పార్టీ నుంచి అరుణాచల్‌ సీఎం తొలగింపు | Arunachal CM Pema Khandu, 6 others temporarily suspended from PPA | Sakshi
Sakshi News home page

పార్టీ నుంచి అరుణాచల్‌ సీఎం తొలగింపు

Published Fri, Dec 30 2016 2:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

Arunachal CM Pema Khandu, 6 others temporarily suspended from PPA

ఈటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పీపుల్స్‌ పార్టీ (పీపీఏ) అధినాయకత్వం ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మీన్, మరో ఐదుగురు శాసనసభ్యుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణం కింద వారు గురువారం రాత్రి సస్పెన్షన్ కు గురయ్యారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తనకు ఉన్న విచక్షణాధికారంతో ఈ సస్పెన్షన్ విధిస్తున్నట్లు పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు కాఫా బెంగియా చెప్పారు. ఈ సస్పెన్షన్ తో పీపీఏ లెజిస్లేచర్‌ పార్టీకి నాయకుడిగా ఉండే అర్హతను సీఎం కోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement