సాక్షి, న్యూఢిల్లీ: వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో దాదాపు ఏడు లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. గత ఏడాది మార్చి 1 నాటికి మొత్తం ఆరు లక్షల 83వేల 823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభకు అందించిన సమాచారంలో వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబిసి) బ్యాక్ లాగ్ రిజర్వు పోస్టుల్లో కూడా ఖాళీలు ఉన్నాయని మరో సమాధానంలో మంత్రి చెప్పారు. రాజ్యసభకు అందించిన లిఖిత పూర్వక సమాధానంలోని డేటా ప్రకారం గ్రూప్ సీ లో మొత్తం 5,74,289 , గ్రూప్ బీ లో 89,638 గ్రూప్ ఏ విభాగంలో 19,896 ఉద్యోగాలు భర్తీ కావల్సి వుందని తన లిపారు.
ఆయా కేంద్రప్రభుత్వ విభాగాలు అందించిన సమాచారం ప్రకారం 2019-20 సంవత్సరానికి గాను 1, 05,338 పోస్టుల భర్తీ ప్రక్రియను ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) ద్వారా ప్రారంభించామన్నారు. 2017-18లో గ్రూప్ సీ లెవల్ 1 పోస్టుల 1,27,573 పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్స్ (సీఈఎన్) కింద రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) ద్వారా 1,27,573 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ రెండేళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయన్నారు.
గ్రూప్ సీ, లెవల్ -1లో లక్షా 56వేల138 ఖాళీలను భర్తీ చేసే మరో ఐదు సీఈ నోటిఫికేషన్లను కూడా 2018-19లో జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఎస్‌ఎస్‌సీ ద్వారా భర్తీ చేయాల్సినవి కాకుండా 19,522 ఖాళీలను వివిధ గ్రేడ్‌లలో భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మొత్తంగా ఎస్‌ఎస్‌సి, ఆర్‌ఆర్‌బి, సీఈఎన్‌ల ద్వారా ఖాళీలను భర్తీ చేసే నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని సింగ్ తెలిపారు. అలాగే జనవరి 1, 2019 నాటికి ఎస్సీలకు 1,713 (ఎస్‌సీ)బ్యాక్‌లాగ్ ఖాళీలు, ఎస్టీలకు 2,530 బ్యాక్‌లాగ్ ఖాళీలు, ఓబీసీలకు 1,773 బ్యాక్‌లాగ్ ఖాళీలు భర్తీ కాలేదని మంత్రి తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment