అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా నబమ్ తుకీ శనివారం రాజీనామా చేశారు. కొత్త సీఎల్పీ నేతగా పెమ ఖండూ ఎన్నికయ్యారు. ఈవాళ ఉదయం జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి 40మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా సొంత గూటికి చేరుకున్నారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమం అయింది.