ఓ యువకుడి నుంచి వివరాలు తెలుసుకుంటున్న డీసీపీ వెంకటేశ్వరరావు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణంలోని బొంబయికాలనీలో శనివారం రాత్రి సైబరాబాద్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటినీ పోలీసులు జల్లెడ పట్టారు. గతంలో నేర చరిత్ర ఉన్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరాలకు పాల్పడుతున్న వారితో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో మరో 38 మందిని అదుపులోకి తీసుకున్నారు.
40 ద్విచక్ర వాహనాలు, 19 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడంలో భాగంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా రామచంద్రాపురం పారిశ్రామిక వాడ కావడంతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడ నివసిస్తున్నారని దాంతోపాటు ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని తెలిపారు.
అందులో భాగంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకొని తనిఖీలు చేశామన్నారు. తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలతో సంబంధం వారితో మాట్లాడిన వారి సమాచారం తెలుస్తుందన్నారు. వేలిముద్రలు కూడా తీసుకుంటున్నామని ఎక్కడైనా నేరానికి పాల్పడిన వారు ఉంటే వేలిముద్రలు తీసుకున్న వెంటనే ఫోన్‌లో వారి పూర్తి సమాచారంతో పాటు వారిపై ఉన్న కేసుల వివరాలు కూడా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. నేరాలను తగ్గించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రంగారెడ్డి, ఏసీపీ రవి, 12మంది ఇన్సె్పక్టర్లు, 26 మంది ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment