సనత్ నగర్ (హైదరాబాద్) : సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ జరిగింది. డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 220 మంది పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు చూపించని 42 బైక్ లు, 10 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 62మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు చైన్ స్నాచర్లు, నలుగురు పాత నేరస్తులను, 30మంది బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. అలాగే ఫతే నగర్, వడ్డెర బస్తీ, శివశంకర్ నగర్లలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.