'సినిమా నచ్చితేనే డబ్బులివ్వండి' | Pay only if you like content, says Pawan Kumar | Sakshi
Sakshi News home page

'సినిమా నచ్చితేనే డబ్బులివ్వండి'

Published Mon, Mar 17 2014 2:38 PM | Last Updated on Thu, Aug 9 2018 7:20 PM

'సినిమా నచ్చితేనే డబ్బులివ్వండి' - Sakshi

'సినిమా నచ్చితేనే డబ్బులివ్వండి'

సినిమా చూడాలంటే ముందుగానే టికెట్ కొనుక్కోవాలి. వందో రెండొందలో పెట్టి టికెట్ కొనుక్కుని చూసిన తర్వాత సినిమా నచ్చినా, నచ్చకపోయినా ఏమీ చేయలేం. కానీ, కన్నద దర్శకుడు పవన్ కుమార్ దీనికో పరిష్కారం చూపిస్తున్నారు. 'లూసియా' సినిమాతో తారాపథానికి వెళ్లిన ఈయన, కొత్త పద్ధతి సూచిస్తున్నారు. సినిమా నచ్చితేనే టికెట్ డబ్బులు ఇవ్వాలని, లేకపోతే అక్కర్లేదని అంటున్నారు!

మేకింగ్ ఆఫ్ లూసియా అనే డాక్యుమెంటరీని ముందు ఉచితంగా చూడొచ్చని, అది నచ్చితేనే దానికి డబ్బులు ఇవ్వాలని ఆయన తన ఫేస్బుక్ పేజీలో రాశాడు. ఈ ప్రయోగం ఫలిస్తే, సినిమాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నాడు. అప్పుడు సినిమాలు విడుదల చేయడానికి కూడా ప్రత్యామ్నాయ డిస్ట్రిబ్యూషన్ విధానాలు అవసరం అవుతాయన్నాడు. లూసియా సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈలోపు సిద్ధార్థ హీరోగా ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement