
ఎన్‌ఆర్‌ఐలు కూడా సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ విభాగాలను సమాచారం కోరవచ్చని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రభుత్వ విభాగాలను సమాచారం కోరవచ్చని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. ఆర్టీఐ దరఖాస్తులు చేసేందుకు ఎన్‌ఆర్‌ఐలు అర్హులు కాదని ఈ ఏడాది ఆగస్టు 8న సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు తెలియజేశారు.
ఆర్టీఐ చట్టం ప్రకారం భారతీయులందరికీ ఆ అవకాశం ఉంటుందనీ, ఎన్‌ఆర్‌ఐలు కూడా భారతీయులేనంటూ లోకేశ్ బాత్రా అనే సామాజిక కార్యకర్త మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీంతో జితేంద్ర సింగ్ ఇచ్చిన సమాచారాన్ని మార్చి, ఆ సమాధానాన్ని ప్రభుత్వం మళ్లీ లోక్‌సభ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.