Cordon and search operation
-
పాక్ సరిహద్దు జిల్లాల్లో కార్డన్ సెర్చ్
సాక్షి, ఢిల్లీ : కశ్మీర్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశముందన్న సమాచారంతో పంజాబ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు శుక్రవారం భారీ కార్డన్ సెర్చ్ చేపట్టారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఆపరేషన్‌లో ఐదు వేల మంది పోలీసులు, బీఎస్ఎఫ్, మిలిటరీ నిఘా వర్గాలు, ఎన్ఐఎకు చెందిన సాయుధ బలగాలు పాల్గొంటున్నాయి. ఈ ఆపరేషన్‌కు పంజాబ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఈశ్వర్ సింగ్, అడిషనల్ డెరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాకేశ్ చంద్రలు నేతృత్వం వహిస్తున్నారని పంజాబ్ డీజీపీ దిన్కర్ గుప్తా శనివారం తెలియజేశారు. ఈ బలగాలు అనుమానాస్పద ప్రాంతాల గురించి పరస్పరం సమాచారాన్ని పంచుకుకుంటాయని డీజీపీ వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత నెలలో పాకిస్తాన్‌లోని ఖలిస్తాన్ ఉగ్రవాదులు 8 డ్రోన్ల ద్వారా దాదాపు 80 కిలోల పేలుడు పదార్ధాలు, ఆయుధాలను పంజాబ్ సరిహద్దుల్లో విడిచిపెట్టిందని నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ను ఇతర సరిహద్దు ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లోని ప్రతీ ఆసుపత్రిలో 8 బెడ్లను అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉంచాలని జిల్లా అధికారులు ఆదేశించారని పఠాన్‌కోట్ మెడికల్ ఆఫీసర్ భూపీందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ నగర్లో కార్డన్ సెర్చ్
తల్లాడ : వైరా ఏసీపీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్లోని 80 మంది పోలీసులు తల్లాడ సమీపంలోని ఎన్టీఆర్ నగర్లో మంగళవారం వేకువజామున కార్డన్ సెర్చ్ చేశారు. ప్రతి ఇంటిలోని సభ్యుల ఆధార్ కార్డులను తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ చేసి పత్రాలు లేని 20 బైక్‌లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నా రు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్నగర్.. ప్రభుత్వ స్థలంలో నిర్మించిందని, ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని, వారి ఇళ్లకు ఎవరు వచ్చి పోతున్నారో పరిశీలించాలన్నారు. అపరిచితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలా సమాచారం ఇవ్వటం వల్ల నేరస్తులను గుర్తించ వచ్చన్నారు. కార్యక్రమంలో సీఐ నాయుడు మల్లయ్యస్వామి, మధిర సీఐ శ్రీధర్, తల్లాడ, వైరా, చింతకాని, కొణిజర్ల, మధిర టౌన్, బోనకల్లు ఎస్ఐలు మేడా ప్రసాద్, టి.నరేష్, మొగిలి, ఎస్.సురేష్, తిరుపతరెడ్డి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
పాపన్నపేటలో కార్డన్ సెర్చ్
పాపన్నపేట(మెదక్) : మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం మెదక్ సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తూప్రాన్ డీఎస్పీ రాంగోపాల్, ముగ్గురు సీఐలు రామకృష్ణ, రవీందర్‌రెడ్డి, శ్రీరాం విజయ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో 8మంది ఎస్ఐలు కలిసి మొత్తం 55 మంది సిబ్బందితో ఈ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 129 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 13 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా పోలీసు వాహనాలు మొట్ట మొదటిసారిగా పాపన్నపేట గ్రామంలో ప్రవేశించి కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో జనాలు ఆందోళనకు గురయ్యారు. రూరల్‌సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్ఐ ప్రశాంత్‌రెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల్లో ఆరాచకశక్తులు తిష్టవేయకుండా, సంఘ విద్రోహక శక్తులు హింసాయుత చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు తరచుగా కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దొంగతనాన ఎత్తుకొచ్చిన వాహనాలను కొంతమంది వ్యక్తులు తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో సంబంధిత పత్రాలు లేకున్నా.. కొంతమంది వాటిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పాపన్నపేటలో జరుగుతున్నాయన్న సమాచారం మేరకు కార్డెన్ సెర్చ్ చేపట్టినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన ఆధార పత్రాలున్నట్లయితే పాపన్నపేట పోలీస్ స్టేషన్లో వాటిని సమర్పించి తీసుకెళ్లాలని సూచించారు. పత్రాలు లేకుంటే కోర్టుకు తరలిస్తామన్నారు. -
