సీబీఐ క్రెడిబిలిటిని పెంచుతాం: జితేంద్ర సింగ్
Published Tue, May 27 2014 2:44 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రలో బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్రిడిబిలిటి మరింత పెరిగే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో సీబీఐ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తున్న సమయంలో జితేంద్ర సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాలకు సీబీఐ అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణల్ని ఆయన ఖండించారు.
జమ్మూ, కాశ్మీర్ లోని ఉద్దమ్ పూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి బిజేపీ టికెట్ పై గెలుపొందిన జితేంద్ర సింగ్ కు ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖతోపాటు, సిబ్బంది వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ (స్వతంత్ర) శాఖను అప్పగించారు.
Advertisement
Advertisement