
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్బంగా అభ్యర్థులకు ఖరారు చేయనున్నట్టు సమాచారం.
కాగా, తొలి విడత అభ్యర్థుల జాబితాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేడు సాయంత్రం ఆరు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీఈసీ భేటీ కానుంది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక, మొదటి జాబితాలో భాగంగా తెలంగాణలో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment