
సర్కారీ కొలువులు..రెండు లక్షలకు పైనే!
ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలపై బడ్జెట్లో అంచనా
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త. ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో రెండు లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు 2.18 లక్షల మేర పెరుగుతాయని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో 2015లో 33.05 లక్షలుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య వచ్చే ఏడాది నాటికి 35.23 లక్షలకు పెరగనుంది. ప్రభుత్వ భవిష్యత్ విజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కొలువుల అంచనాలను బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.