
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
తీవ్ర ఉత్కంఠ నడుమ తెలుగుదేశం పార్టీ బుధవారం రాత్రి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఇరు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా అభ్యర్థిత్వాలను ఖరారుచేశారు.
తీవ్ర ఉత్కంఠ నడుమ తెలుగుదేశం పార్టీ బుధవారం రాత్రి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఇరు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా , గవర్నర్ కోటా అభ్యర్థిత్వాలను ఖరారుచేశారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జూపూడి ప్రభాకర్, షరీఫ్ కు అవకాశం దక్కింది. గవర్నర్ కోటా కింద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి అనురాధ, టీడ జనార్ధన్, శ్రీనివాసులుకు ఎమ్మెల్సీ టికెట్లు లభించాయి. నామినేషన్ల దాఖలుకు గురువారమే చివరిరోజు కావడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ అభ్యర్థుల పేర్లను వెల్లడించక తప్పలేదు.
పాలడుగు వెంకట్రావు మృతితో ఖాళీ అయిన స్థానంలో మిగిలిన రెండేళ్లకుగానూ జూపుడి ప్రభాకర్ పోటీ చేయనున్నారు. జూపుడి, షరీఫ్ లు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తెలంగాణలో ఒక స్థానానికిగానూ వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.