credibility
-
‘ఈవీఎం’ సేఫేనా..? జోరందుకున్న చర్చ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) సేఫా..? వాటిలో పడిన ఓటు భద్రమేనాా..? ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చొచ్చా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలపైనే మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. ఇటీవల కొందరు పాపులర్ టెక్నాలజీ నిపుణులే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఈలాన్ మస్క్ అయితే ఈవీఎంల వాడకానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టాలని ట్వీట్ చేసి సంచలనానికి తెర తీశారు. మస్క్ ఈ తరహా అభిప్రాయం వెలిబుచ్చిన సమయానికే మహారాష్ట్రలోని ముంబై నార్త్‌వెస్ట్ నియోజకవర్గంలో ఓటీపీ ద్వారా ఈవీఎంను తెరిచారన్న వివాదం వెలుగులోకివచ్చింది. దీంతో ఈవీఎంల భద్రతపై చర్చ జోరందుకుంది.భారత్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేధావి శ్యామ్ పిట్రోడా కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమేమీ కాదన్నారు. వీరే కాక తాజాగా సైబర్ లా నిపుణుడు, ప్రముఖ న్యాయవాది పవన్ దుగ్గల్ కూడా ఇంచు మించు ఇదే చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఛాన్సు లేకపోలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా..? అనే సమాధానం లేని ప్రశ్న మళ్లీ అందరి మెదళ్లను తొలుస్తోంది. అసలు మస్క్ ఏమన్నారు.. సందర్భమేంటి..? ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించొచ్చని టెస్లా అధినేత మస్క్ ఇటీవల సూచించారు. అమెరికా నియంత్రణలో ఉన్న ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది’అని మస్క్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు.మస్క్‌కు మాజీ ఐటీ మంత్రి కౌంటర్లో వాస్తవమెంత..?మస్క్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన వెంటనే ఎక్స్‌లో మాజీ కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్‌లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు’అని సూచించారు.రాజీవ్ చంద్రశేఖర్ లాజిక్ కరక్టేనా.. సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ ఏమన్నారు.. ‘ఒక కంప్యూటర్‌కు బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానం లేనపుడు హ్యాక్ చేయడం కష్టమే కావచ్చు. అయితే ఎలాంటి వ్యవస్థనైనా ఏమార్చి దానిలో జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నా. నిజానికి భారత్‌లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. భారత్‌లో అసలు సైబర్ భద్రతకు సంబంధించి పక్కా చట్టమే ఇప్పటివరకు లేదు.‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ పప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు’అని సైబర్ లా నిపుణులు, ప్రముఖ న్యాయవాది పవన్‌దుగ్గల్ వ్యాఖ్యానించారు.శ్యామ్ పిట్రోడా అనుమానాలేంటి..?ఈవీఎంలపై టెక్నాలజీ నిపుణుడు శ్యామ్ పిట్రోడా కుండ బద్దలు కొట్టారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని తేల్చి చెప్పారు. ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి. కొంత మంది చెబుతున్నట్లు ఈవీఎంలు కేవలం స్టాండలోన్ పరికాలే కాదు. వాటికి వీవీప్యాట్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. ఇంతేగాక వీటిని తయారు చేసే క్రమంలో, రవాణా చేసే సందర్భాల్లో ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది’అన్నారు. బ్యాలెట్ పేపరే పరిష్కారమా..? ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అన్న వాదన వినిపిస్తోంది. -
Akhilesh Yadav: ఎగ్జిట్ పోల్స్‌లో విశ్వసనీయత ఎంత?
లక్నో: ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమంటూ ఫలితాలిచ్చిన పలు ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అనుమానం వ్యక్తంచేశారు. సోమవారం లక్నోలో పత్రికాసమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే అనుమానమొస్తోంది. వీటిని ఎలా విశ్వసించాలి?. ఫలితాల వెల్లడివేళ బీజేపీ అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఎగ్జిట్ పోల్స్ ప్రయతి్నస్తున్నాయి’ అని ఆరోపించారు. -
విదేశీ మారక నిల్వల కంటే వేగంగా... పాక్ విశ్వసనీయత పతనం
బెనౌలిమ్ (గోవా): అంతర్జాతీయ వేదికలపై వక్రబుద్ధి ప్రదర్శించే పాకిస్తాన్ తీరుపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ విశ్వసనీయత దాని విదేశీ మారక ద్రవ్య నిల్వల కంటే కూడా శరవేగంగా క్షీణిస్తోందంటూ దుయ్యబట్టారు. శుక్రవారం గోవాలో ముగిసిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల భేటీ ఇందుకు వేదికగా మారింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భేటీలో లేవనెత్తారు. దానిపై పునరాలోచన చేసేదాకా భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు పాక్ సిద్ధంగా లేదన్నారు. దాంతో భేటీ అనంతరం జై శంకర్ మీడియాతో మాట్లాడుతూ బిలావల్ వ్యాఖ్యలను తూర్పారబట్టారు. ‘‘ఆర్టికల్ 370 ముగిసిన చరిత్ర. ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొని వాస్తవాలు గమనించండి’’ అంటూ చురకలు వేశారు. బిలావల్ ‘ఉగ్రవాదానికి ప్రోత్సాహకుడు, సమర్థకుడు, అధికార ప్రతినిధి’గా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు! తామూ ఉగ్రవాద బాధితులమేనన్న బిలావల్ వ్యాఖ్యలపైనా జై శంకర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, పాక్ చేతులు కలుపుతాయా అని ప్రశ్నించగా, ఉగ్రవాద బాధితులు ఎప్పుడూ ఉగ్రవాదానికి పాల్పడిన వారితో కలిసి ఉగ్రవాదంపై చర్చించడానికి కూర్చోరని బదులిచ్చారు. చేశారు. జీ 20 సన్నాహక సమావేశాలను జమ్మూ కశ్మీర్లో జరపడంపై బిలావల్ లేవనెత్తిన అభ్యంతరాలనూ కొట్టిపారేశారు. ‘‘అసలు జీ 20 భేటీలతో మీకేం సంబంధం? దానికంటే, జమ్మూ కశ్మీర్లో మీరు ఆక్రమించుకున్న భూభాగాలను ఎప్పుడు ఖాళీ చేస్తారన్న దానిపై మాట్లాడితే బాగుంటుంది’’ అంటూ వాతలు పెట్టారు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ‘‘మేమేదో పాక్‌పై దౌత్యపరంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నించడం లేదు. ఆ దేశం అసలు రంగును రాజకీయంగా, దౌత్యపరంగా ఎప్పటికప్పుడు ప్రపంచం ముందుంచుతున్నాం’’ అని వివరించారు. ఉగ్రమూలాల్ని పెకిలించాలి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమూలంగా నాశనం చేయాలని ఎస్సీఓ భేటీలో జై శంకర్ పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాదం ఇప్పటికీ కొనసాగుతోంది. దానినెవరూ సమర్థించరాదు. ప్రభుత్వాల సాయంతో తెరవెనుక సాగే సీమాంతర ఉగ్రవాదం సహా ఏరూపంలో ఉన్నా అరికట్టాలి’’ అని పాక్‌నుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రమూకల ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేయాలన్నారు. ఇది ఎస్సీవో లక్ష్యాల్లో ఒకటని గుర్తు చేశారు. సభ్య దేశాల శాంతి, సుస్థిరతలకు భారత్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్నారు. ద్వైపాక్షిక అంశాలను ప్రస్తావించరాదనే ఎస్సీవో నిబంధనలను ఉల్లంఘించకుండానే పాక్‌కు మంత్రి తలంటారు. బిలావల్ మాట్లాడుతూ దౌత్యపరమైన అంశాల్లో ఉగ్రవాదాన్ని అస్త్రంగా వాడుకోరాదన్నారు. ‘‘ఈ సమస్యను రాజకీయాల నుంచి వేరు చేసి అందరూ కలిసికట్టుగా పోరాడాలి. నేనూ ఉగ్రవాద బాధితుడినే. నా తల్లి బేనజీర్ భుట్టో ఉగ్రవాదానికి బలయ్యారు’’ అన్నారు. నమస్కారంతోనే భుట్టోకు పలకరింపు భారత్ సారథ్యంలో ఎస్సీవో సదస్సుకు హాజరైన పాక్ మంత్రి భుట్టో తదితర సభ్య దేశాల విదేశాంగ మంత్రులకు ఎస్.జై శంకర్ తాజ్ ఎగ్జోటికా రిసార్టులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద నమస్తేతో స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం హోటల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్లో మాత్రం భుట్టో సహా అతిథులందరితోనూ మంత్రి జై శంకర్ కరచాలనం చేశారు. కార్యక్రమంలో రష్యా, చైనా విదేశాంగ మంత్రులు వరుసగా బిలావల్ భుట్టో, సెర్గీ లావ్రోవ్, క్విన్ గాంగ్‌తోపాటు ఖజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మంత్రులు పాల్గొన్నారు. -
విశ్వసనీయతే అధికారానికి సోపానం
విశ్వసనీయత గల నాయకులకు అధికారం దగ్గరగా ఉంటుంది. అనేక మంది నాయకులు అనేక దశాబ్దాలుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిపాలన సాగించారు. విశ్వసనీయత కోల్పోయినప్పుడు ప్రజలు వారిని గద్దెదించారు. ఉదాహరణకు ఏ సామాజిక మాధ్యమాలూ లేనటువంటి కాలంలోనే ఇందిరాగాంధీ తప్పు చేస్తే ప్రజలు ఓడించి, అధికారానికి దూరం చేశారు. అందుకే విశ్వసనీయత రాజకీయాల్లో చాలా అవసరం. విశ్వసనీయతతో జ్యోతిబసు మూడు దశాబ్దాలు పరిపాలించారు. లాలూ 15 సంవత్సరాలు, ఒకప్పుడు బిజూ పట్నాయక్, ఇప్పుడు నవీన్ పట్నాయక్, కరుణానిధి, జయలలిత, వైఎస్, మమతా బెనర్జీ, ఎన్టీఆర్... ఇలా అనేక మందిని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొత్తగా కేజ్రీవాల్ ఢిల్లీ లోనూ విశ్వసనీయతతో గెలుస్తూ వస్తున్నారు. నా విశ్లేషణ ప్రకారం భారతదేశ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుల్లో నరేంద్ర మోదీ మొదటి వరుసలో ఉంటారంటే అతిశయోక్తి లేదు. గుజరాత్లో మూడు సార్లు హ్యాట్రిక్ విజయం సాధించి, మరో మూడుసార్లు గుజ రాత్ను బయట ఉండి గెలిపించిన నాయకుడిగా ఖ్యాతి చెందారు. అదే విధంగా 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రధాని అభ్యర్థిగా ప్రజలు నరేంద్ర మోదీని నమ్మి భాజపాను గెలిపించారు. ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా 2024 పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. బెంగాల్లో కమ్యూనిస్టుల తర్వాత మమతా బెనర్జీ వరుసగా మూడుసార్లు ప్రజల అచంచల విశ్వాసంతో అధికారాన్ని చేపట్టారు. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఐదో సారి అధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత తమ ప్రభావాన్ని ప్రజల్లో నిలబెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు ప్రజల్లో విశ్వసనీయ నేతగా మన్ననలు పొందారు. ఒంటిచేత్తో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. పేదప్రజల మనిషిగా సుస్థిర స్థానాన్నిపొందారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మన్నన, విశ్వాసాలు పొందారు. అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పటికీ, మరో 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ ఎవరో ఒకరితో పొత్తుతోనే గెలుపొందారు. ఒంటరిగా ఎప్పుడు కూడా గెలవలేకపోయారు. 1999 ఎన్నికల్లో భాజపాతో జట్టుకట్టి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో తిరిగి భాజపాతో జట్టుకట్టారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. 2014లో మళ్ళీ భాజపా, జనసేనతో జట్టుకట్టి విజయం సాధించారు. 2019లో తెలుగుదేశానికీ, ఎన్టీఆర్‌కూ బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని పరువు పోగొట్టుకున్నారు. ఒకసారి అటల్ బిహారీ వాజ్‌పేయి చరిష్మాతో పొత్తులో విజయం సాధించారు. మరోసారి నరేంద్ర మోదీ హవాలో గెలుపొందారు. కానీ ఎన్నడూ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేదు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమౌతున్న నేపథ్యంలో చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. జనసేనతో కలవాలనీ, భాజపాతో కూడా కలిసి పనిచెయ్యాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. 2014 పొత్తులను మళ్ళీ పునరావృతం చెయ్యాలనే గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒంటరి పోరుతోనే బరిలోకి దిగాలని నిశ్చయించారు. ఏది ఏమైనా రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. - రఘురామ్ పురిఘళ్ళ బీజేపీ సీనియర్ నాయకులు, న్యూఢిల్లీ -
చట్టబద్ధమైన అధికారాలతో మీడియా కౌన్సిల్
న్యూఢిల్లీ: దేశంలో మీడియా తన విశ్వసనీయత, సమగ్రతను క్రమంగా కోల్పోతోందని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో అవకతవకలు, అక్రమాలను అరికట్టడానికి చట్టబద్ధమైన అధికారాలతో కూడిన మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని బుధవారం ప్రతిపాదించింది. మీడియాలో నకిలీ వార్తల బెడద పెరిగిపోతుండడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఈ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఎన్నికల నేరంగా పరిగణించాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సును త్వరగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయీ సంఘం ‘వార్తల ప్రచురణ/కవరేజీలో నైతిక విలువలు’ పేరిట ఒక నివేదికను పార్లమెంట్లో సమర్పించింది. -
విశ్వసనీయతకే పట్టం
సాక్షి, నెల్లూరు: జిల్లాలో పది నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికతో పాటు, ఆచరణకు సాధ్యమైన హామీలు ఇచ్చి, ప్రతిపక్షంలో తమ పనితీరు చూసే ఓట్లు వేయాలని ప్రజల వద్దకు వెళ్లారు. అధికార టీడీపీ మాత్రం ఐదేళ్లు అవినీతికి పాల్పడి ఆ డబ్బు మూటలతో గెలవాలని ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగింది. అవినీతి తప్ప అభివృద్ధి చేయలేక, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేక డబ్బుల రాజకీయాలను నమ్ముకుని ఓట్లు కొనే పనిలో ఉంది. అయితే గత పాలన నేపథ్యంలో జిల్లా ప్రజలు టీడీపీని ఎంత వరకు ఆదరిస్తారో అనే ఆందోళన టీడీపీ అభ్యర్థుల్లో బలంగా ఉంది. అయినా అధినేత మాట తప్పని సరిగా కావడంతో డబ్బు మూటలతో అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. అభ్యర్థుల ప్రకటన మొదలుకొని ప్రచార పర్వం వరకు పూర్తి స్పష్టతతో ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుని ముందుకెళ్లింది.ఇక టీడీపీ తడబాట్లు, తప్పటడుగులు అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలై నేటికి కొనసాగుతున్నాయి. దీంతో ఓటర్లు కూడా గత నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ కురుక్షేత్రంను నిశితంగా గమనించి బ్యాలెట్‌తో గురువారం తీర్పు ఇవ్వనున్నారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వివాదరహితుడు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి బరిలో నిలిచారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, అందరికీ సుపరిచితుడు బల్లి దుర్గాప్రసాద్ బరిలో దిగారు. అధికార పార్టీలో వెన్నుపోటు రాజకీయాలే జిల్లాలోని పది అసెంబ్లీ నియోజక వర్గాల్లో అధికార పార్టీలో వెన్నుపోటు వ్యవహారాలు, డబ్బు రాజకీయాలు బలంగా సాగుతున్నాయి. నెల్లూరు నగరంలో అయితే పూర్తిగా డబ్బునే నమ్ముకొని మంత్రి నారాయణ అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. నగరంలోని అన్ని డివిజన్లపై డబ్బు మూటలను భారీగా కుమ్మరించారు. అయితే గడిచిన ఐదేళ్లలో నారాయణ నెల్లూరు నగరంలో ఎన్ని రోజులు ఉన్నారు. ఏం చేశారు. అధికార పార్టీ నేతల తీరు ఎలా ఉందనే చర్చ సాగుతున్న క్రమంలో అంతర్గత వెన్నుపోట్లతో పూర్తి నష్టం కలుగుతుందనే వాదన పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఇక నెల్లూరు రూరల్ అభ్యర్థిగా బరిలో ఉన్న అజీజ్ నగర మేయర్‌గా ఐదేళ్లు పాటు పనిచేసినా పూర్తి డమ్మీగానే మిగిలిపోయారు. మేయర్‌గా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోని నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. దీనికి తోడు ఆయన స్టార్ కంపెనీ కేసులు ఇబ్బందులతో నేటికీ సతమతం అవుతున్నారు. ఇక సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభివృద్ధి ముసుగులో వందల రూ.కోట్లు దండుకున్నారు. చేయని పనులు, మంజూరు కానీ పనులకు కూడా ముందుగానే భారీగా వసూళ్లు చేయడం అయనకే చెల్లింది. కావలిలో బరిలో నిలిచిన కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పూర్తిగా పరాన్నజీవిగా మారారు. బీద సోదరుల కనుసన్నల్లో పని చేస్తున్నారు. చివరి నిమిషంలో పార్టీలోకి జంప్ అయి టికెట్ దక్కించుకున్న కాటంరెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కోవూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రోడ్డు మొదలుకొని భూములు వరకు దేనిని వదలకుండా భారీగా స్వాహా చేశారు. ఇక్కడ ప్రతి ప్రభుత్వ పథకం పార్టీ క్యాడర్ కంటే ఆయనకు వరంలా మారి భారీగా దండుకున్నారు. ఉదయగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి బొల్లినేని రామారావు ఉదయగిరి కంటే ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నారు. ఉదయగిరిలో చేసిన పనుల్లో భారీగా అవినీతి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో పనులకు సంబధించిన కేసులు కూడా నమోదు కావడంతో గందరగోళం కొనసాగుతుంది. ఇక ఆత్మకూరు అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే బడా పారిశ్రామికవేత్త బొల్లినేని కృష్ణయ్యకు అధికార పార్టీ నేతల నుంచే వెన్నుపోట్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా మూడు నెలల ముందు వచ్చి డబ్బు మూటలతో గెలవాలని ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గూడూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థిగా ఉన్న పాశం సునీల్‌కుమార్ లెక్కకు మించి అవినీతికి పాల్పడిన విషయం జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. సూళ్లూరుపేటలో పరసారత్నంకు నామినేషన్ నుంచి మొదలైన గందరగోళం నేటికి కొనసాగుతుంది. స్థానికుల నేతల వెన్నుపోట్లతో పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేని పరిస్థితి. వెంకటగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న కురుగుండ్ల రామకృష్ణ అయితే కాంట్రాక్టర్లను బెదిరించడం మొదలుకొని అన్ని పనులు భారీగా చేయటంతో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. -
దటీజ్ వైఎస్ జగన్!
