
లోక్‌సభ ఎన్నికలకు ఏ పార్టీతోనూ పొత్తుగా వెళ్లకూడదని నిర్ణయించుకున్న సీపీఎం..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు దూరంగా ఉన్న సీపీఎం.. లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాని నిర్ణయించుకుంది. బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. భువనగిరి అభ్యర్థిగా జహంగీర్‌ను ప్రకటించిన సీపీఎం మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపింది.