ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో ఆప్ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆప్ మంగళవారం.. ఢిల్లీ, హర్యానాలో తమ పారటఈ నుంచి పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది.
సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ మూడు సీట్లలో పోటీ చేయగా.. ఆప్ నలుగురు అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేసింది. ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతీకి న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం, సహిరామ్ పెహల్వాన్ (దక్షిణ ఢిల్లీ), మహాబల్ మిశ్రా (పశ్చిమ ఢిల్లీ) మరియు కుల్దీప్ కుమార్ (తూర్పు ఢిల్లీ) సెగ్మెంట్లను ఆప్ ప్రకటించింది.పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3 స్థానాల్లో పోటికి దిగనుంది.
ఇక.. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర నియోజకవర్గంలో ఆప్ లోక్ సభ అభ్యర్థి సుశీల్ గుప్తాను బరిలోకి దింపుతున్నట్లు పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తామని.. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలోకి దింపుతున్నట్లు ఆప్ సీనియర్ నేత సందీప్ పాఠక్ వెల్లడించారు. ప్రకటించిన అభ్యర్థుల ఎంపిక తీవ్రంగా కసరత్తు చేశామని, పలుసార్లు చర్చించి పార్టీ లెక్కల ప్రకారమే బరిలో నిలుపుతున్నామని ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ పేర్కొన్నారు. తాము పోటీ చేసే ప్రతి సీట్లలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఆప్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. జనరల్ స్థానం అయిన తూర్పు ఢిల్లీ లోక్ సభ స్థానంలో ఎస్సీ అభ్యర్థిని పోటీ నిలుపుతున్నామని చెప్పారు. కుల్దీప్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. లోక్‌సభ ఎన్నికల్లో జనరల్ స్థానంలో ఎస్సీ అభ్యర్థిని పోటీనికి నిలపటం ఢిల్లీ ఇదే తొలిసారి అని తెలిపారు. కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆప్ మొదటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడేవారికే టికెట్లు ఇస్తూ వస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment