‘మెరిసే మెరిసే’సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కుమార్ కొత్తూరి ఇప్పుడు హీరోగా మారాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'యావరేజ్ స్టూడెంట్ నాని'. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది.
ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ లోనే తన ఎక్స్ ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు పవన్ కుమార్. ఈ రోజు సెకండ్ సింగిల్ ‘ఏమైందో మనసే’ అనే పాటను రిలీజ్ చేశారు.పూర్తి రొమాంటిక్ మోడ్‌లో సాగే ఈ మెలోడీ పాటకు కార్తీక్ బి కొడకండ్ల మంచి బాణీని అందించారు. శక్తి శ్రీ గోపాలన్ గానం వినసొంపుగా ఉంది. కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment