షట్లర్ సింధుకు మంత్రి జితేందర్ అభినందనలు | MINISTER Jitendra congratulates Sindhu for World C'ship bronze | Sakshi
Sakshi News home page

షట్లర్ సింధుకు మంత్రి జితేందర్ అభినందనలు

Published Sun, Aug 11 2013 6:01 PM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

MINISTER Jitendra congratulates Sindhu for World C'ship bronze

న్యూఢిల్లీ: భారత షట్లర్ పి.వి.సింధుకు క్రీడల మంత్రి జితేందర్ సింగ్ అభినందలు తెలిపారు. చైనాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళలు సింగిల్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. జితేందర్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సింధు కాంస్యం సాధించడం యావత్తు దేశానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. 
 
 ప్రపంచ ర్యాకింగ్‌లో 12వ స్థానంలో ఉన్న సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఇద్దరు చైనా మహిళలను కంగుతినిపించి కాంస్యం ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో సింధు 10-21, 13-21 తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement