స్వరాష్ట్రంలో ప్రశ్నించే స్వేచ్ఛలేదా?
ఎన్నో ఏళ్లు పోరాటం చేసి సాధించిన స్వరాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా.. ఇంత నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తే ఎలా.. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. మా సహనాన్ని, ఓపికను అలుసుగా తీసుకుంటున్నారు.
జాతీయ పార్టీ, అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న తమను కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. సీఎం తీరు అభ్యంతరంగా ఉంది. కొత్త సభ్యులకు ఏం నేర్పదలచుకున్నారు. సభా సంప్రదాయమంటే ఇదేనా? టీఆర్‌ఎస్, ఎంఐఎం కుమ్మక్కై విపక్ష సభ్యుల గొంతు వినిపించకుండా చేస్తున్నారు.
- కె. లక్ష్మణ్, బీజేపీ