ను దూరం చేసేందుకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘ఆధార్’ అందుకేనా రైతుల నుంచి విద్యుత్ శాఖ ఆధార్ కార్డు నెంబర్లను సేకరిచింది. లైన్ లాస్ తగ్గించుకోవడానికి, వ్యవసాయానికి ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుసుకోవడానికేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఒక రైతుకు ఒక సర్వీసు మాత్రమే ఉండేలా.. అదీ నిబంధనలకు తగ్గట్టుగా ఉండేలా చర్యలు చేపట్టడానికి ఆధార్ అనుసంధానం చేశారు. అలాగే గృహ విద్యుత్ లైన్లను వ్యవసాయ విద్యుత్ లైన్ల నుంచి వేరు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి సర్వీసుకు మీటర్లు బిగించి నిర్ణీత యూనిట్లు దాటి వాడే విద్యుత్‌కు బిల్లు వేయడానికే ఈ తతంగం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతపై ఆర్థిక భారం వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మీటర్లు బిగించి చార్జీలు విధిస్తే రైతులపై ఆర్థిక భారం పడుతుంది. 5 హార్స్ పవర్ ఉన్న మోటార్‌కు గంటకు 3.8 యూనిట్ల చొప్పున రోజుకు 26.6 యూనిట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి యూనిట్ విద్యుత్‌ను రూ.3.75కు కొనుగోలు చేస్తోంది. ఆ భారం వ్యవసాయ విద్యుత్ సర్వీసులపైనా పడితే నెలకు రూ.2,992 బిల్లు ప్రతి 5హెచ్‌పి మోటారు వాడే రైతుకు వస్తుంది. అదే 7, 10 హార్స్ పవర్ మోటార్లకైతే బిల్లు తడిసిమోపెడవుతుంది. ఇంత భారాన్ని మోయడం అన్నదాతల వల్లకాక వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. -
24 గంటలూ తాగునీరు
♦ వికారాబాద్‌లో మూడు నెలల్లో ప్రతి ఇంటికీ నీటి సరఫరా ♦ మీటర్లు బిగించే పనిలో మున్సిపల్ యంత్రాంగం ♦ ఒక్కో కుటుంబానికి 20 కిలోలీటర్ల నీరు ♦ నీటిని పొదుపు చేసే ఆలోచనలో అధికారులు రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఆడపడుచులు బిందె పట్టుకుని బోర్ల వద్దకో.. చేతిపంపు వద్దకో వెళ్లనక్కర్లేదు. వికారాబాద్ పట్టణానికి మరో మూడు నెలల్లో ప్రతి ఇంటికీ 24 గంటల పాటు తాగునీటిని అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుం బిగించింది. ఇప్పటికే ప్రతి ఇంటికీ మంజీరా పైపులైన్ ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చింది. ఇప్పటివరకు 10 వేల కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చిన మున్సిపల్ యంత్రాంగం.. ప్రస్తుతం ప్రతి నల్లాకు మీటర్లు బిగించే పనిలో నిమగ్నమైంది. - వికారాబాద్ రూరల్ వికారాబాద్ రూరల్ : అరవై వేల జనాభా ఉన్న వికారాబాద్ పట్టణవాసులకు మంజీరా నీటిని సరఫరా చేసేందుకు ఇప్పటి వరకు మున్సిపల్ యంత్రాంగం సుమారు పది వేల కనెక్షన్లకు ఇచ్చింది. ప్రస్తుతం సుమారు 1000 నల్లాలకు మీటర్లను బిగించింది. మరో 9 వేలకు పైగా మీటర్లు బిగించిన అనంతరం ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా 24 గంటల పాటు నీటి ని సరఫరా చేయనున్నారు. మంజీరా, శివసాగర్ నీటిని పట్టణంలోని సంపులోకి తరలించి అక్కడ ఫిల్టర్ అనంతరం ఆ నీటిని ప్రతి ఇంటికీ నిరంతరం నీటిని సరఫరా చేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబానికి నెలకు 20 కేఎల్ (20 వేల కిలో లీటర్లు)పైగా నీటిని అందించనున్నట్లు వా రు పేర్కొంటున్నారు. తద్వారా కుటుంబానికి ఎంత అవసరమో అంతే నీటిని వినియోగదారులు వాడుకునే అవకాశం ఉంటుంది. మోతాదుకు మించి నీటిని వృథా చేస్తే ఎక్కువ బిల్లు ఎక్కువ వస్తుంది. నీటి వృథా చాలావరకు తగ్గుతుంది. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి వాటికి మీటర్లను బిగించడం వల్ల చాలావరకు నీటి వృథా తగ్గిపోతుందని అధికారులు తెలుపుతున్నారు. గతంలో కాలనీలు, ఇళ్ల వరకు ఉన్న నల్లాలకు ఎలాంటి మీటర్లు కాని లేక పోవడంతో గృహ వినియోగదారులు ఇష్టం వచ్చినట్లు నీటిని వృథా చేసేవారు. ప్రస్తుతం మీటర్లను బిగిస్తుండడంతో నీటి వృథాను చాలావరకు అరికట్టవచ్చు. 20 కేఎల్‌కు రూ. 200 ప్రతి కుటుంబానికి 20 కే ఎల్ నీటికి పైగా ఇవ్వాలని భావిస్తున్న అధికారులు.. ధరలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆలోచన చేస్తున్నారు. 20 కేఎల్ నీటిని వాడుకున్న వారికి కనీసంగా 200 రూపాయల బిల్లు అయ్యే విధంగా చూస్తారు. ఆపై నీటిని వాడుకున్న వారికి అదనంగా చార్జ్ చేసే ఆలోచనలో మున్సిపల్ యంత్రాంగం ఉంది. తీరనున్న తాగునీటి కష్టాలు గతంలో తాగునీటికి ప్రజలు అల్లాడిపోయేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి బయటకు వెళ్లే బాధ తప్పిపోయింది. -
ఓలా, ఉబర్ క్యాబ్ లకు మీటర్లు తప్పనిసరి!
