హైదరాబాద్: ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులకు సంబందించిన మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. మొత్తం 36,095 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక 1:15 రేషియోలో జరిగినట్లు చెప్పింది. పూర్తి వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ www.tspsc.gov.in లో చూడవచ్చు.
పోస్టుల వివరాలు..
పీజీటీ-513 పొస్టులు, టీజీటీ- 2340, పీడీ- 6 పోస్టులకు మెయిన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. వివిధ కేటగిరీల్లో మొత్తం 7330 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, బీసీ( మహిళ) ఎజన్సీ(మహిళ)ల కేటగిరిల నుంచి దరఖాస్తులు రాలేదని అధికారులు పేర్కొన్నారు.
టీచర్ పోస్టుల మెయిన్స్ జాబితా విడుదల
Published Wed, Jun 21 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
Advertisement
Advertisement