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టడంలో రాజీ పడబోనని రాజన్న తనయుడు మరోసారి నిరూపించారు. కుళ్లు రాజకీయాలు చేయబోమని ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడతామన్న మాటను అక్షరాల పాటించి ఆదర్శంగా నిలుస్తున్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు మడమ తిప్పని పోరాటం చేస్తానని జనం సాక్షిగా ఇచ్చిన మాటకు అనుక్షణం కట్టుబాటు చాటుతున్నారు. ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామమే దీనికి తిరుగులేని రుజువు. (రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరమన్నారు) వైఎస్సార్ సీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డి మంగళవారం వైఎస్ జగన్‌ను కలిశారు. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని వైఎస్ జగన్‌ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఆయనకు వైఎస్ జగన్ సూచించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ సూచనతో పదవులకు రాజీనామా చేసేందుకు మల్లికార్జున రెడ్డి అంగీకరించారు. అధికార పదవులు వదులుకున్న తర్వాతే వైఎస్సార్ సీపీలో చేరతానని ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రజాస్వామ్య విలువలు కలిగిన నాయకుడని ప్రశంసించారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఇదే స్ఫూర్తిని వైఎస్ జగన్ చాటారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డిని రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేర్చుకున్నారు. వేరొక పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చే నాయకులు ఆయా పార్టీల కారణంగా వచ్చిన పదవులను వదులుకోవాల్సిందేనంటూ స్పష్టం చేయడం ద్వారా రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేశారు వైఎస్ జగన్. మాటకు కట్టుబడి విలువలు పాటిస్తున్న జననేతకు జనం జేజేలు పలుకుతున్నారు. అభిమానులు ‘దటీజ్ వైఎస్ జగన్’ అంటూ పొంగిపోతున్నారు. -
పెంపుడు కుక్క చూపిన విశ్వాసం
-
కుక్క విశ్వాసంపై మరో వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : మనిషి పట్ల మనిషికి లేని అత్యంత విశ్వాసం కలిగిన పెంపుడు జంతువేది అంటే ఎవరైనా కుక్క అని తేలిగ్గా చెప్పేస్తారు. యజమాని పట్ల కుక్క కుండే విశ్వాసానికి సంబంధించి అనేక సంఘటనలు, అనేకసార్లు చూసే ఉంటాం. మనం తేలిగ్గా చెబుతాంగానీ అవి యజమానికి ఏమైనా అయితే ఎంత భారంగా ఫీలవుతాయో, ఎంతగా ఆరాట పడతాయో తెలియజేసే మరో సంఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని హైలాంగ్జియాంగ్ రాష్ట్రంలోని దాకింగ్ నగరంలో హఠాత్తుగా ఓ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. ఓ అంబులెన్స్ వచ్చి ఆమెను స్ట్రెచర్ మీద ఎక్కించుకుంది. ఆమె వెంట వచ్చిన కుక్క ఆమెను వదిలిపెట్టకుండా స్ట్రెచర్‌పై చేతులేసి యజమానురాలిని లేపేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆ యజమానురాలు కొద్దిగా స్పృహలోకి రావడంతో ఆమెను స్పృహలో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అంబులెన్స్ సిబ్బంది, అంబులెన్స్‌లోకి ఆ కుక్కను కూడా అనుమతించారు. అంబులెన్స్‌లో ఆస్పత్రి వరకు వెన్నంటి వచ్చిన ఆ కుక్క తన యజమానురాలికి చికిత్స సమయంలో కూడా పక్కనే ఉంది. ఆ యజమానురాలు పూర్తిగా స్పహలోకి రాగానే ఆ కుక్కను ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఆ యజమానురాలి పేరు, ఇతర వివరాలు తెలియవుగానీ కుక్క మాత్రం గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందినది. తాము అసలు పెంపుడు జంతువులను ఆస్పత్రిలోకి అనుమతించమని, అయితే ఇక్కడ పేషంట్‌ను స్పృహలో ఉంచాల్సిన అవసరాన్ని, అందుకు సహకరిస్తున్న కుక్కను చూసి అనుమతించామని ‘జాంగ్ జియాంగ్’ ఆస్పత్రి హెడ్ నర్సు ప్రకటించింది. -
మీడియా రంగంలోకి ఎలన్ మస్క్....?
న్యూయార్క్ : ‘జర్నలిజం అతి పురాతనమైన, పవిత్రమైన వృత్తి. ఒకప్పుడు వార్తాపత్రిక అంటే విశ్వసనీయతకు మారుపేరు. మరి నేడు.. అధికారంలో ఎవరూ ఉంటే వారికి కొమ్ముకాసి, భజన చేసి ప్రజల దృష్టిలో వారిని దేవుళ్లను చేసి అసలు నిజాలను ప్రజలకు తెలియకుండా.. తాము చెప్పిందే అక్షరసత్యంగా భ్రమింపచేసే అందమైన అబద్ధంగా మారింది. సమాజంలో ఉన్న అన్ని పత్రికలు ఇలానే ఉంటాయని చెప్పడం లేదు. కానీ ఎక్కువ శాతం ఇలానే ఉంటాయనేది బహిరంగ రహస్యం. పత్రికలకైనా, విలేకరులకైనా ముఖ్యంగా ఉండాల్సింది విశ్వసనీయత. కానీ నేడది నేతి బీరకాయ చందంగా తయారైంది. విలువలు పాటించడంలో తమకు సాటి మరెవరూ లేరని బీరాలు పలికే పత్రికా యజమాన్యాల అసలు రూపం అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం మాత్రమే. ఈ పరిస్థితిని మార్చడానికి నేను ఒక నూతన మార్గాన్ని కనుగొన్నాను. ఇందుకు గాను నేను ఒక వెబ్సైట్ రూపొందిస్తున్నాను. ఇక్కడ మీరు ప్రతి జర్నలిస్టు విశ్వసనీయతకు మార్కులు ఇవ్వొచ్చు. మీరు చదివే ప్రతి కథనానికి సంబంధించి అసలు వాస్తవాలను తెలపవచ్చు. దాని ఆధారంగా సదరు పత్రిక, దాని యాజమాన్యం, ఆ విలేకరి విశ్వసనీయతను విశ్లేషించి మార్కులు ఇవ్వొచ్చు’ అంటున్నారు ప్రపంచ బిలియనీర్, స్పేస్ ఎక్స్ కంపెనీ యజమాని, టెస్లా ఇంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎలన్ మస్క్. ఎలన్‌కు మీడియా మీద ఇంత కోపం రావడానికి కారణం.. కొన్ని నెలలుగా టెస్లా కంపెనీ విడుదల చేసిన సెడాన్ మోడల్ 3 కార్ల గురించి మీడియాలో వరుసగా ప్రతికూల కథనాలు ప్రచురితమవుతున్నాయి. పోయిన వారం కూడా ఒక ప్రముఖ వార్త పత్రిక టెస్లా కంపెనీ సెడాన్ మోడల్ 3 కార్లో బ్రేకింగ్ వ్యవస్థ సరిగా లేదని.. అంతేకాక సెడాన్ మోడల్ 3 కార్లు ఎక్కువగా క్రాష్ అవుతున్నాయని ప్రచురించింది. దీనిపై స్పందిస్తూ ఎలన్ త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ప్రమాణం చేశారు. తమ కార్లకు సంబంధించి ఎన్నో మంచి విషయాలు ఉన్నా కూడా మీడియా సంస్థలు లోపాలనే ఎక్కువగా ప్రచురించి ప్రజల్లో కంపెనీ పట్ల ఉన్న నమ్మకాన్ని నీరుగార్చటంతో తానే స్వయంగా మీడియా రంగంలోకి ప్రవేశించాలని భావించారు మస్క్. దాన్ని గురించి తన మనసులోని మాటను బయటపెట్టారు. పత్రికల వారికి అసలు నిజాలు తెలిసినప్పటికీ వారు చక్కర పూత పూసిన తియ్యని అబద్దాలనే ప్రచారం చేస్తారు. ఎందుకంటే తమ వెబ్సైట్లను/ పత్రికలను ఎక్కువ మంది చూడాలని వారు కోరుకుంటారు. ఎంత ఎక్కువ మంది తమ వెబ్సైట్/పత్రికను చూస్తే వారికి అంత ఎక్కువ మొత్తంలో ప్రకటనలు వస్తాయి. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. అందుకే వారు ఎక్కువగా అహేతుకమైన వాటినే ప్రచురిస్తారని మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి తాను ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఆలోచన తనకు పోయిన ఏడాదిలో వచ్చిందని వెంటనే తన ఆలోచనను తమ న్యూరాలింక్ కంపెనీ అధ్యక్షుడితో పంచుకున్నానన్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మేము ‘ప్రావ్దా క్రాప్(సత్యం) వెబ్ సైట్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రావ్దాను కాలిఫోర్నియాలో రిజిస్టర్ చేయించడం కూడా జరిగిందన్నారు. ఈ విషయాన్ని మస్క్ తన ట్విటర్లో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే దాదాపు 54 వేల మంది ఎలెన్‌కు తమ మద్దతును తెలిపారు. అయితే ఎలన్ వెబ్సైట్ గురించి టెక్ వెబ్సైట్లో ట్రాన్స్‌పోర్టేషన్ రిపోర్టర్‌గా పనిచేసే ఆండ్రూ జే. హకిన్స్ ట్రంప్ గురించి ప్రచారం చేయడానికి మరో కొత్త మీడియా రంగంలోకి ప్రవేశిస్తోందని వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ ఎలన్ ‘అంటే ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని(మీడియా) విమర్శిస్తే మీరు వారిని ట్రంప్‌తో పోలుస్తారన్నమాట. మంచిది మరి ఎన్నికల సమయంలో మీరు ట్రంప్ గురించి ఎంత చెడుగా ప్రచారం చేసిన అతనే గెలిచారు. ఇది ఎందువల్ల జరిగిందో మీకు తెలుసా ఎందుకంటే ప్రజలకు మీ మీద విశ్వాసం లేదు. ఎన్నో ఏళ్ల క్రితమే మీరు దానిని కోల్పోయారు’ అని రీట్విట్ చేశారు. -
న్యాయ వ్యవస్థ పయనం ఎటు?
‘న్యాయస్థానం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు ఆచరణలో కనిపించాలి. ఉన్నత న్యాయస్థానంలో ఆసీనులైన న్యాయమూర్తుల నడత కూడా న్యాయవ్యవస్థ నిష్పాక్షికతలో ప్రజల విశ్వాసం పాదుకొనేలా, దానిని రూఢి పరిచేలా ఉండాలి. ఈ విశ్వసనీయతను తుడిచిపెట్టేసే విధంగా సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల చర్యలు ఉండరాదు.’ – (‘న్యాయమూర్తుల జీవన విలువల పునరుద్ఘాటన’ పేరుతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంయుక్త సమావేశం చర్చించి ఆమోదించి మే 7,1997న విడుదల చేసిన ప్రకటన పత్రం) ‘జ్ఞానం కత్తి వంటిది. దాని విలువ ఆ జ్ఞానాన్ని వినియోగించుకునేవాడి చేతులలో ఉంటుంది. చదువులేని వాడు ఎదుటివారిని వంచించగల శక్తి గల వాడు కాదు. ఎవరినీ మోసగించే ‘కళ’ అతనికి తెలియదు. కానీ చదువుకున్న వాడు మాత్రం నిజాన్ని అబద్ధంగానూ, అబద్ధాన్ని నిజంగానూ తన వాదనా బలం చేత తారుమారు చేయగలడు. ఈ వంచనా శిల్పంతోనే చదువుకున్నవాళ్లు ప్రజలను మోసగిస్తూ ఉంటారు.’ – డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికీ, సుప్రీంకోర్టుకూ మధ్య ఇటీవల తరచూ కొన్ని అంశాల మీద ఘర్షణ వాతావరణం కనిపిస్తున్నది. అది భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు, ప్రజలు తమకు తాము అంకితం చేసు కుంటూ ఆమోదించిన సెక్యులర్, సోషలిస్ట్, గణతంత్ర ప్రజాస్వామ్య సూత్రాల ద్వారా అవతరించిన రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించే వాతావరణం అనిపించదు. వివిధ సవరణల ద్వారా (ప్రగతిశీలమైనవీ, అలా అనిపించుకో లేనివీ) చొచ్చుకు వచ్చిన భావాలతో న్యాయస్థానాలకు, పాలకపక్షాలకు మధ్య అవాంఛనీయ వాతావరణం నెలకొంటున్నది. డాక్టర్ అంబేడ్కర్ తది తరులు రూపొందించిన రాజ్యాంగానికి తరువాతి కాలాలలో తూట్లు పడడా నికి కారణం ఇదే. ప్రభుత్వాన్ని నిర్వహించే పాలకపక్షానికీ (బ్రాండ్ ఏదైనా) శాసన వేదికలకూ న్యాయస్థానాలకూ రాజ్యాంగం బాధ్యతలను విభజిం చింది. అయితే న్యాయస్థానాలకు మరొక అదనపు బాధ్యతను కూడా అప్ప గించింది. అదే– ప్రభుత్వ నిర్ణయాలను, చట్టసభ సభ్యుల నిర్ణయాలను పరిశీ లించి, వాటిలోని తప్పొప్పులను కనిపెట్టి వాత పెట్టడమే. రాజ్యాంగం మార్చే కుట్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకూ వీటి మీద పౌర సమాజం నుంచి వెల్లువె త్తుతున్న రిట్ల ఆధారంగా కోర్టులకు ఉన్న సర్కారును ప్రశ్నించే అధికారానికీ మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరుగుతోంది. ఇందుకు మూలాలు అత్యవసర పరిస్థితి కాలంలో లభిస్తాయి. తన ఇష్టానుసారం జరిగిన నిర్ణయాలకు రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదముద్ర వేయించడానికి నాటి కాంగ్రెస్ పార్టీ ప్రధాని న్యాయవ్యవస్థను వినియోగించుకున్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్నీ, అందులోని ప్రజాస్వామిక నిబంధనలనీ మత ప్రాతిపదికపైన మార్చేందుకు లేదా సవరించేందుకు బీజేపీ పాలనలో ప్రయత్నం జరుగుతున్నది. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం కలిగించే విధంగా పావులు కదపడం ఇందుకు తొలిమెట్టు. న్యాయవ్యవస్థ ప్రత్యేకంగా నెలకొల్పుకున్న కొలీజి యంకు విరుద్ధంగా నేషనల్ జ్యుడీషియల్ కొలీజియంను నెలకొల్పాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది న్యాయ వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యంగా భావించిన న్యాయవ్యవస్థ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇదే చినికి చినికి గాలివాన అయింది. సుప్రీంకోర్టు కొలీజియం (సమష్టి వ్యవస్థ) నిర్మాణంలో కూడా లొసు గులు ఉన్నాయనీ, ముందు వాటిని సవరించుకోవాలనీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చలమేశ్వర్ సూచించారు. అంతేగాని మోదీ ప్రభుత్వం నేషనల్ కొలీజియం ప్రతిపాదనను ఆయన సమర్థించలేదు. అయితే అత్యున్నత న్యాయస్థానం నిర్మాణ సూత్రాల మేరకు ప్రధాన న్యాయమూర్తిని ‘సమాను లలో సమానుడు’గానే భావిస్తూ, న్యాయస్థానం అధిపతిగా గుర్తించారు. కోర్టు పరిశీలనకు వచ్చిన కేసులను ధర్మాసనాలకు కేటాయించే అధికారం అప్పగించారు. ఈ కేటాయింపులలో పక్షపాతం లేకుండా సీనియారిటీని కూడా దృష్టిలో పెట్టుకుని వ్యాజ్యాలను ధర్మాసనాలకు కేటాయించాలన్నది వ్యవహార న్యాయం. ఈ న్యాయం ఎక్కడో దారి తప్పినందునే జస్టిస్ చల మేశ్వర్ సహా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యవస్థను గాడిలో పెట్టడానికి సాహసించి పత్రికా గోష్టిని నిర్వహించవలసి వచ్చింది. సుప్రీం లోని నడవడికను బహిర్గతం చేస్తూ దేశాన్నీ ప్రజలనూ జాగరూకం చేయ వలసి వచ్చింది. చలమేశ్వర్ ప్రభృతుల నిర్ణయం సబబా కాదా అన్నది ఆ తరువాత కొలది రోజుల్లోనే జరిగిన పరిణామం నిరూపిస్తోంది. సంఘర్షణ, సర్దుబాటు న్యాయస్థానం పరిధిలోకి చొరబడే పాలకులకు హెచ్చరికగా 17వ శతాబ్దపు ఇంగ్లండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోక్ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. ఆయన కోర్టు పరువును కాపాడిన తీరు ప్రశంసనీయం. జస్టిస్ కోక్‌ను నియ మించింది జేమ్స్ రాజే, అయినా కోక్‌ను నియంత్రించడానికి ప్రయత్నిం చాడు. ‘నీవు ప్రధాన న్యాయమూర్తివే అయినా పాలకుడిని కాబట్టి కోర్టుల్లో జోక్యం చేసుకుని నేను ఏ కేసునైనా సరే కోర్టుల పరిధి నుంచి తప్పిం చేయగలను’ అని ప్రకటించాడు. అప్పుడు జస్టిస్ సి.జె. కోక్ ‘పాలకుడికి ఆ అధికారం లేదు, ఇంగ్లండ్ చట్టం ప్రకారమే న్యాయస్థాన నిబంధనల ప్రకా రమే, న్యాయచట్టం ప్రకారమే కేసులు పరిష్కారమవుతాయి’ అని ప్రకటిం చాడు. ఈ మాటను అవమానంగా భావించిన జేమ్స్, ‘అంటే, మీ ఉద్దేశం నేను చట్టానికి లొంగి ఉండాలా? ఇది దేశద్రోహం’ అన్నాడు. అందుకు జస్టిస్ కోక్, ‘మీరు పాలకులు, మీరు ఏ వ్యక్తికీ లోబడి ఉండొద్దు. కానీ, చట్టానికి మాత్రం లోబడి ఉండాల్సిందే!’ అన్నాడు. కానీ ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న లార్డ్ మాన్స్ఫీల్డ్ (18వ శతాబ్దం) తన సోదర జడ్జీలతో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంగ్లిష్ ధర్మాసనం కలకలా నికి గురయింది. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హ్యూవర్ట్ (1922–40) తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అభాసుపాలైనాడు. ఇలా రెండు రకాల ఉదాహరణలున్నాయి. మన దేశ తాజా పరిణామాలు కూడా మరొకలా లేవు. కొన్ని కేసుల విషయంలో జరుగుతున్న అవకతవకలను ప్రస్తావిస్తూ, ప్రజల దృష్టికి తెస్తూ జస్టిస్ చలమేశ్వర్ ప్రభృతులు (నలుగురు)చేసిన విన్నపం ఒక ఆలోచనా ధార విజయమని చెప్పకపోయినా, ప్రతిఫలమా అన్నట్టు తాజాగా ఐదుగురు సుప్రీం న్యాయమూర్తులు కూడా (ఎస్.ఎ. బాబ్డే/ ఎన్.వి. రమణ/ యు.వి. లలిత్/ డి.వై. చంద్రచూడ్/ ఎ.కె. సిక్రీ) రంగంలోకి దిగి వివిధ ధర్మాసనాలకు కేసుల కేటాయింపు గురించి ప్రధాన న్యాయమూర్తితో పాటు, నలుగురు (చలమేశ్వర్ ఆధ్వర్యంలో) న్యాయమూర్తులతోనూ చర్చలు జరపడం శుభసూచకమే. కేసుల కేటాయింపు విషయంలో నిర్ణయానికి కమి టీని వేయాలన్న ఐదుగురు న్యాయమూర్తుల ఆలోచన మంచిదే. అయితే– చల మేశ్వర్ ఆధ్వర్యంలో ఆవేదన వెలిబుచ్చిన నలుగురు న్యాయమూర్తులు కేసుల పరిశీలనలో జరుగుతున్న అస్తవ్యస్త వ్యవహారాలను సరిదిద్దడానికి, పాలక రాజ కీయ పెద్దలకు సంబంధం ఉన్న లేదా వారు ఇరుక్కున్నట్లు భావిస్తున్న కేసుల విచారణలో జరుగుతున్న జాప్యానికి, ధర్మాసనానికి కేసుల (తీవ్రమైన ఫిర్యా దులున్న కేసులు)ను విచారణకు నివేదించడంలో జరుగుతున్న తడబాటు గురించి అన్యాపదేశంగా కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారని సమాచారం. ఉదా హరణకు సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు. ఇందులో బీజేపీ నేత అమిత్ షా జైలు పాలైనా కేసు కొట్టివేయడంతో విడుదలయ్యారు. పాత కేసు తిరిగి సీబీఐ స్పెషల్ జడ్జి లోయా కోర్టులో విచారణకు వచ్చింది. ఆ వెంటనే లోయా ఆకస్మి కంగా మరణించారు. జస్టిస్ లోయా మృతి కేసు నేను, ఇతర పాత్రికేయులు వేసిన ‘పిల్’ ఆధారంగా సుప్రీంలో విచారణకు వచ్చింది. ఈ కేసు పర్య వసానాన్ని ఇప్పట్లో ఊహించలేం. ముందుకు వెళ్లిన చర్చ ఈ సమయంలోనే ఐదుగురు గౌరవ న్యాయమూర్తులు సుప్రీం ధర్మాసనాలకు ప్రధాన న్యాయమూర్తి కేటాయించాల్సిన కేసులపై ప్రతిపాదనలు చేశారు. కానీ నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన కేసుల కేటాయింపు పరిష్కారా నికి, ఐదుగురు న్యాయమూర్తులు కొత్తగా ప్రతిపాదించిన పరిష్కారానికి మౌలికమైన తేడా కనిపిస్తోంది. ఎందుకంటే, మధ్యవర్తులలో(ఐదుగురు) ఒక రైన గౌరవ జస్టిస్ చంద్రచూడ్ ఏప్రిల్ 11న ఒక తీర్పు చెప్పారు: ‘కేసులను వివిధ ధర్మాసనాలకు కేటాయించి, బెంచ్‌లను ఏర్పాటు చేసే ప్రత్యేక విశి ష్టాధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంది’ అని స్పష్టం చేశారు. అంటే కేసులు ఏ బెంచ్‌కి నివేదించాలో నిర్ణయించే విశేషాధికారం (మాస్టర్ ఆఫ్ రోస్టర్) ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందని పునరుద్ఘాటించారు. అసలు ప్రశ్న ప్రధాన న్యాయమూర్తి ఏ బెంచ్‌కి ఏ కేసును పరిశీలనార్థం నివేదించాలో నిర్ణ యించే అధికారం ఆయనకు ఉన్నా, ఆయన రాజ్యాంగ ధర్మాసన న్యాయ మూర్తులలో సమానుల మధ్య సరిసమానుడైన వ్యక్తి కాబట్టి, కేసుల కేటా యింపులు సహ న్యాయమూర్తులతో చర్చించిన తరువాతనే కేటాయించాలని జస్టిస్ చలమేశ్వర్, మిగిలిన నలుగురి వాదన. అందుకనే, భావితరాల భద్రత కోసం న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని రక్షించుకోవాలని చలమేశ్వర్ కోరు కుంటున్నారు. అంతేగాదు, పౌర స్వేచ్ఛ, పౌరుడి తిండీ తిప్పల గురించి, మత స్వేచ్ఛ గురించీ పత్రికా స్వేచ్ఛ గురించీ ఆంక్షలు విధించే పాలకులను ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకునే హ్యూగో బ్లాక్ లాంటి మహా మహా అమె రికన్ న్యాయమూర్తులు, అత్యున్నత న్యాయస్థానం ద్వారా సేవలు అందిం చిన గజేంద్ర గాడ్కర్, సవ్యసాచి, వి.ఆర్. కృష్ణయ్యర్, చిన్నప్పరెడ్డి లాంటి ఉద్దండులు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇచ్చిన ప్రాధాన్యం అసాధారణం. అందుకే జస్టిస్ హ్యూగో బ్లాక్ ఇలా ప్రకటించాడు: ‘భావ ప్రకటనా స్వేచ్ఛకు అసలైన అర్థం– ఎదుటివారు అభిప్రాయాల్ని ప్రకటించినందుకు, వారు ఉచ్చ రించే మాటలకు లేదా రాసే రాతలకు నీవు వారిపట్ల హాని తలపెట్టడం కాదు. అదే నా నిశ్చితాభిప్రాయం, ఇందులో మినహాయింపులు లేవు. ఇదే, నా అభిప్రాయం’. ‘మన అధికారాల్ని మన సొంత గౌరవ, మర్యాదల్ని రక్షించు కోడానికి వినియోగించరాద’న్నాడు జస్టిస్ డెన్నింగ్ (ఇంగ్లండ్)! అవును కదా– ‘‘క్షేమం అవిభాజ్యం అన్నందుకే/జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో న్యాయం నాలుగు పాదాల నడుస్తుందనుకోవడం అత్యాశే’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఫేక్ న్యూస్‌కి అటు ఇటూ..!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ‘ఫేక్ న్యూస్’ (నకిలి వార్తలు) అంశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఫేక్‌న్యూస్ రాసినట్టు, ప్రసారం చేసినట్టు నిరూపితమైన జర్నలిస్ట్‌లకు ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డు రద్దుచేస్తామన్న కేంద్ర సమాచారశాఖ వివాదాస్పద పత్రికా ప్రకటన మనదేశంలో సంచలనం సృష్టించింది. దీనిపై దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, రాజకీయపార్టీలు మొదలుకుని అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో కొన్ని గంటల్లోనే ప్రభుత్వం దీన్ని వెనక్కు తీసుకుంది. వచ్చే ఏడాది లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పత్రికలు, మీడియా నియంత్రణ ప్రయత్నాల్లో భాగంగానే జర్నలిస్టుల గుర్తింపు కార్డుల రద్దు ప్రతిపాదన వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. విశ్వసనీయతకు గ్రేడింగ్... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యాజోక్యంపై ఆధారాలు బయటపడుతున్న నేపథ్యంలో ఐరోపా వ్యాప్తంగా ఫేక్‌న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై బ్రసెల్స్ కసరత్తుచేస్తోంది. నకిలి వార్తలపై పోరులో భాగంగా సరిహద్దులు లేని విలేకరులు (రిపోర్టర్స్ వితవుట్ బార్డర్స్–ఆర్ఎస్ఎఫ్), వివిధ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కలిసి మంగళవారం జర్నలిస్టుల కోసం విశ్వాస,పారదార్శకత ప్రమాణాలు ప్రకటించాయి. జర్నలిజం ట్రస్ట్ ఇనిషియేటివ్ (జేటీఐ) ద్వారా స్వతంత్రత, వార్త వనరులు (న్యూస్ సోర్స్), ఉన్నతస్థాయి నైతికత ప్రమాణాలు »ే రీజు వేసి మీడియా సంస్థలను సర్టిఫై చేయాలని భావిస్తున్నారు. దీనికి ఏజెన్సీఫ్రాన్స్ ప్రెస్ (ఏఎఫ్సీ), యూరోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (ఈబీయూ), గ్లోబల్ ఎడిటర్స్ నెట్వర్క్ మద్దతు తెలిపాయి. ఫేక్‌న్యూస్ పేరిట పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కుంటున్న దృష్ట్యా మీడియాకు విశ్వసనీయతను కలిగించేందుకు ఈ చర్య దోహదపడుతుందని ఆర్ఎస్ఎఫ్ అధిపతి క్రొస్టోఫో డెలోరి అభిప్రాయపడ్డారు. ప్రపంచస్థాయిలో వార్తలు, సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా స్వయం నియంత్రిత యంత్రాంగాన్ని తాము ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ట్రంప్‌తో... 2016 ఎన్నికల్లో అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక ఆయనపై అనేక వ్యతిరేకవార్తలొచ్చాయి. మీడియాలో తనపై వచ్చిన కథనాలను ‘ఫేక్‌న్యూస్’గా అభివర్ణిస్తూ ట్రంప్ ఈ పదబంధాన్ని ›ప్రచారంలోకి తీసుకొచ్చారు. దరిమిలా తమకు వ్యతిరేకంగా వచ్చే మీడియా కథనాలు, వార్తాసంస్థల వార్తలను గురించి వివిధదేశాల్లోని నాయకులు ఈ పదాన్నే ఉపయోగించడం పరిపాటిగా మారింది. ఫేక్‌న్యూస్‌తో పాటు తప్పుడు సమాచారంతో జరిగే ప్రచారాల వల్ల ప్రస్తుత సమాజం నిజమైన సవాళ్లనే ఎదుర్కుంటున్నా, ఈ వార్తల నియంత్రణ ముసుగులో పత్రికాస్వేచ్ఛను హరించేందుకు వివిధదేశాల్లోని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మీడియాపై విమర్శలు, దాడికి ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందిస్తుంటారు. ఫేక్‌న్యూస్ స్టోరీలను విమర్శిస్తూ సింక్లర్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ ప్రసారం చేసిన వార్తలను వెనకేసుకొచ్చారు. మలేషియాకు, ఆ దేశ పౌరులకు నష్టం జరిగేలా మలేషియాలో, బయటా అసత్య వార్తలు ప్రచారంలోకి తీసుకొచ్చే వారిపై 5 లక్షల రింగిట్టుల (1.23 లక్షల డాలర్ల) వరకు జరిమానాతో పాటు గరిష్టంగా ఆరేళ్ల జైలుశిక్ష విధించేలా అక్కడి ప్రభుత్వం చట్టం తెచ్చింది. సాథారణ ఎన్నికల నేపథ్యంలో ఈ చట్టపరిధిలోకి వార్తాసంస్థలు, డిజిటల్ పబ్లికేషన్లు, సోషల్ మీడియాను తీసుకొచ్చారు. ఆన్లైన్లో పనిగట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టే అంశాన్ని సింగపూర్ పార్లమెంటరీ కమిటీ సమీక్షిస్తోంది. ఆ దేశ చరిత్రలోనే సుదీర్ఘంగా (8 రోజుల పాటు) సాగిన సమీక్ష గతనెల 29న ముగిసింది. తీసుకురాబోయే కొత్త చట్టంపై వచ్చేనెలలో ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది. ‘రాప్లర్’ అనే న్యూస్సైట్పై తనకు నమ్మకం పోయిందని పేర్కొంటూ అధికార కార్యకలాపాలు కవర్ చేయకుండా ఆ సంస్థపై ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రోడ్రిగొ డ్యూటెర్టొ నిషేధం విధించారు. ఆ సంస్థను ఫేక్‌న్యూస్ సంస్థగా ఆయన అభివర్ణించారు. డ్యూటెర్టో విధానాలు, ప్రకటనల్లో కచ్చితత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, ఎండగట్టడమే ‘రాప్లర్’చేసిన నేరం.ఈ చర్యతో పాటు యాంటీ ఫేక్ న్యూస్ చట్టాన్ని కూడా డ్యూటెర్టొ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పుడు వార్తలకు జరిమానతో పాటు ఇరవై ఏళ్ల వరకు జైలుశిక్ష విధించాలని ప్రతిపాదిస్తున్నాడు. థాయ్‌లాండ్ సైబర్ భద్రతా చట్టం కింద అసత్య సమాచార వ్యాప్తికి ఏడేళ్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అక్కడి రాచరిక కుటుంబం అవమానాల పాలు కాకుండా అడ్డుకునేందుకు ఆ దేశ మిలటరీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. బోగస్ రిపోర్టులు, ఇతరులను కించపరిచేలా చేసిన పోస్టింగ్‌లను వెంటనే తొలగించకపోతే సామాజిక మాధ్యమాలపై 50 మిలియన్ల యూరోల (60 మిలియన్ డాలర్లు) వరకు జరిమానా విధించేలా జర్మనీ ఇప్పటికే చట్టం చేసింది. ఎన్నికల నేపథ్యంలో నకిలి వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఫ్రాన్స్ కూడా చట్టాన్ని రూపొందిస్తోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విశ్వసనీయత కొరతే ప్రతిపక్షాల ప్రధాన సమస్య
అవలోకనం విశ్వసనీయత కొరవడటమనే సమస్య ప్రతిపక్షాలకు తీవ్రమైన చెరుపు చేసింది. మతతత్వవాదం 2019 ఎన్నికల్లో ప్రధాన సమస్య అయ్యే అవకాశం చాలా వరకు లేనట్టే. గోవధ వంటి సమస్యలపై హింసను బీజేపీ చాలా వరకు సాధారణమైనదిగా చేసేయడమే అందుకు కారణం. ప్రతి కొన్ని రోజులకోసారి ముస్లింలను చావబాది హత్యగావించడాన్ని దేశం సౌకర్యంగానే దిగమింగగలుగుతోంది. దాన్నేమీ పెద్ద సమస్యగా చూడటం లేదు. అలా చూస్తుండి ఉంటే దాని ప్రతిఫలనం మనకు కనిపిస్తుంది. అలాంటిదేమీ కనబడటం లేదు. వీటిని చిన్న సమస్యలుగా చూస్తున్నారు. బిహార్ రాజకీయ సంక్షోభం, భారత ప్రతిపక్షాలు ఎదుర్కొంటున్న అంతకంటే మరింత పెద్ద సమస్యను వెల్లడిస్తుంది. అవి ఈ సమస్యను ఎదుర్కొనడం కొనసాగుతూనే ఉంటుంది, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అది వారిని దెబ్బ తీస్తుంది. విశ్వసనీయత అనేదే ఆ పెద్ద సమస్య. బిహార్‌లోని సమస్య చాలా సరళమైనదే. ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ ప్రాథమిక సమాచార నివేదికను (ఎఫ్ఐఆర్)ను దాఖలు చేసింది. యాదవ్‌కు, ఆయన కుటుంబీకులకు ఉన్న కొన్ని ఆస్తుల వివరాలను ప్రభుత్వం వెల్లడి చేసింది లేదా లీకు చేసింది. ఆ ఆరోపణలు ప్రత్యేకించి ఆస్తుల పరిమాణాన్ని బట్టి చూస్తే అతి తీవ్రమైనవి. ఉప ముఖ్యమంత్రికి మద్దతుగా మీడియాలో దాదాపుగా ఎవరూ నిలవలేదు. ఆ కుటుంబ పెద్ద లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ వ్యతిరేక ఉమ్మడి కూటమిని మహా ఉత్సాహంగా సమర్ధించేవారిలో ఒకరు. యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), నితీశ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్–జేడీయూ)ల కూటమి నేతృత్వంలో నడుస్తోంది. ఈ రెండు పార్టీలూ ఒకప్పుడు లోహియా సోషలిజం అనే ఉమ్మడి భావజాలంతో అనుసంధానమై ఉండేవి. భారత రాజకీయాలలోని అతి గొప్ప వ్యక్తులలో ఒకరైన రామ్ మనోహర్ లోహియా పేరుతో ఆ భావజాలాన్ని పిలిచేవారు. ఇప్పుడు దాదాపుగా అందరూ ఆయనను మరచిపోయారు). అసలు సోషలిస్టులంతా కాంగ్రెస్‌ను వ్యతిరేకించేవారే. అయితే భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం పెరగడంతో, ప్రత్యేకించి దాని బాబ్రీ మసీదు వ్యతిరేక ఉద్యమం విజయవంతం కావడంతో... లోహియావాద రాజకీయవేత్తలు హిందుత్వ వ్యతిరేకులుగా మారారు, కాంగ్రెస్‌తో కూటములు కట్టడానికి సిద్ధపడ్డారు. అయితే, జార్జ్ ఫెర్నాండెజ్‌లాంటి కొందరు సోషలిస్టులు తమ కాంగ్రెస్ వ్యతిరేకతావాదానికే కట్టుబడి ఉండిపోయారు. నితీశ్ కుమార్ కూడా కొంత వరకు ఆ బాపతే. అయితే దాదాపు అందరూ తమ అసలు వైఖరైన బీజేపీ వ్యతిరేకతకు తిరిగి వచ్చారు. ఇప్పుడు వారు కపటత్వం, భావజాలాన్ని విస్మరించడం అనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అత్యధిక ప్రజలు పేదలుగా ఉన్న రాష్ట్రాలలో రాజకీయవేత్తలు, వారి కుటుంబాలు కోట్లు కూడబెట్టుకుంటుంటే అది ఎలాంటి సోషలిజం? యాదవ్‌లపై సీబీఐ తయారు చేసిన నివేదికలు వెయ్యి కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బినామీ లావాదేవీలకు సంబంధించినవి. ఇవి ఆరోపణలు మాత్రమేనని, న్యాయస్థానంలో అవి రుజువు కావాల్సి ఉందని నేనూ అంగీకరిస్తాను. కానీ ఆరోపణలను ఎదుర్కొనడానికి చేస్తున్న వాదనలు వాస్తవాలతో కూడినవి కావు. బీజేపీకి భయపడేది లేదు, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతాం తదితర అంశాల వంటి వాటిని యాదవ్‌లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, వంశపారంపర్య పాలనను పెంపొందింపజేస్తోందనేది సోషలిస్టుల మరో అరోపణ. ఇందిరా గాంధీని నెహ్రూ ప్రోత్సహించారని, రాజీవ్ వారసురాలిగా సోనియా కాంగ్రెస్ అధినేత్రి అయ్యారని ఎవరు నిరాకరించగలరు? కానీ, సోషలిస్టులే స్వయంగా వంశపారంపర్య పాలనను ఏర్పరుస్తారని ఊహించలేం. ఉత్తరప్రదేశ్‌లోని యాదవ్‌లు ‘సమాజ్‌వాదీ’పార్టీని చేజిక్కించుకున్నారు. సమాజవాదమనేది పూర్తిగా పేరులోనే మిగిలించిది. మూడోతరం రక్త బంధువుకు లేదా అంకుల్ కుమారుడికి ఇలా లోక్‌సభ లేదా శాసనసభ సీటు ఇచ్చారు, ఎన్నికయ్యారూ అంటే వారిని ప్రభుత్వంలోకి తీసుకోకపోవడం దాదాపుగా జరగదు. దేశంలోని విచ్ఛిన్నకర, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకునే సోషలిస్టుల చరిత్ర ఇదీ. మైనారిటీల పట్ల వారి నిబద్ధత బలమైనది, దేశం పట్ల వారిది సమ్మిళిత దృక్పథం నిజమే. రాజకీయాలలో మతానికి సంబంధించినవి గాక మరే సమస్య విషయంలోనూ వారికి విశ్వసనీయత లేదు. అవినీతి సమస్యపై బిహార్, యూపీలలోని యాదవ్‌లు బీజేపీ, దాని మద్దతుదార్లు సంధించే ఆరోపణలకు బదులు చెప్పడం చాలా కష్టం. విశ్వసనీయత కొరవడటమనే ఈ సమస్య వారికి తీవ్రమైన చెరుపు చేసింది. మతతత్వవాదం 2019 ఎన్నికల్లో ప్రధాన సమస్య అయ్యే అవకాశం చాలా వరకు లేనట్టే. గోవధ వంటి సమస్యలపై హింసను బీజేపీ చాలా వరకు సాధారణమైనదిగా చేసేయడమే అందుకు కారణం. ప్రతి కొన్ని రోజులకోసారి ముస్లింలను చావబాది హత్యగావించడాన్ని దేశం సౌకర్యంగానే ఇముడ్చుకోగలుగుతోంది, దాన్నేమీ పెద్ద సమస్యగా చూడటం లేదు. అలా చూస్తుండి ఉంటే దాని ప్రతిఫలనం మనకు కనిపిస్తుంది. అలాంటిదేమీ కనబడటం లేదు. వీటిని చిన్న సమస్యలుగా చూస్తున్నారు. 2014 ఎన్నికలు పునరావృతం కావడమే ప్రధాన కథనం అవుతుంది. ఉగ్రవాదం పట్ల మెతకగా వ్యవహరించే అవినీతిగ్రస్త రాజకీయవేత్తలు దేశప్రగతికి అడ్డుపడ్డారని, తమ గురించి, తమ కుటుంబాలు సుసంపన్నం కావడం గురించి మాత్రమే ఆసక్తిని చూపి, దేశం నష్టపోవడాన్ని అనుమతించారని మోదీ అంటారు. ఇది అతిగా సాధారణీకరించిన వాదనే కాదు, కచ్చితమైనది కూడా కాదని నా అభిప్రాయం. అయితే ఈ దాడి నుంచి రక్షించుకుంటూ, ఎదురు దాడి చేయడం రాజకీయ ప్రతిపక్షాల పని. వారి ప్రతిస్పందన మతతత్వ ఆరోపణలకే పరిమితమైనంత కాలం అది నెగ్గుకు రాలేదు. అవినీతికి తావు లేకుండా వారు ప్రభుత్వాలను నడపగలుగుతారని అత్యధిక భారతీయులను ఒప్పించగలిగిన కేంద్ర కథనం వారికి అవసరం. మన్మోహన్ సింగ్ ఉన్నట్టుగా, నరేంద్ర మోదీ ఉంటున్నట్టుగా వారు వ్యక్తిగతంగా సందేహాలకు అతీతులుగా ఉండాలి. బిహార్, యూపీ, ఇంకా పలు ఇతర రాష్ట్రాలను చూడండి... ఎన్నో ఏళ్లుగా కళంకితమై ఉన్న అవే ముఖాలను ఇంకా చూడటం ఎలా సాధ్యం? ఈ భారాన్ని మోసుకుంటూ ప్రతిపక్షం 2019లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ సమస్యను గుర్తించి, దాన్ని మార్చడానికి శక్తివంతంగా కృషిచేస్తే తప్ప, ఆ కారణంగా వారు 2014లో లాగే ఓటమి పాలు కాక తప్పదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
'విశ్వసనీయత లేకుంటే భార్య కూడా నమ్మదు'
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని వైెస్సార్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాలు విసిరారు. అయితే అంత ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. మంగళవారం శాసనసభ వాయిదా పడిన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమిచ్చారు. పార్టీ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరనున్న జ్యోతుల నెహ్రూ విషయం ప్రశ్నించినప్పుడు పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత కలిగి ఉండటం ముఖ్యమని తానెప్పుడూ చెబుతుంటాననీ, అవి రెండూ చంద్రబాబుకు లేవని ఆయన మండిపడ్డారు. విశ్వసనీయత లేకుంటే భార్య కూడా ఆ వ్యక్తిని నమ్మదని పేర్కొన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఇస్తానంటూ చంద్రబాబు ప్రలోభాలకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తే ఎక్కువ కాలం నిలబడరని ఆయన అన్నారు. -
సీబీఐ క్రెడిబిలిటిని పెంచుతాం: జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రలో బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్రిడిబిలిటి మరింత పెరిగే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో సీబీఐ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తున్న సమయంలో జితేంద్ర సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాలకు సీబీఐ అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణల్ని ఆయన ఖండించారు. జమ్మూ, కాశ్మీర్ లోని ఉద్దమ్ పూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి బిజేపీ టికెట్ పై గెలుపొందిన జితేంద్ర సింగ్ కు ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖతోపాటు, సిబ్బంది వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ (స్వతంత్ర) శాఖను అప్పగించారు. -
కృష్ణా జిల్లా బంటుమిల్లిలో జగన్ జనభేరి
-
విశ్వసనీయత.. కుళ్లు కుతంత్రాల మధ్య పోటీ
ఈ ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీ ఒకవైపు.. కుళ్లు కుతంత్రాలు మరోవైపు నిలబడి పోటీ చేస్తున్నాయని, విశ్వసనీయతకే ఓటు వేసి సుపరిపాలన తెచ్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో జరిగిన వైఎస్ఆర్ జనభేరిలో ఆయన ప్రసంగించారు. ఈ సభలో ఆయనతో పాటు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి, పెడన ఎమ్మెల్యే అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్ కూడా పాల్గొన్నారు. సభలో జగన్ ఏమన్నారంటే... ''రాజకీయ వ్యవస్థ చెడిపోయింది. విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలు కాగడాతో వెతికినా కనిపించడంలేదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు వచ్చి అదిచేస్తాను, ఇది చేస్తాను, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను, ఇంటికే వచ్చి ఇస్తానంటారు. ఆయన్ను ఒక్కటి అడగండి. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాటలన్నీ ఏమైపోయాయి, వాటిలో ఒక్కటైనా ఎందుకు చేయలేదని నిలదీయండి. రెండు రూపాయల కిలోబియ్యాన్ని 5.25 చేసింది నువ్వు కాదా అని నిలదీయండి. మద్యనిషేధం విధిస్తామని చెప్పి, తర్వాత నిషేధం ఎత్తేయడమే కాదు.. ఏకంగా గ్రామగ్రామాన బెల్టుషాపులు పెట్టించారు. అడ్డగోలుగా సోనియాగాంధీ మన రాష్ట్రాన్ని విడదీస్తుంటే ఒకవైపు అన్యాయమని, మరోవైపు మీ ఎంపీలతో విభజనకు అనుకూలంగా ఎందుకు ఓటేయించి రాష్ట్రాన్ని విభజించావని అడగండి. సాధ్యం కాని హామీలను ఇప్పటికీ ఇలాగే చంద్రబాబు ఇస్తున్నారు. చంద్రబాబులా నేను అబద్ధాలు ఆడను, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయను. ఆయనలా అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పను. ఆయన వయసు 65 సంవత్సరాలు. ఎన్నికలు అయిన తర్వాత తానుండను, తన పార్టీ కూడా ఉండదన్న భావనతోనే ఆయన ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. నాకు ఏదైనా వారసత్వంగా వచ్చిందంటే అది విశ్వసనీయత మాత్రమే. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో.. ఇదే కృష్ణా డెల్టామీద ఆధారపడిన రైతన్నకు కనీసం ఒక్క పంటను కూడా సరిగా ఇవ్వలేదు. అదే రాజశేఖరరెడ్డి వచ్చాక పులిచింతల ప్రాజెక్టు పూర్తిచేసి వందల ఎకరాలకు నీళ్లిచ్చిన నాయకుడు దివంగత రాజశేఖరరెడ్డి. చేతలు చేయలేని చంద్రబాబు.. మాటలు మాత్రం పెద్దగా చెబుతుంటాడు. చేనేత, మత్స్యకార సోదరులకు ఒక్కటే హామీ ఇస్తున్నా. ప్రతి పేదవాడి ముఖంలోను చిరునవ్వు చూసే రోజు తీసుకొస్తా. ఈ ఎన్నికల్లో ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ ఒకవైపుంటే, మరోవైపు కుళ్లు, కుతంత్రాలున్నాయి. విశ్వసనీయతకు ఓటేసి, దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తెచ్చుకుందాం. మీ చల్లని ఆశీస్సులు వేదవ్యాస్, పార్థసారథి ఇద్దరికీ సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా అందించాలని సవినయంగా చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నా.'' -
చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారు