భర్తపై ఫిర్యాదు చేసిన భార్య (ఫైల్‌ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమేగాక మరో ఆరుగురితో సహజీవనం చేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ మంగళవారం సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హిమబిందు అనే మహిళకు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా 2018లో మియాపూర్‌లోని హెచ్‌ఎంటీ స్వర్ణప్యాలస్‌లో ఉంటున్న వెంకటబాలకృష్ణ పవన్‌కుమార్‌తో వివాహం జరిగిందన్నారు. కట్నంగా రూ.28లక్షలు, పెళ్లి ఖర్చులకు మరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వివాహం అనంతరం తనను దుబాయ్ తీసికెళ్లిన పవన్‌కుమార్ అక్కడ వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది.
తనకు ఇదివరకే మరో ముగ్గురితో పెళ్లి జరిగిందని, మొదటి భార్య, రెండో భార్యను వదిలేసినట్లు అతనే స్వయంగా తనతో చెప్పాడని, మూడో భార్యను నేరుగా తనకు పరిచయం చేయడమేగాక ఆమె తన నిజమైన భార్య అని చెప్పినట్లు ఆరోపించింది. ఓ రోజు ఐరన్‌బాక్స్‌తో తన ముఖంపై కాల్చేందుకు ప్రయత్నించాడని, ఆ తర్వాత కూడా పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాది క్రితం మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టానని, న్యాయం కోసం పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. కొద్దిరోజులుగా తన ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ హ్యాక్ చేశారని ఆరోపించింది. తన భర్త పవన్‌కుమార్‌కు కఠినంగా శిక్షించి కట్నం డబ్బులు, పెళ్లి ఖర్చులు మొత్తం రూ.38లక్షలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment