జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికారులు అందరినీ సంతృప్తి పరచడానికి సమయం పడుతుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐఏఎస్ అధికారుల విభజన పారదర్శికంగా జరుగుతుందని చెప్పారు. 15 రోజుల్లో అధికారుల విభజన జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రానికి ఏ అధికారిని కేటాయించాలన్నదానిపై చర్చ జరుగుతుందని మంత్రి చెప్పారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సివిల్ సర్వీసెస్ అధికారుల కేటాయింపుపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం ముగిసింది. వివాదంలేని అధికారుల కేటాయింపునకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 20 మంది అధికారులు కమిటీ ముందు హాజరయ్యారు. కమిటీ అధికారుల అభ్యంతరాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
**