మరో ఇద్దరి బాలికలకు విముక్తి
యాదగిరిగుట్ట(ఆలేరు) : యాదగిరిగుట్టలో మరో ఇద్దరి బాలికలను విముక్తి కలిగింది. పట్టణంలోని వ్యభిచార కూపంలో నలిగిపోతున్న ఇద్దరిని బాలి కలను రక్షించి, నిర్వాహకురాలు కంసాని జ్యోతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు పట్టణ సీఐ అశోకకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న యాదగిరిగుట్టలోని గణేశ్‌నగర్‌లో డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిం చారు. ఓ ఇంటో నివాసం ఉంటున్న కంసాని జ్యో తి అనుమానాస్పదంగా కనిపించింది. ఆ సమయంలో పోలీసులు ఇంట్లో సోదాలు చేయగా ఎవరు కనిపించలేదు. జ్యోతి పట్టుబడిన ప్రదేశంలోనే ఆమెను పోలీసులు విచారించారు. దీంతో ఆమె తనకు ఏమీ తెలియదని, పిల్లలతో సంబంధం లేదని చెప్పింది. అయినా పోలీసులకు నమ్మకం కలగకపోవడంతో జ్యోతి, మరో ఐదుగురితో పాటు ఓ చిన్నారిపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆరుగురిలో జ్యోతికి, బాలికల అక్రమ రవాణాకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఆమె నుంచి ఇద్దరి బాలికలకు విముక్తి కల్పించారు. ఒక్కో బాలికకు రూ.40వేలు బాలికల అక్రమ రవాణాలో ప్రధాన కారకుడైన కంసాని శంకర్ ఆయన మరణించక ముందు వివిధ ప్రాంతాల్లో ఉన్న బాలికలను గుర్తించి, కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లకు, వ్యభిచార నిర్వాహకులకు మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఒక్కొక్క బాలికను రూ.40వేలకు విక్రయించేవాడని పోలీసుల విచారణలో కంసాని జ్యోతి వెల్లడించినట్లు సమాచారం. అనాథ బాలికలు, పేద కుటుంబాలకు చెందిన బాలికలనే టార్గెట్ చేసి కిడ్నాప్ చేసే వాడని తెలిపింది. యాదగిరిగుట్ట పట్టణానికి బాలికలను తీసుకురాగా.. అందులో ఇద్దరు బాలికలను ఒక్కొక్కరికి రూ.40వేల చొప్పున ఇద్దరిని రూ. 80వేలకు కొనుగోలు చేసినట్టు ఆమె పోలీసులకు తెలిపింది. ఇప్పటికే ఐదుగురిపై పీడీ యాక్టు కేసులు నమోదు కాగా త్వరలోనే మరికొంత మందిపై కూడా పీడీ యాక్ట్ అమలువుతుందని విశ్వసనీయ సమాచారం. మొత్తం 26 మంది బాలికలకు రక్షణ వ్యభిచార గృహం నుంచి విముక్తి పొందిన ఇద్దరు బాలికలను పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ ప్రజ్వల హోమ్‌కి తరలించారు. ఇప్పటి వరకు మొత్తంగా పోలీసులు 26 మంది బాలికల ను రక్షించారు. 25 మంది నిర్వాహకులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతేకాకుండా ఈనెల 18న గణేష్‌నగర్‌లోని ఏడుగురి వ్యభిచార నిర్వాహకుల ఇళ్లను కూడా సీజ్ చేశారు. -
కొనసాగుతున్న కార్డెన్ సెర్చ్ ఆపరేషన్
కర్నూలు : జిల్లాలో ఇటీవల వరుస పేలుళ్ల సంఘటన నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. సబ్ డివిజన్ల వారీగా సమస్యాత్మక ప్రాంతాలే లక్ష్యంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ గోపీనాథ్ జట్టి ఆదేశాల మేరకు వారం రోజులుగా ఎంపిక చేసిన సబ్ డివిజన్లలోని సమస్యాత్మక ప్రాంతాల్లోని ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున 4 నుంచి 7 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పలు సమస్యాత్మక, అనుమానిత ప్రాంతాల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కర్నూలు డీఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అరుంధతి నగర్, మదర్ల్యాండ్, రాంప్రియ నగర్, సరస్వతి నగర్, ఎల్బీజీ నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పలువురు అనుమానితులను విచారించారు. వారి వద్ద ఉన్న వేటకొడవళ్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని ఒక ఐచర్ వాహనం, ఒక ఆటో, ఐదు మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. అలాగే నంద్యాలలోని నందమూరి నగర్, ఏఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 4 ఆటోలు, 8 మోటార్ సైకిళ్లను స్వా«ధీనం చేసుకున్నారు. ఆదోని డీఎస్పీ ఆంకినీడు ప్రసాద్ నేతృత్వంలో ఆదోని పట్టణం లేబర్ కాలనీ, శంకర్ నగర్లలో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఓ ఆటో, 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆత్మకూరు, సిద్ధాపురం ప్రాంతాల్లో పది మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజల్లో భయాన్ని పోగొట్టి నేరాలను నియంత్రించేందుకు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. -
బొంబయి కాలనీలో కార్డన్ సెర్చ్
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణంలోని బొంబయికాలనీలో శనివారం రాత్రి సైబరాబాద్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటినీ పోలీసులు జల్లెడ పట్టారు. గతంలో నేర చరిత్ర ఉన్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరాలకు పాల్పడుతున్న వారితో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో మరో 38 మందిని అదుపులోకి తీసుకున్నారు. 40 ద్విచక్ర వాహనాలు, 19 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడంలో భాగంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా రామచంద్రాపురం పారిశ్రామిక వాడ కావడంతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడ నివసిస్తున్నారని దాంతోపాటు ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. అందులో భాగంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకొని తనిఖీలు చేశామన్నారు. తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలతో సంబంధం వారితో మాట్లాడిన వారి సమాచారం తెలుస్తుందన్నారు. వేలిముద్రలు కూడా తీసుకుంటున్నామని ఎక్కడైనా నేరానికి పాల్పడిన వారు ఉంటే వేలిముద్రలు తీసుకున్న వెంటనే ఫోన్లో వారి పూర్తి సమాచారంతో పాటు వారిపై ఉన్న కేసుల వివరాలు కూడా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. నేరాలను తగ్గించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రంగారెడ్డి, ఏసీపీ రవి, 12మంది ఇన్సె్పక్టర్లు, 26 మంది ఎస్ఐలు పాల్గొన్నారు. -
పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. 295 వాహనాలు సీజ్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యపేట, పెద్దపల్లి జిల్లాలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధిక సంఖ్యలో సరైన ద్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. రఘునాథ్‌పాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని శివాయిగూడెం కాలనీలో పోలీసులు బుధవారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ నిర్వయించారు. ఖమ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, రూరల్ ఏసీపీ నరేష్ రెడ్డి ఆధ్యర్యంలో ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తనీఖీలు నిర్వహించారు. మొత్తం 16 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక కారు స్వాధీన పర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ తనీఖీల్లో పోలీసు కమీషనర్, రూరల్ ఏసీపీతో పాటు 110 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి 11 గంటలకు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. మొత్తంగా 150 ఇళ్లను, 500 మంది వ్యక్తులను, 150 ద్విచక్ర వాహనాలను, 2 కార్లను తనీఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను స్వాధీన పర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. 5 గురు అనుమానితులను కూడా విచారించినట్టు సమాచారం. ఈ తనీఖీలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ డి.ఉదయ్ కుమార్, జిల్లా డీఎస్పీ ఎస్.ఎం అలీ తో పాటు ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్సైలు, 10 మంది ఏఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 200 మంది పోలీసు అధికారులు ఈ తనీఖీల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి, సూర్యపేట జిల్లాల్లో కూడా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పెద్దపల్లి సుభాష్ నగర్, సాగర్ రోడ్డులో 95 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 ట్రాలీని అలాగే సూర్యపేట జిల్లాలో బంజర కాలనీ, అంబేద్కర్ కాలనీలో 121 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 వ్యాన్ స్వాధీన పర్చుకున్నట్టు పోలీసు తెలిపారు. సూర్యపేట తనీఖీల్లో జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్, కోదాడ డీఎస్పీ రమణరెడ్డి, మగ్గురు సీఐలు, 16 మంది ఎస్సైలతో పాటు 160 పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డీఎస్పీ కె.నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లాలోని చిలుకూరి లక్ష్మి నగర్, మహా లక్ష్మి వాడలో 200 మంది పోలీసు సిబ్బందితో ఇంటింటి సోదాలు నిర్వహించి 39 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 1 ఆటో ట్రాలీలను సాధ్వీనం చేసుకున్నట్టు పోలీసు తెలిపారు. -
మణుగూరులో కార్డన్ సెర్చ్
మణుగూరు (ఖమ్మం) : ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని పలు వాహనాలను గుర్తించిన పోలీసులు వాటిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వందల లీటర్లలో నాటుసారాను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. -
హకీంపేట్‌లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : నగరంలోని హకీంపేట ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 500 మంది పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మంది రౌడీషీటర్లతో పాటు 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే తనిఖీల్లో పత్రాలు లేని 48 ద్విచక్రవాహనాలతో పాటు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఆరుగురు చైన్ స్నాచర్లు ఉన్నట్లు సమాచారం. -
నగరంలో కార్డన్ సెర్చ్
సనత్ నగర్ (హైదరాబాద్) : సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ జరిగింది. డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 220 మంది పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు చూపించని 42 బైక్ లు, 10 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 62మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు చైన్ స్నాచర్లు, నలుగురు పాత నేరస్తులను, 30మంది బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. అలాగే ఫతే నగర్, వడ్డెర బస్తీ, శివశంకర్ నగర్లలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. -
నగరంలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సౌత్ జోన్ పరిధిలో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హుక్కా సెంటర్లు, హార్స్ రైడింగ్ సెంటర్లు, రిసార్ట్స్‌పై దాడులు చేశారు. ఈ దాడుల్లో 250మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. 11 గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులున్నారు. హుక్కా సెంటర్లలో పట్టుబడిన యువకులకు ఆదివారం కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. అలాగే సైబరాబాద్ అదనపు డీజీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రాయదుర్గం అంజయ్య నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 20మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు చూపించని 40 బైక్‌లు, 7 ఆటోలు, 5 పెద్ద సిలిండర్లు, 9 చిన్న సిలిండర్లు, విద్యుత్ వైర్లు, టపాసులు స్వాధీనం చేసుకున్నారు. -
అల్వాల్ లో కార్డాన్ సెర్చ్
అల్వాల్ (హైదరాబాద్) : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్మత్ పేట, అంజయ్య నగర్లలో పోలీసులు ఆదివారం ఉదయం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్గిరి డీసీపీ రమా రాజేశ్వరి ఆధ్వర్యంలో 350 మంది పోలీసుల బృందం విస్తృత తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో 23మంది అనుమానితులను అదుపులోకి తీసుకోగా, సరైన పత్రాలు చూపించని 51 బైక్‌లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగతనాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో కొందరి నుంచి 20 గ్యాస్ సిలిండర్లు, ఓ సీపీయూ, రెండు మానిటర్లు స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో కార్డన్ ఆండ్ సెర్చ్
-
ఉప్పల్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్
-
పాత బస్తీలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్