సాక్షి, ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బీజేపీ ఇవాళ రెండు రాష్ట్రాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 90 స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ కోసం 21 మంది అభ్యర్థులతో, అలాగే.. 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌కు 39 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ విడుదల చేసింది.
కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని ప్రకటించకముందే.. బీజేపీ ఈ జాబితా విడుదల చేయడం గమనార్హం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయిన మరుసటి రోజే.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ జాబితా వెలువడినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
भाजपा केन्द्रीय चुनाव समिति ने छत्तीसगढ़ एवं मध्य प्रदेश में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। (2/2) pic.twitter.com/VsjOfj3DVe
— BJP (@BJP4India) August 17, 2023
► అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వెనుక.. బీజేపీ శ్రేణుల్లోని వర్గపోరును, విభేదాల్ని గుర్తించడం, తద్వారా సమస్యలను ముందుగానే పరిష్కరించడం లక్ష్యంగా అధిష్టానం పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
జాబితాను పరిశీలిస్తే..
ఛత్తీస్‌గఢ్ నుంచి ఎంపీ(దుర్గ్ స్థానం) విజయ్ భాఘేల్‌ను మళ్లీ అసెంబ్లీ బరిలో నిలిపింది బీజేపీ. ఇంతకు ముందు పటాన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. ఈ దఫా ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
► ఇక మాజీ సీఎం రమణ్‌సింగ్, ఇతర పార్టీ సీనియర్లు తొలి లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం.
► మధ్యప్రదేశ్ విషయానికొస్తే.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు తొలి జాబితాలో లేదు. అలాగే కొందరు మంత్రుల పేర్లు కూడా లేకపోవడం గమనార్హం.
► బీజేపీ ఛత్తీస్‌గఢ్ లిస్ట్‌లో ఐదుగురు మహిళలు, పది మంది ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్లు, ఒక ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
► మధ్యప్రదేశ్ జాబితాలో.. ఐదుగురు మహిళలు, ఎనిమిది మంది ఎస్సీ, 13 మంది ఎస్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment