రానున్న లోక్‌సభ ఎన్నికలకు సీపీఎం తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో ఒకటీ రెండు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం.. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లకు తమ అభ్యర్థులను వెల్లడించింది.
ఈ జాబితాలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 17 స్థానాలు ఉన్నాయి. కేరళకు చెందిన 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో అలప్పుజా నుంచి సిట్టింగ్ ఎంపీ ఆరిఫ్, వడకర నుంచి మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ టీచర్, కాజీకోడ్ నుంచి రాజ్యసభ ఎంపీ ఎలమరం కరీం ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని 17 పేర్లలో ముర్షిదాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం పేరు కూడా ఉంది. ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మధురై నుంచి సిట్టింగ్ ఎంపీలు ఎస్ వెంకటేశన్, దిండిగల్ ఆర్ సచ్చిదానందంలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని భువనగిరి స్థానానికి ఎండీ జహంగీర్ పేరును, ఆంధ్ర ప్రదేశ్‌లోని అరకు స్థానానికి పాచిపెంట అప్పలనరస పేరును మొదటి జాబితాలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment