
సాక్షి, హైదరాబాద్: అటు జాతీయ స్థాయిలోనూ ఇటు రాష్ట్ర స్థాయిలోనూ వృద్ధ పార్టీ కాంగ్రెస్ నాయకత్వ లేమితో ఇబ్బందులు పడుతోంది. కేంద్రంలో బీజేపీని ఎదొర్కోవడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లోనూ అదే పంథా కొనసాగించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని నమోదు చేయగా.. కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనన్న భావన కొద్దికొద్దిగా తొలగిపోతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించే విషయంలోనూ కాంగ్రెస్ పనితీరుపై సొంత పార్టీలోనే అసహనం వ్యక్తమవుతోంది. ముందు నుంచీ ప్రణాళిక లేకుండా.. నామినేషన్ల గడువులోగా అభ్యర్థులను ప్రకటించకపోవడమే దీనికి కారణం! ఇక 150 స్థానాలున్న గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీపడుతున్న అభ్యర్థుల వివరాలు మీకోసం..
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment