ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ భివవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే.
స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ మే 18న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే.. తనను స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అక్రమగా అరెస్ట్ చేశారని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో బిభవ్ పేర్కొన్నారు. అదే విధంగా ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బిభవ్ తరఫున న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈ దాడి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిభవ్ కుమార్ సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. స్వాతి మలివాల్‌పై సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేశారన్న ఆరోపణలు ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశం అయింది. బీజేపీ కుట్రంలో భాగంగా స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణులు చేశారని ఆప్ నేతలు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment