cybarabad
-
ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
-
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లో బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
హైదరాబాద్‌లో వర్క్ ఫ్రం ఆఫీస్.. బ్యాక్ టు ‘ట్రాఫిక్ రూల్స్’
సాక్షి, హైదరాబాద్: దశల వారీగా ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులూ సన్నద్ధమవుతున్నారు. ఐటీ కారిడార్‌లో క్రమగా వాహనాల రద్దీ పెరుగుతోంది. వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్ బస్సులలో ఉద్యోగులు కార్యాలయాలకు హాజరవుతుండటంతో ఐటీ కారిడార్ జంక్షన్లలో ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఇప్పటికే ఆయా కారిడార్లలోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద పని చేయని సిగ్నల్స్, సీసీ కెమెరాలను రిపేరు చేసి పోలీసులు నిర్వహణకు సిద్ధం చేశారు. రెండున్నరేళ్ల తర్వాత... ► కరోనా ప్రభావంతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ముగించేందుకు ఐటీ కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ► దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఉద్యోగులు దశల వారీగా ఉద్యోగులు హాజరయ్యేలా కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ► తొలుత సగం మంది ఉద్యోగులను వారం విడిచి వారం ఆఫీసులకు వచ్చేలా.. క్రమంగా హాజరు శాతాన్ని పెంచుతూ.. రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులు ప్రత్యక్ష విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ► సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఐటీ, ఇతర ఉద్యోగులు ఐటీ కారిడార్‌కు వస్తుంటారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. (క్లిక్: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్) ► ఐటీ కారిడార్‌లో ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల రద్దీ పెరగనుంది. ఇందుకు తగ్గట్టుగానే జంక్షన్లు, సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పని చేయని సిగ్నళ్లు, పాడైపోయిన కెమెరాలను బాగు చేయడంతో పాటూ, వార్షిక సర్వీస్‌లను చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొత్తగా మూడు సెక్టార్లు.. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 ట్రాఫిక్ పీఎస్‌లు ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో కొత్తగా మూడు ట్రాఫిక్ సెక్టార్లు ఏర్పాటు చేశారు. సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఉద్యోగులు మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ప్రాంతాలకు వస్తుంటారు. దీంతో ఆయా ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేషన్ల పరిధిలోని ఆఫీసర్లు, సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సెక్టార్లు ఏర్పాటు చేస్తే సిబ్బందిపై ఒత్తిడి తగ్గి, ట్రాఫిక్ నియంత్రణ సులువవుతుందని అధికారులు భావించారు. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పోటీస్ స్టేషన్ల పరిధిలో కొత్తగా మూడు సెక్టార్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ► మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో రాయదుర్గం సెక్టార్ ► గచ్చిబౌలి పీఎస్ పరిధిలో నార్సింగి సెక్టార్ ► కూకట్పల్లి పీఎస్ పరిధిలో కేపీహెచ్‌బీ సెక్టార్‌ను ఏ ర్పాటు చేశామని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ► ఒక్కో సెక్టార్‌కు ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు, 45 మంది కానిస్టేబుళ్లు కేటాయించారు. (క్లిక్: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లండన్ బేస్డ్ యూనికార్న్ కంపెనీ) -
నాలుగు పెళ్లిళ్లు.. ఆరుగురితో సహజీవనం
సాక్షి, హైదరాబాద్ : నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమేగాక మరో ఆరుగురితో సహజీవనం చేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ మంగళవారం సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హిమబిందు అనే మహిళకు మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా 2018లో మియాపూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణప్యాలస్‌లో ఉంటున్న వెంకటబాలకృష్ణ పవన్‌కుమార్‌తో వివాహం జరిగిందన్నారు. కట్నంగా రూ.28లక్షలు, పెళ్లి ఖర్చులకు మరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వివాహం అనంతరం తనను దుబాయ్ తీసికెళ్లిన పవన్‌కుమార్ అక్కడ వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. తనకు ఇదివరకే మరో ముగ్గురితో పెళ్లి జరిగిందని, మొదటి భార్య, రెండో భార్యను వదిలేసినట్లు అతనే స్వయంగా తనతో చెప్పాడని, మూడో భార్యను నేరుగా తనకు పరిచయం చేయడమేగాక ఆమె తన నిజమైన భార్య అని చెప్పినట్లు ఆరోపించింది. ఓ రోజు ఐరన్‌బాక్స్‌తో తన ముఖంపై కాల్చేందుకు ప్రయత్నించాడని, ఆ తర్వాత కూడా పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాది క్రితం మహిళా పోలీసు స్టేషన్లో కేసు పెట్టానని, న్యాయం కోసం పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. కొద్దిరోజులుగా తన ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ హ్యాక్ చేశారని ఆరోపించింది. తన భర్త పవన్‌కుమార్‌కు కఠినంగా శిక్షించి కట్నం డబ్బులు, పెళ్లి ఖర్చులు మొత్తం రూ.38లక్షలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. -
ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారంతంలో పెద్ద ఎత్తున నగర వాసులు వస్తుండటంతో ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక అనుమతులు సైతం ఇచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాహనాలను నిషేధించిన అధికారులు.. కేవలం పర్యటకులను మాత్రమే అవకాశం కల్పించారు. అయినప్పటికీ వంతెనపై రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా వంతెనపైనే వాహనాలు ఆపి ఫోటోలు దిగుతున్నారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన పోలీసులు.. వంతెనపై పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్‌పై వాహనాలు ఆపితే.. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లు సందర్శకులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల పిల్లలతో వచ్చిన ఓ కుటుంబం వంతెనపై బైక్ ఆపి ఫోటోలకు ఫోజులిచ్చింది. సీసీ కెమెరాలను గమనించిన భర్త.. బైక్ నెంబర్ ప్లేట్ కనిపించకుండా భార్య మెడలోని చున్నీని తీసి దానిని కవర్ చేశాడు. ఇది కూడా అక్కడి కెమెరాలో రికార్డు అయ్యింది. వీరి ఘనకార్యం కాస్తా పోలీసుల కంటపడంతో అలర్ట్ అయ్యారు. ఇది గమనించి వారు బైక్ తీసుకుని అక్కడి నుంచి పరార్ అయ్యారు. అయినప్పటికీ జరిమానా నుంచి తప్పించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ పోలీసులు అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. బిగ్‌బాస్ (సీసీ కెమెరా) చూస్తున్నాడు, ఇలాంటి తెలివైన భార్య ఉండటం గ్రేట్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. -
ప్రమాదకరంగా తీగల వంతెన.. కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. గతనెల 25న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా తీగల వంతెన ప్రారంభమైంది. లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సదర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెనపై వాహనాలు వేగంగా వేళ్తున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ఫోటోలకు ఎగబడుతున్నారు. రోడ్డుపై వస్తున్న వాహనాలు ఏమాత్రం లెక్కచేయకుండా సెల్పీలు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా వారంతంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తుండటంతో సెల్పీస్పాట్ ప్రమాదకరంగా మారింది. దీనిపై దృష్టిసారించిన జీహెచ్ఎంసీ అధికారులు వాహనాలపై వంతెనపై నిలపకుండా నిషేదం విధించారు. ఫోటోల కోసం వంతెనపై ఆగితే భారీగా చలనాలు విధిస్తున్నారు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. వీకెండ్స్‌లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై గురువారం సీపీ సజ్జనార్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కేబుల్ బ్రిడ్జిపైకి సందర్శకులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, ఇతర సమస్యలు రాకుండా ట్రాఫిక్ వారాంతాల్లో వాహనాలను అనుమతించకపోవడమే సరైందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి తిరిగి సోమవారం ఉదయం 6 గంటల వరకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ బ్రిడ్జిపైకి ఐటీసీ కోహినూర్‌తో పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 వైపు నుంచి వాహనాలతో సందర్శకులు వస్తున్నందున ఇరువైపులా పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు. దీంతో వారంతంలో పర్యటకుల ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీపీ తెలిపారు. -
చుక్కేసి.. చిక్కేసి!
సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపిన డ్రంకన్ డ్రైవర్లపై నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గతేడాది ఏకంగా 29,484 కేసులు నమోదు చేసి న్యాయస్థానాల్లో చార్జిషీట్ దాఖలు చేయడంతో 5,441 మందికి 1–3 నెలల పాటు జైలు శిక్షలు పడ్డాయి. 189 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దయ్యాయి. 1,235 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను 3–10 ఏళ్ల పాటు రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. మిగిలిన వారికి రూ.5,88,99,500 జరిమానా విధిం చింది. 2017లో 20,811 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదైతే 4015 మందికి జైలు శిక్ష పడగా, 203 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. ఉల్లంఘనులపై కొరడా... సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మైనర్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్...ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 894 మందికి జైలు శిక్ష పడింది. ఉన్నత నిబంధనలు అతిక్రమించిన 129 మంది, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ 212 మంది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 401 మంది, మైనర్ డ్రైవింగ్ 42 మంది, డేంజరస్ డ్రైవింగ్ 19 మంది, ఎంవీ యాక్ట్ నిబంధనలు అతిక్రమించిన 11 మంది ఆటో డ్రైవర్లను చంచల్‌గూడ జైలుకు తరలించారని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్ కుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సైబరాబాద్‌లో 409 మందికి జైలు న్యూ ఈయర్ వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన డ్రంకన్ డ్రైవర్లకు కూకట్పల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష విధించింది. 409 మంది డ్రంకన్ డ్రైవర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 111 మందికి మొత్తం 516 మందిని చర్లపల్లి జైలుకు తరలిస్తూ శనివారం ఆదేశించింది. 409 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువగా మాదాపూర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ (149), కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ (79), గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ (74), మియాపూర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ (55), బాలానగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ (52)కేసులు ఉన్నాయి. మూడు నుంచి 25 రోజుల పాటు డ్రంకన్‌డ్రైవర్లకు శిక్ష పడిందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. -
కరక్కాయ స్కాం.. నిందితుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన మల్లిఖార్జున్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 44 లక్షల రూపాయలతో పాటు కరక్కాయ సంచులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కరక్కాయల పొడిని కొనుగోలు చేస్తామంటూ ఓ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ అమాయక ప్రజలకు వలవేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించింది విషయం తెలిసిందే. గతనెల 16న కేపీహెచ్‌బీ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కరక్కయ పొడి చేసి ఇస్తే అధిక మొత్తం చెల్లిస్తామంటూ దగా చేసిన నిందితులు కోట్ల రూపాయలను దండుకున్న విషయం తెలిసిందే. ఈ స్కాంలో 10 కోట్లకు పైగా మోసం జరిగిందని సీపీ వెల్లడించారు. తెలంగాణతో పాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. -
బొంబయి కాలనీలో కార్డన్ సెర్చ్
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణంలోని బొంబయికాలనీలో శనివారం రాత్రి సైబరాబాద్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటినీ పోలీసులు జల్లెడ పట్టారు. గతంలో నేర చరిత్ర ఉన్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరాలకు పాల్పడుతున్న వారితో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో మరో 38 మందిని అదుపులోకి తీసుకున్నారు. 40 ద్విచక్ర వాహనాలు, 19 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడంలో భాగంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా రామచంద్రాపురం పారిశ్రామిక వాడ కావడంతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడ నివసిస్తున్నారని దాంతోపాటు ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. అందులో భాగంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకొని తనిఖీలు చేశామన్నారు. తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలతో సంబంధం వారితో మాట్లాడిన వారి సమాచారం తెలుస్తుందన్నారు. వేలిముద్రలు కూడా తీసుకుంటున్నామని ఎక్కడైనా నేరానికి పాల్పడిన వారు ఉంటే వేలిముద్రలు తీసుకున్న వెంటనే ఫోన్లో వారి పూర్తి సమాచారంతో పాటు వారిపై ఉన్న కేసుల వివరాలు కూడా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. నేరాలను తగ్గించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రంగారెడ్డి, ఏసీపీ రవి, 12మంది ఇన్సె్పక్టర్లు, 26 మంది ఎస్ఐలు పాల్గొన్నారు. -
నలుగురు నేరస్తుల అరెస్ట్
హైదరాబాద్: నేరస్తుల ఏరివేతలో భాగంగా నలుగురు పేరుమోసిన దొంగలను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు 22 దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాహనాల డిక్కీల్లో నుంచి నగదు తస్కరించడం, బ్యాంకులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చిన వారి దృష్టి మరల్చి డబ్బు అపహరించడంలో నేర్పరులైన వీరిని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. కర్మన్‌ఘాట్ భూపేష్గుప్తా నగర్లో నిందితులు ఉంటున్న ఇంటినుంచి రూ. 17.88 లక్షల నగదు, పది తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎక్కువగా రాచకొండ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పేట్ల సురేష్, కుంచాల గోపి, పసుపులేటి శివ, గోకుల్దాస్ అనే నలుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
ట్రాఫిక్ పోలీసులకు 'కెమెరా కళ్లద్దాలు'
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు అత్యాధునికమైన ‘ఐ వార్న్ కెమెరా’లు సమీకరించుకున్నారు. దేశంలో ఈ తరహా పరిజ్ఞానం వినియోగిస్తున్న పోలీసు వ్యవస్థగా సైబరాబాద్ రికార్డుకెక్కింది. ఈ కెమెరాలను పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం సిబ్బందికి అందించారు. తొలివిడతలో ప్రయోగాత్మకంగా ఏడు కెమెరాలు ఖరీదు చేశారు. ఆధునిక రంగుల కళ్లజోడుకు కుడి వైపున ఇమిడి ఉండే ఈ కెమెరాల సాయంతో సిబ్బంది చూసిన ప్రతి ప్రాంతాన్నీ చిత్రీకరించే అవకాశం ఉంది. 32 జీబీ ఇంటర్నల్ మెమోరీతో కూడిన ఈ కెమెరాలు ఆడియో, వీడియోలను నిర్విరామంగా 21 గంటల పాటు రికార్డు చేస్తాయి. కమిషనరేట్‌లోని ట్రాఫిక్ విభాగం వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న 25 బాడీ వార్న్ కెమెరాలకు అదనంగా మరో 75 ఖరీదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు వాహనచోదకులు, సామాన్య ప్రజలతో ఏ విధంగా సంభాషిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారనే అంశాలను బాడీ వార్న్, ఐ వార్న్ కెమెరాలు రికార్డు చేస్తాయి. ఈ ఫుటేజ్‌ను ఆయా ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలోని కంప్యూటర్లలో భద్రపరుస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్/వీడియో కెమెరాలకు అదనంగా వీటిని వాడుతున్నట్లు ఆనంద్ తెలిపారు. ఉల్లంఘనుల నుంచి జరిమానా డబ్బు నేరుగా వసూలు చేయకుండా ఉండేలా క్యాష్ లె స్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని సైబరాబాద్ పోలీసులూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చలాన్ పుస్తకాల స్థానంలో వినియోగించడానికి ట్యాబ్స్ ఖరీదు చేశారు. వీటిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సిబ్బంది, అధికారులకు అందించారు. క్షేత్రస్థాయిలో ఉండే సైబరాబాద్ ట్రాఫిక్ సిబ్బంది ప్రతికూల వాతారణ పరిస్థితుల్లోనూ ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించడం కోసం కిట్‌బ్యాగ్స్ ఖరీదు చేశారు. బూట్లు, వాటర్ బాటిల్, సన్ గ్లాసెస్, నోస్ మాస్క్, రిఫ్లెక్టివ్ జాకెట్, రెయిన్ కోట్తో కూడిన ఈ కిట్లను ఆనంద్ వెయ్యి మంది సిబ్బందికి అందించారు.