న్యూఢిల్లీః ఓలా, ఉబర్ వంటి టాక్సీ అగ్రిగేటర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. ఇష్టారాజ్యంగా రేట్లను పెంచి, అనైతికంగా వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేట్ క్యాబ్ లపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉబర్, ఓలా ట్యాక్సీల ధరల పెంపుపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. త్వరలో అటువంటి నిబంధనలను మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి తేనుంది. ఆయా అగ్రిగేటర్లను 'ఇంటర్మీడియరీస్' పేరున రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక వర్గంగా గుర్తించనుంది. ఓలా, ఉబర్ ట్యాక్సీలు అమాంతం రేట్లను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రైవేట్ క్యాబ్ ల దోపిడీ రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం స్పందించింది. వారిని కూడ మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి తెచ్చి ధరలపై నిబంధనలు విధించేందుకు కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు సూచించిన ధరలను అనుసరించే విధంగా చట్టం రూపొందనుంది. భారత ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించనున్న 'ఇంటర్ మీడియరీస్' వర్గం ఇంన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 పరిధిలోకి కూడ వస్తుంది. ఈ విషయంలో చివరి నిర్ణయం తీసుకునేందుకు ఎనిమిది రాష్ట్రాల రవాణా మంత్రులు జూన్ చివర్లో ధర్మశాలలో సమావేశం కానున్నారు. అనుకున్న ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఓలా, ఉబర్ క్యాబ్ లు కూడ ఆటోల్లాగే ఆయా నగరాల నిబంధనలను బట్టి మీటర్లు, డ్రైవర్ల డ్రస్ కోడ్.. వంటివి పాటించాల్సి ఉంటుంది. -
నీటి పోటు
కుళాయిలకు మీటర్లు ఏర్పాటు భారీగా పెరగనున్న మంచినీటి చార్జీలు అమృత్ ఎఫెక్ట్ కార్పొరేషన్ అధికారుల కసరత్తు బెజవాడ రాజధానిగా మారిందనో.. లేక ‘అమృత్’ విధించిన ఆంక్షలో కానీ నగరవాసి నెత్తిన పాలకులు నీటి పన్నుల బండ పడేసేందుకు కసరత్తు ప్రారంభించారు. మంచినీటి కుళాయిలకు మీటర్లు బిగించాలన్న మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో 400 శాతం పెరిగిన నీటి చార్జీలు తాజా పరిణామాల నేపథ్యంలో తడిసి మోపెడు కానున్నాయి. విజయవాడ సెంట్రల్ : ఈ నెలాఖరుకల్లా కుళాయిలకు నీటి మీటర్లు బిగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చును గృహ యజమానుల నుంచి వాయిదా పద్ధతుల్లో వసూలుచేయాలని నిర్ణయించారు. అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ ట్రాన్సఫర్మేషన్) ఆంక్షల్లో భాగంగానే నీటి మీటర్లు ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. వృథాను అరికట్టేందుకే మీటర్లు పెడుతున్నట్లు మంత్రి చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరానే లేనప్పుడు నీరు వృథా ఎలా అవుతోందన్న ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది. అమృత్ ఆంక్షలు స్మార్ట్ సిటీ కోసం పోటీపడి ర్యాంకింగ్‌లో చతికిలపడ్డ విజయవాడ నగరపాలక సంస్థ అమృత్ పథకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 73.50 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.24.17 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14.50 కోట్లు, నగరపాలక సంస్థ రూ.33.83 కోట్లు, ఉద్యానవన శాఖ రూ. కోటి చొప్పున ఖర్చు భరించాల్సి ఉంటుంది. అమృత్‌లో భాగంగా నగరంలోని ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటుచేయడంతో పాటు వాటికి మీటర్లు అమర్చాలనే నిబంధన ఉంది. నగరంలో 1,79,245 గృహాలున్నాయి. కుళాయి కనెక్షన్లు 1,06,979 ఉన్నాయి. ఈ లెక్కన మిగతా గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. నీటి సరఫరాకు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.32.40 కోట్లు ఖర్చు చేస్తుండగా.. పన్నుల రూపంలో రూ.28.16 కోట్లు వసూలవుతోంది. నీటి మీటర్లు అమర్చడంపాటు యూజర్ చార్జీలు వసూలు చేసినట్లయితే దండిగా ఆదాయం రాబట్టవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. డబుల్ గేమ్ విజయవాడ నగర జనాభా 12 లక్షలకు చేరింది. శివారు, కొండ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో జరిగే నీటి వృథాను దృష్టిలో పెట్టుకొని మీటర్లు ఏర్పాటు చేసినట్లయితే నగరవాసులందరూ ఆ భారాన్ని మోయాల్సివస్తోంది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వాటర్ చార్జీలను ఏడు శాతం పెంచుతూ తీర్మానం చేశారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏటా ఏడు శాతం పెంచడానికి వీల్లేదని డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు 2014లో ప్రతిపాదన పెట్టారు. దీన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. రెండేళ్లయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఫలితంగా ఏటా ఏడు శాతం చొప్పున నీటి చార్జీలు పెరుగుతున్నాయి. ప్రస్తుత చార్జీలపై 10 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. -
ట్రాన్స్ కో అధికారుల అత్యుత్సాహం
అనంతపురం: అనంతపురం జిల్లా డి.హీరేహల్ మండలం సిద్ధరాంపురం తండాలో శనివారం ఉదయం ట్రాన్స్ కో అధికారులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. తండాలో కొత్త మీటర్లు అమర్చుకోలేదని విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతుల విషయంలో విద్యుత్ శాఖ అధికారుల వైఖరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రావు తీవ్రంగా ఖండించారు. -
మోటార్లు.. మీటర్లు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మున్ముందు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేస్తుందా..? అత్యధికంగా భూగర్భ జలాల వినియోగంపై ఆధారపడిన జిల్లా రైతుల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నల్లగొండది రెండోస్థానం. జిల్లా మొత్తం విద్యుత్ వినియోగంలో 40శాతం వాటా వ్యవసాయ రంగానిదే. ఇక్కడ 3,11,132 విద్యుత్ పంపుసెట్లు ఉన్నాయి. అంటే, జిల్లా రైతాంగం ఎంతగా విద్యుత్ వినియోగంపై ఆధారపడి ఉందో అర్థం చేసుకోవచ్చు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టును మినహాయిస్తే, పెద్దగా ఇరిగేషన్ సౌకర్యం లేదు. ఈ కారణంగానే బోర్లు, బావులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఏ రకంగా చూసినా, జిల్లా రైతులసాగు పూర్తిగా విద్యుత్‌తో ముడిపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆందోళనకు కారణమవుతోంది. రాజాపేట మండలం రఘునాథపురంలో ఎనిమిది మంది రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం వివాదాస్పదమవుతోంది. వర్షాభావ పరిస్థిలకు తోడు విద్యుత్ కోతలు ఇప్పటికే రైతులను వేధిస్తున్నాయి. లోఓల్టేజీ సమస్య సరేసరి. జిల్లాకు కేటాయించింది రోజుకు 17.62మిలియన్ యూనిట్లు కాగా, సోమవారం ఒక్క రోజే 18.72 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడేశారు. కాగా, వ్యవసాయ పంపుసెట్లపై ఆధారపడి వేసిన మెట్ట పంటలు చేతికి వస్తాయా..? రావా అన్న ఆందోళనా ఉంది. ఇదే తరుణంలో విద్యుత్ అధికారులు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెబుతున్న ఉచిత విద్యుత్‌కు అర్థం ఏం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో ఉచిత విద్యుత్ సౌకర్యం పొందుతున్న రైతులు 3,06,588 మంది. కాగా, ఇదే కేటగిరీలో బిల్లులు చెలిస్తున్న రైతులు మరో 4,544 మంది ఉన్నారు. గత ఏడాది ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద రూ.290.78కోట్లు వెచ్చించారు. ఇంతగా ఉచిత విద్యుత్‌పై ఆధారపడిన రైతుల గురించి ఆలోచించకుండా ప్రయోగాత్మకంగానైనా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చడం విమర్శలపాలైంది. కాగా, ఇరవై నాలుగు గంటల ఫీడర్పై కనెక్షన్లుండి, ఎక్కువగా వినియోగిస్తున్నందునే మీట ర్ల బిగించామని విద్యుత్ అధికారులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులకే పరిమితం అవుతుందా..? మెల్లమెల్లగా ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ విస్తరిస్తుందా..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. బిల్లులు చెల్లించాల్సిందే ..! రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన గంగ లింగయ్య, టి.నర్సింహ, జి.నరహరి, శ్రీరాంరెడ్డి తదితర 8 మంది రైతుల వ్యవసాయ పంపుసెట్లకు ఇటీవల ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ మీటర్లు బిగించారు. వీరిలో రైతుల్లో చాలా మంది పశుగ్రాసం వేశారు. మీటర్లు ఎక్కువ విద్యుత్ వినియోగించినట్లు నమోదు చేశాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్నామని.. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తామంటే ఉచిత విద్యుత్ అన్న పదానికి అర్థం ఎక్కడని వీరు ప్రశ్నిస్తున్నారు.