
సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంల విషయంలో ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటుగా మారిపోయిందని బీజేపీ సీనియర్ నేత కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పోరుబందర్, సూరత్, జెట్‌పూర్, నావ్‌సారిలో ఈవీఎంలు బ్లూటూత్‌కు అనుసంధానించారంటూ చేసిన ఆరోపణలకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
నిజమేనా అన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంటుందని, అలాంటివి గత ఎన్నికల సమయంలో కూడా చూశామని ఆయన గుర్తు చేశారు. 'కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణ మాత్రం అదే.. కాకపోతే చేస్తున్న ప్రాంతాలు వేరు. అప్పడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భం, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఇలా కొన్ని చోట్ల జరిగిన ఎన్నికల సమయంలో కూడా ఆ పార్టీ ఇలాగే చేస్తుంటుంది. మేం ఆ పరీక్షలను ఎదుర్కొంటున్నాం ఫలితాలను చూస్తున్నాం' అని ఆయన చెప్పారు.