
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి మాయని మచ్చగా మిగిలిన వ్యభిచార గృహాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. వార్త పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు.. నేడు (సోమవారం) విచారణ చేపట్టింది. మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపి వ్యాపారం చేస్తున్న ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కోర్టుకు తెలుపాలని పోలీస్ శాఖకు సూచించింది.
యాదాద్రి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి మంగళవారం (రేపు) స్వయంగా కోర్ట్‌కు హాజరై ఈ కేసుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పొక్సో చట్టంతో బాధితులను రక్షించడానికి స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలని పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక్కడ 52 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దందాలోకి చిన్నపిల్లలను దింపుతున్న వ్యవహారం ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. బాలికల శారీరక ఎదుగుదలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఉపయోగించడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ ముస్కాన్‌ను ముమ్మరం చేసి ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment