అధికార పార్టీకి దరిదాపుల్లో లేవు... | opposation become almost null in ghmc elections | Sakshi
Sakshi News home page

అధికార పార్టీకి దరిదాపుల్లో లేవు...

Published Fri, Feb 5 2016 6:05 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

అధికార పార్టీకి దరిదాపుల్లో లేవు... - Sakshi

అధికార పార్టీకి దరిదాపుల్లో లేవు...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా ఏకపక్షంగా కొనసాగుతోంది. అధికార పార్టీకి ప్రతిపక్షాలు ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోయాయి. మేయర్ పదవిని సొంతంగా ఏర్పాటు చేసుకుని ఆధిక్యాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. అలాగే  ఎంఐఎం మాత్రం రెండో స్థానంలో నిలిచింది.

 

ఇక బీజేపీ-టీడీపీ కూటమిగా ఏర్పడి 'కారు' జోరును తగ్గించేందుకు చేసిన యత్నాలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ కూటమి కేవలం మూడో స్థానానికే పరిమితం అయింది. ఆర్ కె పురం (బీజేపీ), ఘన్సీ బజార్ (బీజేపీ), బేగంబజార్ (బీజేపీ), కేబీహెచ్బీ (టీడీపీ)లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది. కేవలం పటాన్చెరు, నాచారంలో మాత్రమే గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement