
బీజేపీ అభ్యర్థుల ఎంపికపై రాజాసింగ్ ఫైర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చిన లిస్టులో ఒక్కరికీ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనర్హులకు టిక్కెట్లు ఇచ్చి పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. కొద్ది నెలల కిందట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసినప్పటి నుంచి రాజాసింగ్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. నిజాం కాలేజీలో జరిగిన ఎన్నికల ప్రచార సభకు కూడా రాజాసింగ్ హాజరు కాలేదు. తాజా వ్యాఖ్యలతో బీజేపీలో విబేధాలు మరోసారి బయటపడ్డాయి.