కమలాపూర్: ‘బీజేపీని గెలిపిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మేం ఎక్కడ కూడా అలా చెప్పలేదు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందా? రాయలేదా?’స్పష్టంగా చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వ నూతన పాలసీని తాను చదివి వినిపిస్తే ఇప్పటిదాకా మౌనంగా ఉండి, మళ్లీ ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం మొదలుపెట్టారన్నారు. కేసీఆర్ హామీ లపై చర్చకు రమ్మని అనేక సార్లు సవాల్ విసిరితే స్పందించలేదని, వాళ్లు చేసిన సవాల్‌ను తాము స్వీకరించినా స్పందించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరిస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ సంస్థలో రాష్ట్రానిది 50 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలున్నాయని, తక్కువ శాతం వాటా ఉన్నోళ్లకు ప్రైవేటీకరణ చేయడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment