మరో ఇద్దరి బాలికలకు విముక్తి | Operation Muskaan In Yadadri | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరి బాలికలకు విముక్తి

Published Tue, Aug 21 2018 12:15 PM | Last Updated on Tue, Aug 21 2018 12:15 PM

Operation Muskaan In Yadadri  - Sakshi

ఈనెల 18వ తేదీన కార్డన్‌సెర్చ్‌లో భాగంగా  జ్యోతిని విచారిస్తున్న పోలీసులు (ఫైల్‌) 

యాదగిరిగుట్ట(ఆలేరు) : యాదగిరిగుట్టలో మరో ఇద్దరి బాలికలను విముక్తి కలిగింది. పట్టణంలోని వ్యభిచార కూపంలో నలిగిపోతున్న ఇద్దరిని బాలి కలను రక్షించి, నిర్వాహకురాలు కంసాని జ్యోతిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు పట్టణ సీఐ అశోకకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న యాదగిరిగుట్టలోని గణేశ్‌నగర్‌లో డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిం చారు. ఓ ఇంటో నివాసం ఉంటున్న కంసాని జ్యో తి అనుమానాస్పదంగా కనిపించింది. ఆ సమయంలో పోలీసులు ఇంట్లో సోదాలు చేయగా ఎవరు కనిపించలేదు.

జ్యోతి పట్టుబడిన ప్రదేశంలోనే ఆమెను పోలీసులు విచారించారు. దీంతో ఆమె తనకు ఏమీ తెలియదని, పిల్లలతో సంబంధం లేదని చెప్పింది. అయినా పోలీసులకు నమ్మకం కలగకపోవడంతో జ్యోతి, మరో ఐదుగురితో పాటు ఓ చిన్నారిపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆరుగురిలో జ్యోతికి, బాలికల అక్రమ రవాణాకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఆమె నుంచి ఇద్దరి బాలికలకు విముక్తి కల్పించారు.

ఒక్కో బాలికకు రూ.40వేలు

బాలికల అక్రమ రవాణాలో ప్రధాన కారకుడైన కంసాని శంకర్‌ ఆయన మరణించక ముందు వివిధ ప్రాంతాల్లో ఉన్న బాలికలను గుర్తించి, కిడ్నాప్‌ చేసిన కిడ్నాపర్లకు, వ్యభిచార నిర్వాహకులకు మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఒక్కొక్క బాలికను రూ.40వేలకు విక్రయించేవాడని పోలీసుల విచారణలో కంసాని జ్యోతి వెల్లడించినట్లు సమాచారం. అనాథ బాలికలు, పేద కుటుంబాలకు చెందిన బాలికలనే టార్గెట్‌ చేసి కిడ్నాప్‌ చేసే వాడని తెలిపింది.

యాదగిరిగుట్ట పట్టణానికి బాలికలను తీసుకురాగా.. అందులో ఇద్దరు బాలికలను ఒక్కొక్కరికి రూ.40వేల చొప్పున ఇద్దరిని రూ. 80వేలకు కొనుగోలు చేసినట్టు ఆమె పోలీసులకు తెలిపింది. ఇప్పటికే ఐదుగురిపై పీడీ యాక్టు కేసులు నమోదు కాగా త్వరలోనే మరికొంత మందిపై కూడా పీడీ యాక్ట్‌ అమలువుతుందని విశ్వసనీయ సమాచారం.

మొత్తం 26 మంది బాలికలకు రక్షణ 

వ్యభిచార గృహం నుంచి విముక్తి పొందిన ఇద్దరు బాలికలను పోలీసులు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్‌ ప్రజ్వల హోమ్‌కి తరలించారు. ఇప్పటి వరకు మొత్తంగా పోలీసులు 26 మంది బాలికల ను రక్షించారు. 25 మంది నిర్వాహకులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. అంతేకాకుండా ఈనెల 18న గణేష్‌నగర్‌లోని ఏడుగురి వ్యభిచార నిర్వాహకుల ఇళ్లను కూడా సీజ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement