
సాక్షి, న్యూఢిల్లీ: ‘చంద్రయాన్-3’ ప్రయోగం ఈ సంవత్సరం (2020)లోనే ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ప్రయోగానికయ్యే ఖర్చు చంద్రయాన్-2 ప్రయోగానికి అయిన ఖర్చు కన్నా తక్కువే అవుతుందన్నారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని వైఫల్యంగా భావించరాదని ప్రధాని కార్యాలయంలో సహాయమంత్రి బాధ్యతల్లో ఉన్న సింగ్ వ్యాఖ్యానించారు. మొదటి ప్రయత్నంలోనే చంద్రుడి ఉపరితలానికి చేరామని, తొలి ప్రయత్నంలో ఈ స్థాయి విజయాన్ని ఏ దేశమూ సాధించలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment