సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళిక చేస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం బీజేపీ హైకమాండ్ కోర్ గ్రూప్ సభ్యులు భేటీ కానున్నారు.
వివరాల ప్రకారం.. నేడు బీజేపీ హైకమాండ్ గ్రూప్ భేటీ కానుంది. కోర్ గ్రూప్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంతోష్ జీ తదితరులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా రెండో విడతలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగనుంది.
ఎల్లుండి జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి కోర్ గ్రూప్ అభ్యర్థులను జాబితా సిద్ధం చేయనుంది. ఇక, తొలి జాబితాలో భాగంగా బీజేపీ 194 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. ఈ కోర్ గ్రూప్ భేటీలో సభ్యులు.. ఏపీ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించే అవకాశం ఉంది. ఇక, ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున సభ్యులను ఎంపిక చేసి అధిష్టానానికి లిస్ట్‌ను పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, తదితరులు హైకమాండ్‌తో సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment