suspicious men
-
బొంబయి కాలనీలో కార్డన్ సెర్చ్
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణంలోని బొంబయికాలనీలో శనివారం రాత్రి సైబరాబాద్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటినీ పోలీసులు జల్లెడ పట్టారు. గతంలో నేర చరిత్ర ఉన్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరాలకు పాల్పడుతున్న వారితో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో మరో 38 మందిని అదుపులోకి తీసుకున్నారు. 40 ద్విచక్ర వాహనాలు, 19 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడంలో భాగంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా రామచంద్రాపురం పారిశ్రామిక వాడ కావడంతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడ నివసిస్తున్నారని దాంతోపాటు ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. అందులో భాగంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకొని తనిఖీలు చేశామన్నారు. తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలతో సంబంధం వారితో మాట్లాడిన వారి సమాచారం తెలుస్తుందన్నారు. వేలిముద్రలు కూడా తీసుకుంటున్నామని ఎక్కడైనా నేరానికి పాల్పడిన వారు ఉంటే వేలిముద్రలు తీసుకున్న వెంటనే ఫోన్లో వారి పూర్తి సమాచారంతో పాటు వారిపై ఉన్న కేసుల వివరాలు కూడా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. నేరాలను తగ్గించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రంగారెడ్డి, ఏసీపీ రవి, 12మంది ఇన్సె్పక్టర్లు, 26 మంది ఎస్ఐలు పాల్గొన్నారు. -
వణికిస్తున్న వదంతులు
తాండూరు, బషీరాబాద్(రంగారెడ్డి) : కర్ణాటక సరిహద్దు మండలం బషీరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి అలజడి రేగింది. కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వదంతులతో పల్లెలు వణికి పోతున్నాయి. దావానలంలా వ్యాపించిన నేరస్తుల పాత వీడియోలు, ఫొటోలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉక్కపోతతో ఇన్ని రోజులు ఆరుబయట పడుకున్న పల్లె జనం వదంతుల భయంతో గుంపులుగా గుమిగూడి జాగారం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా, బీదర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తుల ముఠాలు రాత్రి వేళల్లో గ్రామాల్లో సంచరిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. పిల్లలను, వృద్ధులను కిడ్నాప్ చేసి చంపేస్తున్నారనే పుకార్లు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో గుల్బర్గా జిల్లా సరిహద్దులోని నావంద్గి, ఇందర్‌చెడ్, క్యాద్గిర, ఎక్మాయి, మంతన్‌గౌడ్, మైల్వార్, కంసాన్పల్లి, నీళ్లపల్లి, జలాల్పూర్, మంతట్టిలో ప్రజలు నిద్ర కూడా పోవడం లేదు. నావంద్గిలో ఆదివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని అగంతకులు సంచరించారనే అనుమానంతో గ్రామస్తులు రాత్రంతా గాలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి ధైర్యం చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు, ఫొటోలు నమ్మవద్దని, అవన్నీ ఫేక్ అని వివరించారు. వాట్సప్ గ్రూపుల్లో అలాంటివి వస్తే షేర్ చేయొద్దని సూచించారు. నీళ్లపల్లి గ్రామస్తులు అర్ధరాత్రి సర్పంచ్ ఉమాసుధాకర్‌రెడ్డి ఇంటి వద్ద గుమిగూడి, పోలీసులను పిలిపించాలని విన్నవించారు. అగ్గనూరులో అనుమానిత వ్యక్తిపై దాడి యాలాల (వికారాబాద్) : చిన్న పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడని భావిస్తూ ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ సంఘటన మండల పరిధిలోని అగ్గనూరులో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. ఇతని కదలికలు, వ్యవహారంపై అనుమానం వచ్చిన కొంతమంది అతన్ని పట్టుకుని వివరాలు అడిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భయం వద్దు తాండూరులో చిన్నారులను అపహరించే ముఠా సంచరిస్తోందంటూ వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. ప్రజలు భయపడాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు, ఫొటోలను నమ్మవద్దు. కావాలనే కొందరు ప్రజలను భయబ్రాంతులను గురి చేసేందుకు ఇలాంటివి ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు నమోదు కాలేదు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. ఉపాధి కోసం వచ్చే అమాయకులపై దాడులు చేయొద్దు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి. – రామచంద్రుడు, డీఎస్పీ, సెల్: 94406 27353 -
మహారాష్ట్రలో హై అలర్ట్
- ఉరణ్ పోర్టు వద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారం - ఉగ్రవాదులుగా అనుమానం సాక్షి, ముంబై: ముంబై సమీపంలో ఉగ్రవాద కదలికల సమాచారంతో మహారాష్ట్ర సర్కారు హైఅలర్ట్ ప్రకటించింది. రాయ్‌గడ్ జిల్లా ఉరణ్ నేవీ యార్డు సమీపంలో ఆరుగురు వ్యక్తులు మారణాయుధాలతో కనిపించారన్న వార్త నేపథ్యంలో అప్రమత్తమైంది. అనుమానిత వ్యక్తుల కోసం వేట మొదలైంది. ఉరణ్‌లో ప్రభుత్వ సంస్థల కీలకమైన కార్యాలయాలు, స్థావరాలున్నాయి. జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు, ఓఎన్జీసీ, నౌకాదళ స్థావరాలున్నాయి. విద్యార్థులు చూసి.. గురువారం ఉదయం కుంబార్ వాడా, కరంజా ప్రాంతంలో ఆరుగురు అపరిచిత వ్యక్తులు సైనిక దుస్తుల్లో తుపాకులు చేతబట్టుకుని వెళ్లిన విషయాన్ని కొందరు విద్యార్థులు గమనించారు. పాఠశాలకు వెళ్లాక దీన్ని టీచర్‌కు చెప్పారు. విద్యార్థులు చెబుతున్నది నిజమేనని స్కూలు యాజమాన్యం నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమందించింది. అప్రమత్తమైన పోలీసులు, కోస్టుగార్డు, నావికాదళం, జాతీయ భద్రత దళాలు గాలింపు చేపట్టాయి. సముద్ర మార్గం ద్వారా రద్దీ తక్కువగా ఉండే ఉరణ్ గుండా ఉగ్రవాదులు ప్రవేశించారా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. స్థానిక మత్స్యకారులను కూడా విచారిస్తున్నారు. ముంబై తీర ప్రాంతంలోనూ కూంబింగ్ ముమ్మరం చేశారు. -
ముంబయిలో హై అలర్ట్
-
ఉగ్రవాదుల కదలిక, ముంబయిలో హై అలర్ట్
-
ఉగ్రవాదుల కదలిక, ముంబయిలో హై అలర్ట్
ముంబయి: ముంబైలో నేవీ అధికారులు గురువారం హై అలర్ట్ ప్రకటించారు. నేవీ బేస్ వద్ద దుండగులు ఆయుధాలతో సంచరిస్తున్న సమాచారం నేపథ్యంలో నేవీ అప్రమత్తం అయింది. ముంబై సమీపంలోని ఉరాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి నల్ల దుస్తులు ధరించి ఆయుధాలతో సంచరిస్తున్నట్లు స్కూలు విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ డిలీప్ సావంత్ మాట్లాడుతూ గాలింపు చర్యలు చేపట్టామని, ఇప్పటివరకూ ఎలాంటి అనుమానస్పద సమాచారం లేదన్నారు. మరోవైపు ముంబై పోలీసులు, మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అప్రమత్తం అయింది. కాగా అక్కడ మీడియా చానల్స్ కథనం ప్రకారం ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయంలో నలుగురు లేదా అయిదుగురు వ్యక్తలు సైనిక దుస్తులు ధరించి ఉరాన్ ప్రాంతంలోకి వచ్చినట్లు కథనాలు ప్రసారం చేశాయి. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.