
పూల సాగుతో ఆదాయం
పాలసముద్రం, న్యూస్‌లైన్: మండలంలో పూల సాగుతో రైతులు మంచి ఆదాయూన్ని పొందుతున్నారు. తమిళనాడు సరిహద్దులో ఉన్న తిరుమలరాజుపురం, బాలకృష్ణాపురం, గంగమాంబాపురం ప్రాంతాల్లో బంతి, మల్లె, వెల్‌వెట్ బంతి పూల సాగు చేస్తున్నారు. మంచి దిగుబడితో పాటు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతులు పూల సాగుపై దృష్టి సారిస్తున్నారు. మార్కెట్ సదుపాయం కూడా బాగా ఉండడడంతో రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు.
మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా పూల తోటలు సాగులో ఉన్నారు. ప్రస్తుతం అన్ని రకాల పూలు కిలో రు.60 నుంచి రు70 వరకు ధర పలుకుతున్నాయి. ఈ పూలు ఐదు రోజులైనా వాడకుండా ఉంటారుు. దీంతో వ్యాపారులకు ఎలాంటి నష్టం రాదు. జాతరలు, పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో ఈ పూలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఎకరా పూల సాగు చేస్తే రూ. 60 వేల నుంచి 70 వేలు వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. నీరు కూడా రెండు రోజులకు ఒక సారి పారిస్తేచాలని.
పంటకాలం ఆరునెలలు. ఒకసారి పంట సాగు చేస్తే రెండేళ్ల పాటు దిగుబడి వస్తుంది. ఎలాంటి తెగుళ్ల బెడదా ఉండదు. పూలు కోసే వారికి కూలి మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పొడువునా బంతి, వెల్‌వెట్ పూలకు మార్కెట్‌లో రేట్లు నిలకడగా ఉంటుండడంతో మరింత మంది రైతులు ఈ పూల సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడి నుంచి పూలను చెన్నై, వేలూరు, బెంగళూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.