మంచిర్యాల: నకిలీ ఐడీ కార్డుతో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్న వ్యక్తిని ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నట్లు నకిలీ ఐడీకార్డుతో పవన్‌కుమార్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేవాడు. స్టాఫ్ అని చెబుతూ కండక్టర్లను నమ్మించేవాడు. అయితే సోమవారం మంచిర్యాలలో స్పెషల్ స్క్వాడ్ అధికారులు కార్డును తనిఖీచేసి నకిలీదని గుర్తించారు. ఆర్టీసీ అధికారులు నిందితుడిని మంచిర్యాల పోలీసులకు అప్పగించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని స్టేషన్కు తరలించారు.