
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు లోక్‌సభ, 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ మంగళవారం(ఏప్రిల్ 2) విడుదల చేసింది. కడప పార్లమెంట్ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, రాజమండ్రి-గిడుగు రుద్రరాజు, బాపట్ల- జేడీశీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ లోక్‌సభ బరిలో ఉండనున్నారు.
ఇక అసెంబ్లీ టికెట్లు పొందినవారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలిజాలకు నందికొట్కూరు, చింతలపూడి నుంచి టికెట్లు దక్కాయి. కుప్పం అసెంబ్లీ నుంచి ఆవుల గోవిందరాజులు బరిలో దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment