సాక్షి, ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను నేడు ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. వారి పేర్లను నేడు(శుక్రవారం) ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఈరోజు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది.
ఇదిలా ఉండగా.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే జాబితాకు సంబంధించి గురువారం ఢిల్లీలో వరుసగా భేటీలు, చర్చలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ప్రకాశ్ జవదేకర్ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పార్టీ బలంగా ఉన్న సీట్లు, అభ్యర్థుల బలాబలాలపై పార్టీ పెద్దలతో రాష్ట్ర నేతలు చర్చించారు.
ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఎక్కడ భారీ ర్యాలీలు చేపట్టాలన్న దానిపై ఇప్పటికే ఖరారైన ప్రణాళికను అమిత్ షా, నడ్డాలకు రాష్ట్ర నేతలు వివరించారు. వీటితోపాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
ఇది కూడా చదవండి: మేనిఫెస్టో లేని మజ్లిస్
Comments
Please login to add a commentAdd a comment